తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup 2022 Fastest Goal: 67 సెకండ్ల‌లోనే గోల్ - కెన‌డా ప్లేయ‌ర్ డేవిస్ రికార్డ్‌

Fifa World Cup 2022 Fastest Goal: 67 సెకండ్ల‌లోనే గోల్ - కెన‌డా ప్లేయ‌ర్ డేవిస్ రికార్డ్‌

28 November 2022, 12:05 IST

  • Fifa World Cup 2022 Fastest Goal: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022లో అత్యంత వేగంగా గోల్ చేసిన ప్లేయ‌ర్‌గా కెన‌డా ఫుట్‌బాల‌ర్ అల్ఫాన్సో డేవిస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. క్రొయేషియాతో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో ఆట ఆరంభ‌మైన 67 సెకండ్ల‌లోనే డేవిస్ గోల్ చేశాడు.

అల్ఫాన్సో డేవిస్
అల్ఫాన్సో డేవిస్

అల్ఫాన్సో డేవిస్

Fifa World Cup 2022 Fastest Goal: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన ప్లేయ‌ర్‌గా కెన‌డా ఫుట్‌బాల‌ర్ అల్ఫాన్సో డేవిస్ నిలిచాడు. ఆదివారం క్రోయేషియాతో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈ రికార్డ్ సాధించాడు. ఆదివారం గ్రూప్ ఎఫ్‌లో భాగంగా క్రొయేషియా, కెన‌డా మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

ఈ మ్యాచ్ మొద‌లైన 67 సెకండ్ల‌లోనే అల్ఫాన్సో డేవిస్ గోల్ చేసి కెన‌డాకు శుభారాంభాన్ని అందించాడు. ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన ప్లేయ‌ర్‌గా డేవిస్ నిలిచాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో డేవిస్‌కు ఇదే తొలి గోల్ కావ‌డం గ‌మ‌నార్హం. కెన‌డాకు డేవిస్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చినా ఈ మ్యాచ్‌లో ఆ జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు.

ఈ మ్యాచ్‌లో క్రొయేషియా 4-1 తేడాతో కెన‌డాను ఓడించింది. క్రొయోషియా ఆట‌గాళ్ల‌లో క్ర‌మ‌రిక్ రెండు గోల్స్ చేయగా… వివాజా, మ‌జేర్ త‌లో ఒక్క గోల్ చేశారు. గ్రూప్ స్టేజ్‌లో రెండు మ్యాచ్‌ల‌లో ఓట‌మి పాలైన కెన‌డా వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది.

వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన రికార్డ్ ట‌ర్కీ ప్లేయ‌ర్ హ‌కాన్ సుకుర్ పేరు మీద ఉంది. 2002 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సౌత్ కొరియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆట ఆరంభ‌మైన 11 సెకండ్ల‌లోనే హ‌కాన్ సుకుర్ గోల్ చేశాడు. ఇర‌వై ఏళ్ల‌యిన ఆ రికార్డ్‌ను ఇప్ప‌టికీ ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేక‌పోయారు.