తెలుగు న్యూస్  /  Sports  /  Ab De Villiers Says Rcb Can Win Multiple Ipl Titles If They Can Bag Their First

AB de Villiers About RCB: ఆ ఒక్క అడ్డంకి అధిగమిస్తే.. 4 సార్లు ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీదే.. డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్

18 November 2022, 20:08 IST

    • AB de Villiers About RCB: ఆర్సీబీ త్వరగా ఒక్క అడ్డంకి అధిగమిస్తే ఐపీఎల్ టైటిల్ చాలా సార్లు గెలుస్తుందని ఆ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. 2021లో ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన అతడు.. వచ్చే సీజన్‌కు పునరాగమనం చేసే అవకాశముంది.
ఏబీ డివిలియర్స్
ఏబీ డివిలియర్స్

ఏబీ డివిలియర్స్

AB de Villiers About RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. ఏటా దేశవ్యాప్తంగా ఈ టోర్నీ ఓ ఉత్సవంలా జరుగుతుంది. సాయంత్రమైందంటే చాలు.. క్రీడాభిమానులకు ఫుల్ టైంపాస్ అవుతుంది. ఇప్పటివరకు 15 సీజన్లు జరుగ్గా.. అత్యధికంగా ముంబయి 5 సార్లు, చెన్నై 4 సార్లు నెగ్గాయి. ప్రతిసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఒక్కసారి గెలవలేకపోయింది. ఈ సారైనా గెలుస్తుందని చూస్తున్న ఆర్సీబీ అభిమానులకు నిరాశే మిగులుతుంది. ఒక్కసారైనా ఐపీఎల్ విజేతగా గెలిస్తే చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్సీబీ ఒక్కసారి కాదు.. 2, 3, 4 సార్లు గెలుస్తుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. ఓ ఛానల్‌తో మాట్లాడిన వీడియోలో ఈ విధంగా స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"ఇప్పటి వరకు ఓ 14, 15 సీజన్లు జరుగుంటాయి. ఏన్ని జరిగితే ఏం కానీ.. ఆర్సీబీ త్వరగా తన ఓటమి సంకెళ్లను తెంచుకుంది. ఒక్కసారి ఐపీఎల్ విజేతగా నిలిచిందంటే చాలు.. ఆ జట్టుకు ఇంక తిరుగుండదని నేను భావిస్తున్నాను. 2, 3, 4 సార్లయినా గెలుస్తుంది. అప్పటి వరకు ఏం జరుగుతుందో మనం వేచి చూడాలంతే. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో ఏ జరుగుతుందో ఊహించలేం. ఆర్సీబీ సత్తా చాటుతుందని ఆశిద్దాం." అని డివిలియర్స్ స్పష్టం చేశాడు.

డివిలియర్స్ 2011 నుంచి 2021 వరకు 11 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2021లో ఆటకు గుడ్ బై చెప్పిన అతడు.. ఈ ఏడాది ప్రారంభంలో తన ఐపీఎల్‌లో తన పునరాగమనం గురించి తెలియజేశాడు. దీంతో 2023 ఐపీఎల్ ఎడిషన్‌కు ఏబీ ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్సీబీ యాజమాన్యంతో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. డివిలియర్స్ ఆర్సీబీ తరఫున అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

ఈ ఏడాది ప్రారంభంలో అతడు తిరిగి జట్టులోకి వస్తాడని తెలియజేయడంతో అభిమానులు ఎంతో సంతోషించారు. డివిలియర్స్ రాకతో ఆర్సీబీ తప్పకుండా టైటిల్ గెలుస్తుందని ఆశతో ఉన్నారు. అతడు వస్తే ఆర్సీబీకి అదనపు బలం చేకురుతుందని నమ్ముతున్నారు.