తెలుగు న్యూస్  /  Sports  /  Father Arvind On Cheteshwar Pujara: In This Day And Age, I Am Blessed To Have A Son Like Him

Cheteshwar Pujara: వందో టెస్ట్ ఆడనున్న క్రికెటర్ గురించి ఆ తండ్రి జ్ఞాపకాలు

HT Telugu Desk HT Telugu

15 February 2023, 16:32 IST

  • చటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara).. రాహుల్ ద్రవిడ్ తరువాత ఆ స్థాయి క్రికెటింగ్ స్కిల్స్ ను చూపుతున్న ప్లేయర్. ఈ శుక్రవారం పుజారా తన 100వ టెస్ట్ ఆడుతున్నాడు. 100 టెస్ట్ ల రికార్డు సాధించిన 13వ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ పుజారా.

చటేశ్వర్ పుజారా (ఫైల్ ఫొటో)
చటేశ్వర్ పుజారా (ఫైల్ ఫొటో)

చటేశ్వర్ పుజారా (ఫైల్ ఫొటో)

అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ గా చటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ను నిలపడంలో ఆయన తండ్రి అరవింద్ పాత్ర చాలా కీలకం. పుజారాకు వ్యక్తిగతంగా తండ్రిగానే కాదు, ప్రొఫెషనల్ గా కోచ్ గానూ విలువైన సహకారం అందించాడు. తన కుమారుడు చటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) వందో టెస్ట్ ఆడుతున్న సందర్భంగా పుజారా తండ్రి అరవింద్ పంచుకున్న భావోద్వేగ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

Cheteshwar Pujara father Araavind memories: పుజారా తండ్రి అరవింద్ భావోద్వేగ జ్ఞాపకాలు

  • పుజారా (Cheteshwar Pujara) పై తల్లి ప్రభావం ఎక్కువ. తల్లి నేర్పించిన విలువలను పుజారా ఎప్పుడూ పాటిస్తూనే ఉంటాడు. ప్రేమాభిమానాలను పంచడంలోనే పుజారాది తల్లి బాటనే.
  • పుజారా (Cheteshwar Pujara) ఇండియన్ టీమ్ కు ఆడడాన్ని పుజారా తల్లి చూడలేకపోయింది. పుజారాకు 17 వయస్సు ఉండగా, ఆమె కేన్సర్ తో చనిపోయింది. ఇప్పుడు ఆమె జీవించి ఉంటే, పుజారా సక్సెస్ ను చూసి ఆమె కన్నా ఎక్కువ సంతోషించేవారు ఎవరూ ఉండేవారు కాదు.
  • కానీ, పుజారా (Cheteshwar Pujara)లో ఆమె నాటిన క్రమశిక్షణ, విలువలు, స్నేహతత్వం .. మొదలైనవి పుజారా వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతో ఉపయోగపడ్డాయి.
  • చిన్నప్పటి నుంచి పుజారా (Cheteshwar Pujara) స్పోర్ట్స్ పర్సనాలిటీ. తను మంచి క్రికెటర్ కాగలడని నేను అప్పుడే అనుకున్నాను. వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ట్రైనప్ చేశాను.
  • పుజారా (Cheteshwar Pujara)తో నేనెప్పుడూ ఒక స్నేహితుడిగానే ఉండేవాడిని. అతడిని నేనెప్పుడూ తిట్టడం కానీ, కొట్టడం కానీ చేయలేదు. అయినా, నేను చెప్పిన ప్రతీ మాటను కచ్చితంగా వినేవాడు.. పాటించేవాడు.
  • చిన్నప్పుడు ఇరుగుపొరుగు ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడడం వాడికి చాలా ఇష్టంగా ఉండేది. అయితే, వారు టెన్నిస్ బాల్ తో ఆడుతండేవారు. టెన్నిస్ బాల్ పై బ్యాటింగ్ చేయడం వల్ల బ్యాటింగ్ టెక్నిక్ మారుతుంది. బాల్ బౌన్స్ కావడం వల్ల క్రాస్ బ్యాటెడ్ షాట్స్ ఆడడం అలవాటు అవుతుంది. అది ఫ్యుచర్ లో ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ తో ఆడుకో.. కానీ బ్యాటింగ్ చేయకు.. వికెట్ కీపింగ్ చేయమని చెప్పాను. తను (Cheteshwar Pujara) అదే ఫాలో అయ్యాడు.
  • చటేశ్వర్ భార్య పూజ అతడికి అవసరమైన ఎమోషనల్ సపోర్ట్ ఇస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఒక అప్ కమింగ్ ప్లేయర్ కు జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల నుంచి ఆ ఎమోషనల్ సపోర్ట్ లభించడం చాలా అవసరం.