Andy Flower Wtc Final: డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు రోజు ఆసీస్ టీమ్‌లో చేరిన ఆండీ ఫ్లవర్ - కన్సల్టెంట్‌గా ఎంపిక
07 June 2023, 7:22 IST
Andy Flower Wtc Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమ్ కన్సల్టెంట్‌గా లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ ఆండీ ఫ్లవర్‌ను ఆస్ట్రేలియా టీమ్ నియమించుకోవడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఆండీ ఫ్లవర్
Andy Flower Wtc Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫిష్‌ను సొంతం చేసుకునేందుకు ఆస్ట్రేలియా ఏ అవకాశాన్ని వదులుకోకూడదని నిశ్చయించుకున్నది. ఈ ఫైనల్‌లో ఇండియా ఓడించి విజేతగా నిలిచేందుకు అన్ని మార్గాల్ని అన్వేషిస్తోంది.
తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు రోజు జింబాబ్వే మాజీ ప్లేయర్, లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ ఆండీ ఫ్లవర్‌ను టీమ్ కన్సలెంట్‌గా ఆస్ట్రేలియా నియమించుకోవడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అస్ట్రేలియా కోచ్, ఇతర సపోర్టింగ్ టీమ్‌తో కలిసి ఆండీ ఫ్లవర్ పనిచేయబోతున్నాడు. బ్యాటింగ్ తో పాటు జట్టు కూర్పు పరంగా ఆండీ ఫ్లవర్ జట్టుకు సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆండీ ఫ్లవర్ కు ఇంగ్లాండ్ పిచ్‌లపై పూర్తిగా అవగాహన ఉంది. నాలుగేళ్ల ఇంగ్లాండ్‌కు కోచ్‌గా పనిచేశాడు.
అతడి మార్గదర్శనంలోనే ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన విజయాల్ని అందుకున్నది. యాషెస్ సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్ కప్‌ను దక్కించుకున్నది. ఆండీ ఫ్లవర్‌కు ఉన్న అనుభవం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి. జూన్ 7 నుంచి (నేటి నుంచి) 11 వరకు ఇండియా ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది.
ఈ ఫైనల్‌కు లండన్‌లోని ఓవల్ ఆతిథ్యం ఇవ్వనుంది. కేవలం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం మాత్రమే కాకుండా యాషెస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని కన్సెల్టెంట్‌గా ఆండీ ఫ్లవర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు చెబుతోన్నాయి. యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 16 నుంచి మొదలుకానుంది.