తెలుగు న్యూస్  /  Sports  /  Ab De Villiers Revealed That He Often Cries While Watching Movies

De Villiers Cried: ఆ సినిమా చూస్తూ ప్రతి సెకండు ఏడుస్తా.. డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్

07 April 2023, 18:49 IST

    • De Villiers Cried: ఏబీ డివిలియర్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. తను సినిమా చూసేటప్పుడు ఏడుస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018లో డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఏబీ డివిలియర్స్
ఏబీ డివిలియర్స్ (AFP)

ఏబీ డివిలియర్స్

De Villiers Cried: సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు దేశంతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో తన ఆటతీరుతో మన దేశంలోనూ విపరీతంగా తన ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. వ్యక్తిగత విషయాలను పెద్దగా బయటకు చెప్పేందుకు సెలబ్రెటీలు ఇష్టపడరు. కానీ డివిలియర్స్ తాజాగా తన గురించి షాకింగ్ విషయాలను వెల్లడించాడు. సినిమాలు చూసినప్పుడల్లా తను ఏడుస్తానని బయట పెట్టాడు. దీంతో అభిమానులు నిజమా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"నేను గ్లాడియేటర్ మూవీ చూసినప్పుడల్లా ఏడుస్తుంటాను. ఆ సినిమాలో ప్రతి సెకండ్‌కు ఎమోషనల్ అవుతాను. ఇటీవలే మా పిల్లలతో కలిసి ఆ సినిమాను 12వ సారి చూశాను. అందులో కాస్త హింసాత్మకా సన్నివేశం కనిపించగానే నేను వారి కళ్లు మూస్తూ చూపించాను. కానీ అప్పుడు కూడా సినిమా చూసి ఏడ్చాను." అని డివిలయర్స్ తెలిపాడు. జియో సినిమా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాలను తెలిపాడు.

డివిలియర్స్ కెరీర్ విషయానికొస్తే అతడు 2018 తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. సౌతాఫ్రికా తరఫున ఎన్నో అరుదైన మైలు రాళ్లు అందుకున్న ఏబీ రిటైర్మెంట్ తర్వాత కూడా ఐపీఎల్‌లో ఆడాడు. 2021లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్.. ఈ టోర్నీలలో అత్యుత్తమ ఆఠగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-10 ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ 39.71 సగటుతో 5,162 పరుగులు చేశాడు. ఓవరాల్‌లో ఆరో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా 151.69 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు.

టాపిక్