Japan defeat Germany FIFA WC 2022: జర్మనీకి షాక్.. టైటిల్ ఫేవరెట్ పరాజయం.. చివర్లో సంచలనం సృష్టించిన జపాన్
Japan defeat Germany FIFA WC 2022: నాలుగు సార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జర్మనీకి జపాన్ షాక్ ఇచ్చింది. గ్రూప్-ఈ తొలి మ్యాచ్‌లో ఆ జట్టును 2-1 తేడాతో ఓడించింది. చివర్లో జపాన్ ఆటగాడు టకుమా అసానో అద్భుత గోల్‌తో తమ జట్టును గెలిపించాడు.
Japan defeat Germany FIFA WC 2022: టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్న జట్లు ఆరంభ మ్యాచ్‌లోనే పేలవ ప్రదర్శనతో పరాజయం పాలవుతున్నాయి. మంగళవారం నాడు సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా కంగుతినగా.. తాజాగా మాజీ ప్రపంచ ఛాంపియన్ జర్మనీకి జపాన్ షాకిచ్చింది. ఫిఫా వరల్డ్ 2022 గ్రూప్-ఈలో తలపడిన ఈ రెండు జట్లలో జపాన్ అదిపోయే ప్రదర్శన చేసింది. ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో జపాన్ 2-1 తేడాతో జర్మనీపై విజయం సాధించింది. జపాన్ ఆటగాడు టకుమా అసానో చివర్లో గోల్ సాధించి తమ జట్టును గెలిపించాడు.
ఫస్టాఫ్‌లో ఆధిపత్యం చెలాయించిన జర్మనీ.. 33వ నిమిషంలోనే గోల్ కొట్టింది. జర్మన్ ప్లేయర్ గుండోగన్ గోల్ సాధించడంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి 1-0 తేడాతో ముందువరుసలో ఉంది. అనంతరం పలు మార్లు గోల్ కొట్టే అవకాశమొచ్చినప్పటికీ జర్మనీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అనంతరం సెకాండాఫ్‌లోనూ అవకాశం వచ్చినప్పటికీ గోల్ సాధించలేకపోయింది. ఇలాంటి సమయంలో జపాన్ అద్భుతమే చేసింది.
ముందుగా 75వ నిమిషంలో రిస్తో డాన్ గోల్ కొట్టి స్కోర్లు 1-1తే సమం చేశాడు. మరో 8 నిమిషాలకే 83వ నిమిషంలో టకుమా అసానో గోల్ సాధించి జపాన్‌ను గెలిపించాడు. దీంతో నాలుగు సార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జర్మనీకి తొలి మ్యాచ్‌లోనే పరాభవం తప్పలేదు.
జర్మనీ ఈ విధంగా ఆరంభం మ్యాచ్‌లో పరాజయం పాలవ్వడం ఇదే మొదటి సారి కాదు. గతంలో 2018 ఫిఫా వరల్డ్ కప్‌లోనూ తొలి రౌండులో ఓడిపోయింది. అనంతరం యూరో కప్ 2020లో ఇదే తరహాలో పరాజయం పాలైంది. జర్మనీ వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారిగా 1994లో బల్గేరియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. ఫస్టాఫ్ అంతా ఆధిపత్యం చెలాయించి చివరకు ఓడిపోవడం జర్మనీకి 1978 తర్వాత ఇదే తొలిసారి. ఈ విధంగా మొదటి అర్ధభాగంలో ఆధిపత్యం చెలాయించి ఓడిపోకుండా 21 సార్లు ఆడింది.
సంబంధిత కథనం