తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashish Nehra: చాహల్‌తో 2 ఓవర్లే వేయించడమేంటి? పంత్ నిర్ణయంపై నెహ్రా అసహనం

Ashish Nehra: చాహల్‌తో 2 ఓవర్లే వేయించడమేంటి? పంత్ నిర్ణయంపై నెహ్రా అసహనం

10 June 2022, 17:23 IST

    • సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత కెప్టెన్ రిషభ్ పంత్ నిర్ణయాలను మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తప్పుబట్టాడు. ముఖ్యంగా చాహల్‌తో కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేయించడాన్ని తప్పుబట్టాడు.
రిషభ్ పంత్
రిషభ్ పంత్ (AFP)

రిషభ్ పంత్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ కెప్టెన్సీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీలు కూడా అతడి నిర్ణయాలను తప్పుపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కూడా చేరాడు. కొన్ని నిర్ణయాల్లో పంత్ ఇంకా పరిణితి చూపించాలని అన్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ పర్పుల్ క్యాప్ విన్నర్ అయిన యజువేంద్ర చాహల్‌తో కేవలం 2 ఓవర్లే బౌలింగ్ చేయించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"రిషభ్ పంత్ యువ సారథి. మెరుగ్గా ఎలా రాణించాలో అతడు క్రమేణా నేర్చుకుంటాడు. కానీ ద్రవిడ్ ఒకవేళ చాహల్‌తో ఓవర్ బౌలింగ్ చేయించాలనుకుంటే ఆ మెసేజ్ తప్పకుండా పంపే ఉంటాడు. వాళ్లు ఈ విషయంలో సింపుల్‌గా, చురుకుగా ఉండాలి. చాహల్ లాంటి స్టార్ బౌలర్ కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం నాకు చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. వాన్ డెర్ డుస్సెన్, మిల్లర్ జోడీకి బౌలింగ్ చేసి ఉండాల్సింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఛేదనలో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే చాహల్‌ను ఉపయోగించుకోవాల్సింది. ఈ విషయంలో పంత్ కచ్చితంగా తప్పు చేశాడు. పవర్ ప్లేలోనూ ఆరు ఓవర్లలో ఐదుగురు బౌలర్లను ఉపయోగించాడు." అని నెహ్రా.. పంత్ నిర్ణయాలను తప్పుపట్టాడు.

ఈ మ్యాచ్‌లో చాహల్ కేవలం 13 బంతులు వేసి 26 పరుగులిచ్చాడు. డుసెన్-మిల్లర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు చాహల్‌కు బౌలింగ్ ఇవ్వలేదు పంత్. ఫలితంగా గురువారం జరిగిన తొలి టీ20లో 212 భారీ లక్ష్యాన్ని ప్రొటీస్ జట్టు సునాయసంగా ఛేదించింది.

దిల్లీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన కొండంత లక్ష్యం సఫారీ బ్యాటర్ల ముందు చిన్నబోయింది. ఆరంభంలో కాస్త తడబడినా చివర్లో డేవిడ్ మిల్లర్(64), డుసెన్(75) ధాటికి 212 పరుగుల లక్ష్యం ఏమాత్రం సరిపోలేదు. ఇద్దరూ అర్ధ శతకాలతో విజృంభించారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రొటీస్ బ్యాటర్లు చివర్లో ఎదురుదాడికి దిగి మరి విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, భువనేశ్వర్, అక్షర్ పటేల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాపిక్