Ravi Shastri Praises Suryakumar: సూర్యకుమార్‌పై రవిశాస్త్రీ ప్రశంసలు.. మూడు ఫార్మాట్ ప్లేయర్ అని స్పష్టం-ravi shastri says suryakumar yadav is three format player ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri Praises Suryakumar: సూర్యకుమార్‌పై రవిశాస్త్రీ ప్రశంసలు.. మూడు ఫార్మాట్ ప్లేయర్ అని స్పష్టం

Ravi Shastri Praises Suryakumar: సూర్యకుమార్‌పై రవిశాస్త్రీ ప్రశంసలు.. మూడు ఫార్మాట్ ప్లేయర్ అని స్పష్టం

Maragani Govardhan HT Telugu
Oct 28, 2022 10:37 PM IST

Ravi Shastri Praises Suryakumar: టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రీ కూడా సూర్యకుమార్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు. అతడు మూడు ఫార్మాట్లలోనూ అదరగొడతాడని స్పష్టం చేశాడు.

సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (AFP)

Ravi Shastri Praises Suryakumar: టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆసియా కప్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన సూర్యకుమార్.. ప్రస్తుతం జరుగుతున్న పొట్టి ప్రపంచకప్‌లోనూ మెరుగ్గా రాణిస్తున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోనప్పటికీ గురువారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి దుమ్మురేపాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రీ కూడా సూర్యకుమార్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు. అతడు మూడు ఫార్మాట్లలోనూ అదరగొడతాడని స్పష్టం చేశాడు.

"అతుడు మూడు ఫార్మాట్ల ప్లేయర్ అని అనుకుంటున్నా. ఎవ్వరూ సూర్యకుమార్‌ను టెస్టు క్రికెట్‌లో తీసుకోవడంపై పెద్దగా మాట్లడాలేదు. కానీ నాకు తెలిసి అతడు టెస్టు క్రికెట్ కూడా అద్భుతంగా ఆడతాడు. కొన్నిసార్లు మీరు ఆశ్చర్యానికి పోతారు. అతడి టెస్టుల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రప్పిస్తే అద్భుతంగా ఆడతాడు." అని రవి శాస్త్రీ స్పష్టం చేశాడు.

సూర్యకుమార్ యాదవ్‌పై నెదర్లాండ్స్‌పై అద్భుతంగా ఆడాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తన చివరి బంతికి సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వేగవంతమైన ఇన్నింగ్సులను నెమ్మదిగా ప్రారంభించిన తర్వాత రన్ రేటు పెరిగింది. అయితే నెదర్లాండ్స్ ‌కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంతో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ తన అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం అయినప్పటి నుంచి టీ20ల్లోనే ఆడుతోంది. ప్రస్తుతం తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

పేస్, స్పిన్ రెండింటిలోనూ అతడు అద్భుతంగా ఆడాడు. టాపార్డర్ వైఫల్యం కారణంగా అనేక సందర్భాల్లో సూర్యకుమార్ తన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. ఆ విధంగా 2021లో జట్టులో అరంగేట్రం చేసిన సూర్యకుమార్.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో కీలక ప్లేయర్‌గా మారాడు.

WhatsApp channel

సంబంధిత కథనం