తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tulsi Leaves : ఆదివారం తులసి ఆకులు తెంపకూడదు.. ఎందుకు?

Tulsi Leaves : ఆదివారం తులసి ఆకులు తెంపకూడదు.. ఎందుకు?

Anand Sai HT Telugu

29 October 2023, 8:24 IST

google News
    • Tulsi Leaves : హిందూ మతంలో తులసి మెుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దైవంగా చూస్తారు. అయితే తులసి మెుక్క ఆకులను తెంచే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.
తులసి మెుక్క
తులసి మెుక్క

తులసి మెుక్క

తులసికి సంబంధించిన అనేక నియమాలను గుర్తుంచుకోవాలి. ఆదివారం నాడు తులసి ఆకులను తీయకండి. దాని వెనుక కారణాలు ఉన్నాయి. హిందూ మతంలో తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు. తులసి అనేది మతపరమైన దృక్కోణం నుండి మాత్రమే కాకుండా, ఆయుర్వేదంలోనూ ప్రయోజనాలు ఉన్నాయి. హిందూ మతం ప్రకారం ప్రజలు తులసికి సంబంధించిన కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి. ఆదివారం నాడు తులసి ఆకులను తీయెుద్దు. దాని వెనక గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..

లేటెస్ట్ ఫోటోలు

Sun Transit: ధనుస్సురాశిలోకి సూర్యుడు అడుగుపెట్టబోతున్నాడు, ఈ రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు

Dec 12, 2024, 11:53 AM

Animals: తల లేకపోయినా ఈ జంతువులు బతుకుతాయని మీకు తెలుసా?

Dec 12, 2024, 10:59 AM

Happy Rasis: స్థానాలు మారుతున్న ప్రధాన గ్రహాలు, ఈ రాశుల వారి జీవితంలో ఇలాంటి భారీ మార్పులు

Dec 12, 2024, 08:51 AM

Smriti Mandhana Record: చరిత్ర సృష్టించిన స్మృతి మంధానా.. ఆస్ట్రేలియాతో వన్డేలో వరల్డ్ రికార్డు

Dec 12, 2024, 07:46 AM

2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు.. డబ్బుతోపాటుగా అదృష్టం కూడా వెంట వస్తుంది!

Dec 12, 2024, 06:08 AM

Google MoU With AP Govt : ఏపీలో గూగుల్ పెట్టుబడులు, విశాఖలో ఐటీ అభివృద్ధికి ఎంవోయూ

Dec 11, 2024, 10:03 PM

హిందూ గ్రంథాలలో తులసి ఆకు మహిమ గురించి చాలా వివరించారు. ఈ మెుక్కలోని ఒక్క ఆకు కూడా మేలు చేస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజూ తులసిని పూజిస్తే ఇంట్లో శాంతి, సంతోషాలు ఉంటాయని నమ్మకం. ఇది కాకుండా, ఆర్థిక సమస్యలు, ప్రతికూలత నుండి బయటపడతారు.

పురాణాల ప్రకారం, తులసి విష్ణువుకు ఇష్టమైనది. అదే సమయంలో హిందూ విశ్వాసాల ప్రకారం ఆదివారం కూడా విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. అందుకే ఆదివారం నాడు తులసి ఆకులను తెంపకూడదని పండితులు చెబుతున్నారు.

ఆదివారాల్లోనే కాదు.. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఏకాదశి, దువాదశి, సూర్యాస్తమయం సమయాల్లోనూ తులసి ఆకులను తీయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో తులసి మెుక్క.. శ్రీ హరికి నిర్జల వ్రతం చేస్తున్నట్టుగా నమ్ముతారు. ఈ రోజుల్లో తులసిని తెంపడం మానుకోవాలి. అంతేకాదు.. ఆ తేదీల్లో తులసి మెుక్క మీద నీళ్లు కూడా పోయకూడదని గుర్తుంచుకోండి.

మరో విషయం ఏంటంటే.. ఒక్కోసారి ఏ కారణం లేకుండా తులసి మెుక్క వాడిపోతూ ఉంటుంది. ఎంత నీరు పోసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వాడిపోతుంది. ఇలా తులసి మొక్క వాడిపోతే కుటుంబంలో ఒక రకమైన సంక్షోభం వస్తుందని చెబుతారు. కుటుంబంలో ఏదైనా సంక్షోభం ఏర్పడితే ముందుగా లక్ష్మి అంటే తులసి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుందని అంటుంటారు. తద్వారా అక్కడ పేదరికం వస్తుందని పలు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అందుకే ఇంట్లోనూ ఎప్పుడు ప్రశాంతత ఉండేలా చూసుకోండి.

తులసి పూజ చేయడం వల్ల చెడు ఆలోచనలు నశిస్తాయి. పాజిటివ్ థింకింగ్ పెరుగుతుందని భావిస్తారు. పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి తలపై తులసి ఆకుల నుంచి కారుతున్న నీటిని పోస్తే ఆ వ్యక్తికి గంగాస్నానం, 10 గోదాన ఫలం లభిస్తుంది. తులసిని పూజిస్తే.. రోగాలు నశించి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

తదుపరి వ్యాసం