తెలుగు న్యూస్  /  Sports  /  Fifa World Cup Japan Fans Cleaned The Stadium After The Match Against Germany

FIFA World Cup Japan Fans: హ్యాట్సాఫ్‌ జపాన్‌ ఫ్యాన్స్‌.. మ్యాచ్‌ తర్వాత స్టేడియాన్ని క్లీన్‌ చేసి..

Hari Prasad S HT Telugu

24 November 2022, 16:18 IST

    • FIFA World Cup Japan Fans: హ్యాట్సాఫ్‌ జపాన్‌ ఫ్యాన్స్‌ అనాల్సిందే. ఎందుకంటే వాళ్లు మ్యాచ్‌ తర్వాత స్టేడియాన్ని క్లీన్‌ చేసి మరీ వెళ్లారు. జర్మనీతో మ్యాచ్ తర్వాత కనిపించిన ఈ సీన్‌ చాలా మందిని ఆకట్టుకుంది.
మ్యాచ్ తర్వాత స్టేడియాన్ని శుభ్రం చేస్తున్న జపాన్ అభిమానులు
మ్యాచ్ తర్వాత స్టేడియాన్ని శుభ్రం చేస్తున్న జపాన్ అభిమానులు (Twitter)

మ్యాచ్ తర్వాత స్టేడియాన్ని శుభ్రం చేస్తున్న జపాన్ అభిమానులు

FIFA World Cup Japan Fans: ఫిఫా వరల్డ్‌కప్‌ 2022లో జపాన్‌ టీమ్‌ అద్బుతమే చేసింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే నాలుగుసార్లు ఛాంపియన్‌ జర్మనీని 2-1తో ఓడించి సంచలనం సృష్టించింది. ఈ విజయంతో జపాన్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే విజయాన్ని ఎంతలా సెలబ్రేట్‌ చేసుకున్నా.. వాళ్లు తాము కర్తవ్యాన్ని మాత్రం మరచిపోలేదు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

తమకు అలవాటైన రీతిలోనే ఈ మ్యాచ్ తర్వాత కూడా స్టేడియం మొత్తం క్లీన్‌ చేసి మరీ వెళ్లారు. సాధారణంగా ఏ అభిమానులైనా స్టేడియాలకు వచ్చి మ్యాచ్‌లు ఎంజాయ్ చేసి తర్వాత వెళ్లిపోతారు. కొందరైతే స్టేడియం పరిసరాలను దారుణంగా మార్చేస్తారు. మరికొందరు తమ ఓడిన కోపంలో స్టేడియాల్లో విధ్వంసాలూ సృష్టిస్తారు.

కానీ జపాన్‌ ఫ్యాన్స్‌ తీరే వేరు. వాళ్లు ఏ మ్యాచ్‌ చూసినా తమ టీమ్‌ గెలుపోటములతో సంబంధం లేకుండా స్టేడియమంతా క్లీన్‌ చేసి వెళ్తారు. గతంలోనూ వాళ్లు ఇలాగే చేశారు. ఇప్పుడు జర్మనీతో మ్యాచ్‌ తర్వాతా అదే చేశారు. దోహాలోని ఖలీఫా స్టేడియంలో ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత మిగతా అభిమానులందరూ వెళ్లిపోయినా.. జపాన్‌ ఫ్యాన్స్‌ మాత్రం అక్కడే ఉండే అక్కడున్న చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు.

స్టేడియంలో మెల్లగా ఖాళీ అవుతున్న సమయంలోనే జపాన్‌ అభిమానులు చేతుల్లో బ్యాగులు పట్టుకొని క్లీనింగ్‌ పనిలో పడిపోయారు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా.. జపాన్‌ అభిమానులకు మాత్రం ఇది కామనే. ఇప్పుడు కూడా జపాన్‌ ఫ్యాన్స్‌ స్టేడియాన్ని శుభ్రం చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తమ టీమ్‌ ఆడే మ్యాచ్‌లకే కాదు.. ఏ మ్యాచ్‌ చూసినా కూడా జపాన్‌ అభిమానులు ఇలాగే చేస్తారు. ఈ ఫిఫా వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌ ఖతార్‌, ఈక్వెడార్‌ మధ్య ముగిసిన తర్వాత జపాన్‌ ఫ్యాన్స్‌ స్టేడియం శుభ్రం చేస్తున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. 2018 వరల్డ్‌కప్‌ సందర్భంగా కూడా బెల్జియంతో మ్యాచ్‌లో తమ టీమ్‌ ఓడిపోయిన తర్వాత జపాన్‌ ఫ్యాన్స్‌ బాధలోనూ స్టేడియం మొత్తాన్నీ శుభ్రం చేసి వెళ్లారు.