తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashwin Defends Dravid: ద్రవిడ్‌‌పై రవిశాస్త్రీ విమర్శలు.. భారత కోచ్‌ను వెనకేసుకొచ్చిన అశ్విన్

Ashwin Defends Dravid: ద్రవిడ్‌‌పై రవిశాస్త్రీ విమర్శలు.. భారత కోచ్‌ను వెనకేసుకొచ్చిన అశ్విన్

19 November 2022, 8:44 IST

    • Ashwin Defends Dravid: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ న్యూజిలాండ్ పర్యటనకు విశ్రాంతి తీసుకోవడంపై రవిశాస్త్రీ విమర్శలు సంధించారు. అయితే ఈ విషయంలో ద్రవిడ్‌ను సమర్థించాడు భారత క్రికెటర్ అశ్విన్.
రవిచంద్రన్ అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ (AFP)

రవిచంద్రన్ అశ్విన్

Ashwin Defends Dravid: టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ సహా టీమ్‌లో సీనియర్ ఆటగాళ్లకు ఈ పర్యటనకు విశ్రాంతినివ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా ఈ సిరీస్‌ జరుగుతోంది. ఈ విషయంలో మాజీ కోచ్ రవిశాస్త్రీ విమర్శలు గుప్పించారు. టీ20 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత బ్రేక్ తీసుకోవాల్సినంత అవసరమేముంది అంటూ ద్రవిడ్‌పై ఫైర్ అయ్యారు. తాను ఈ బ్రేక్స్‌ను పెద్దగా నమ్మనంటూ స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"నేను బ్రేక్స్‌ను నమ్మను. నేను నా జట్టులో ఆటగాళ్లు, టీమ్ కంట్రోల్ గురించి అర్థం చేసుకోవాడనికి ప్రయత్నిస్తాను. నిజాయితీగా మాట్లాడుకుంటే ఎక్కువ బ్రేక్స్ తీసుకోవావల్సినంత అవసరమేముంది? ఐపీఎల్ సమయంలో 2, 3 నెలల పాటు విశ్రాంతి లభిస్తుంది. కోచ్‌కు అది సరిపోదా? ఇతర సమయాల్లో కోచ్ అందుబాటులో ఉండాలి. అది ఎవరైనా కానీ." అని రవిశాస్త్రీ స్పష్టం చేశాడు.

రవిశాస్త్రీ వ్యాఖ్యలపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. టీ20 వరల్డ్ కప్ వల్ల కోచింగ్ సిబ్బంది ఫిజికల్‌గా మెంటల్‌గా ఒత్తిడిని ఎదుర్కొన్నారని, అందుకు విశ్రాంతి అవసరమని ద్రవిడ్‌ను సమర్థించే ప్రయత్నం చేశాడు.

"న్యూజిలాండ్ పర్యటనకు పూర్తిగా విభిన్నమైన జట్టుతో లక్ష్మణ్ ఎందుకు వెళ్లారో నేను వివరిస్తాను. రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఆయన టీమ్.. టీ20 వరల్డ్ కప్ సమయంలో విరామం లేకుండా హార్ట్ వర్క్ చేశారు. ఆడే ప్రత్యర్థి గురించి వ్యూహాలు అమలు చేయడంలో నిర్విరామంగా పనిచేశారు. కాబట్టి అలాంటి సమయంలో మానసికంగానే కాకుండా.. భౌతికంగా కూడా ప్రతి ఒక్కరికి బ్రేక్ అవసరం. న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత మనకు బంగ్లాదేశ్ పర్యటన ఉంది. అందువల్ల పూర్తిగా భిన్నమైన లక్ష్మణ్ కోచింగ్ స్టాఫ్‌ను ఎంచుకున్నారు. ద్రవిడ్ బంగ్లా టూర్ కల్లా తిరిగొస్తారు." అని అశ్విన్ తెలిపాడు.

ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో భారత్ కివీస్‌తో 3 టీ2ల సిరీస్ సహా.. మూడు వన్డేల సిరీస్ కూడా ఆడుతుంది. టీ20లకు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి టీ20 శుక్రవారం జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా రద్దయింది. రెండో టీ20 ఆదివారం నాడు జరగనుంది. టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది భారత్. ఈ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.