తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Anushka Emotional Post On Kohli: కోహ్లీ సెంచరీ తర్వాత అనుష్క ఎలా స్పందించిందో తెలుసా?

Anushka Emotional Post on Kohli: కోహ్లీ సెంచరీ తర్వాత అనుష్క ఎలా స్పందించిందో తెలుసా?

16 January 2023, 8:15 IST

    • Anushka Emotional Post on Kohli: విరాట్ కోహ్లీ వన్డేల్లో 46వ శతకాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై ఈ అతడు ఈ సెంచరీ చేయడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా ఎమోషనల్ పోస్టు పెట్టింది.
అనుష్క-విరాట్ కోహ్లీ
అనుష్క-విరాట్ కోహ్లీ (Anushka Sharma Instagram)

అనుష్క-విరాట్ కోహ్లీ

Anushka Emotional Post on Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆదివారం నాడు శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారీ శతకంతో విజృంభించిన విషయం తెలిసిందే. ఫలితంగా 390 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది టీమిండియా. అంతేకాకుండా అనంతరం బౌలింగ్‌లోనూ అదరగొట్టి తన 317 పరుగుల భారీతేడాతో ఘనవిజయం సాధించింది. కెరీర్‌లో 46వ వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకున్న విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు మాజీలు అతడిని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా.. తాజాగా కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని పోస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

“ఏం ఆటగాడు.. ఏం ఇన్నింగ్స్ ఆడాడు.. శభాష్” అంటూ తన ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టింది. అంతేకాకుండా హార్ట్ ఎమోషన్‌ను కూడా జత చేసింది. భర్త ఘనతను చూసి తన ఆనందాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ప్రస్తుతం అనుష్క శర్మ పోస్టు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా వన్డేల్లో కోహ్లీ 12,754 పరుగుల చేశాడు. 259 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. దీంతో 50 ఓవర్ల క్రికెట్‌లో మహేలా జయవర్దనేను(12.650)ను అధిగిమించి టాప్-5 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీకి ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం.

తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(116), విరాట్ కోహ్లీ(166) సెంచరీలతో భారత్ 390 పరుగులు భారీ స్కోరు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో లంక జట్టు ఘోరంగా విఫలమైంది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 73 పరుగులకే ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. ఫలితంగా 317 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది.