తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Alzarri Joseph Record: వెస్టిండీస్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ రికార్డు.. 2022లో అత్యధిక వికెట్లు

Alzarri Joseph Record: వెస్టిండీస్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ రికార్డు.. 2022లో అత్యధిక వికెట్లు

Hari Prasad S HT Telugu

09 December 2022, 14:51 IST

    • Alzarri Joseph Record: వెస్టిండీస్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ రికార్డు సృష్టించాడు. అతడు 2022లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో జోసెఫ్‌ ఈ రికార్డును అందుకున్నాడు.
వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్
వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ (AP)

వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్

Alzarri Joseph Record: వెస్టిండీస్‌ పేస్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ శుక్రవారం (డిసెంబర్‌ 9) ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 2022లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న డేనైట్‌ టెస్ట్‌లో జోసెఫ్‌ ఈ రికార్డు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు అతడు 33 మ్యాచ్‌లలో 65 వికెట్లతో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌ తీసిన జోసెఫ్.. 66 వికెట్లతో టాప్‌లో ఉన్న నేపాల్ బౌలర్‌ సందీప్‌ లామిచానెను సమం చేశాడు. సందీప్ 2022లో 32 మ్యాచ్‌లలో 66 వికెట్లు తీసుకున్నాడు. ఇక రెండో రోజు ఆటలో సందీప్‌ రికార్డును జోసెఫ్‌ బ్రేక్‌ చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ కామెరాన్‌ గ్రీన్‌ను ఔట్ చేయడం ద్వారా జోసెఫ్‌ వికెట్ల సంఖ్య 67కు చేరింది.

2022లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇది అతనికి 34వ మ్యాచ్‌. ఈ ఏడాది 17 వన్డేల్లో జోసెఫ్‌ 27 వికెట్లు తీశాడు. ఈ ఏడాది టాప్ ఫామ్‌లో ఉన్నా.. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో మాత్రం అతడు వికెట్ తీయలేకపోయాడు. దీంతో వెస్టిండీస్ 164 రన్స్‌ తేడాతో ఓడిపోయింది. 2016లో వెస్టిండీస్‌ తరఫున అరంగేట్రం చేశాడు అల్జారీ జోసెఫ్‌. అప్పటి నుంచి టెస్టులు, వన్డేల్లో వెస్టిండీస్‌కు కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఇక ఇప్పటి వరకూ విండీస్‌ తరఫున 10 టీ20లు ఆడిన అతడు.. 16 వికెట్లు తీశాడు.

ఇదే ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ లబుషేన్ కూడా ఓ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. అతడు టెస్టుల్లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తన 51వ ఇన్నింగ్స్‌లో ఈ మైల్‌స్టోన్‌ను చేరుకున్న లబుషేన్‌.. బ్రాడ్‌మన్‌ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.