తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Aaron Finch Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు ఫించ్ గుడ్‌బై.. ఆసీస్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా గుర్తింపు

Aaron Finch Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు ఫించ్ గుడ్‌బై.. ఆసీస్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా గుర్తింపు

07 February 2023, 11:05 IST

    • Aaron Finch Retirement: ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించాడు. మంగళవారం ఉదయం తాను ఈ విషయాన్ని తెలియజేశాడు. సుదీర్ఘ కెరీర్‌లో వైట్ బాల్ క్రికెట్‌లో కంగారూ జట్టును అత్యుత్తమ దశలో నిలిపాడు.
ఆరోన్ ఫించ్
ఆరోన్ ఫించ్ (AP)

ఆరోన్ ఫించ్

Aaron Finch Retirement: ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం ఉదయాన్నే తను వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేశాడు. ఆసీస్‌కు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా ఫించ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో 76, వన్డేల్లో 55 విజయాలను అందించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే తన సుదీర్ఘ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 254 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 5 టెస్టులు, 146 వన్డేలు, 103 టీ20లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు ఆడబోనని ముందే గ్రహించి.. క్రికెట్ నుంచి వైదొలగడానికి ఇప్పుడే సరైన సమయమని భావిస్తున్నాను. ఆ ఈవెంట్‌ను సరిగ్గా ప్లాన్ చేయడానికి జట్టుకు సరైన సమయం ఇవ్వాలి. నా అంతర్జాతీయ కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అని ఫించ్ స్పష్టం చేశాడు.

2011 జనవరిలో ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు ఫించ్. అప్పటి నుంచి వన్డేల్లో 17 సెంచరీలు, 2 టీ20 శతకాలు చేశాడు. మొత్తం కలిపి 8,804 పరుగులు చేశాడు. ఫించ్ తన వన్డే కెరీర్‌ను గతేడాది సెప్టెంబరులో ముగించాడు. టీ20లకు మాత్రం ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఇందులో 63 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే ఐర్లాండ్‌ను 42 పరుగుల తేడాతో ఓడించింది. కానీ సెమీస్‌కు చేరలేకపోయింది కంగారూ జట్టు.

టీ20 కెప్టెన్‌గా ఆసీస్‌ను ఫించ్ అత్యున్నత స్థాయిలో నిలిపాడు. 2020లో అతడు ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డుకు నామినేట్ అయ్యారు. 2018లో హరారేలో జింబాబ్వేపై 76 బంతుల్లోనే 172 పరుగులు చేసింది అత్యధిక టీ20 స్కోరర్‌గా రికార్డు సృష్టించాడు. ఇందులో 10 సిక్సర్లు, 16 ఫోర్లు ఉన్నాయి. అంతకుముందు 2013లో ఇంగ్లాండ్‌పై 63 బంతుల్లో 156 పరుగులు చశాడు. ఇది టీ20ల్లో మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. 36 ఏళ్ల ఫించ్ 2015 ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌లో 2021లో టీ20 ప్రపంచకప్ జట్టుకు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ విజయాల పరంపరను కొనసాగించాడు.