Visakha Gold Decoration: రెండు కోట్ల నగదు, బంగారంతో విశాఖలో లక్ష్మీదేవికి అలంకారం-idol of goddess lakshmi decorated with 6 kg of gold rs 2 crore cash in vizag ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Gold Decoration: రెండు కోట్ల నగదు, బంగారంతో విశాఖలో లక్ష్మీదేవికి అలంకారం

Visakha Gold Decoration: రెండు కోట్ల నగదు, బంగారంతో విశాఖలో లక్ష్మీదేవికి అలంకారం

Sarath chandra.B HT Telugu

Visakha Gold Decoration: విశాఖపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని 6 కిలోల బంగారం, 2 కోట్ల రూపాయల నగదు, 6 కిలోల వెండితో అలంకరించారు.

విశాఖలో రెండు కోట్ల నగదుతో కన్యకా పరమేశ్వరి అలంకారం

Visakha Gold Decoration: విశాఖలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని రెండు కోట్ల రుపాయల నగదుతో పాటు, భారీ బంగారంతో అలంకరించారు. లక్ష్మీదేవి అవతారం సందర్భంగా అమ్మవారికి బంగారు అలంకారణ చేశారు.

10 రోజుల నవరాత్రి ఉత్సవాల్లో, కన్యకా పరమేశ్వరి ఆలయంలోని అనేక అవతారాలలో అమ్మవారిని పూజించారు. లక్ష్మీదేవి అలంకరణ సందర్భంగా ఆలయాన్ని రెండు కోట్ల రుపాయల నగదుతో ముస్తాబు చేశారు.

నగలు, నగదును ఆలయ అంతర్గత అలంకరణకు వినియోగించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఏటా బంగారు ఆభరణలతో అలంకరించడం ఆనవాయితీ వస్తోందని నిర్వాహకులు తెలిపారు.

లక్ష్మీదేవి పూజ కోసం అమ్మవారి ముందు కరెన్సీ నోట్లతో పాటు బంగారాన్ని ఉంచడం తమకు అదృష్టమని ప్రజలు నమ్ముతారు. ఇదంతా ప్రజల సహకారంతో జరిగిందని చెబుతున్నారు ఆలయ సంప్రదాయం ప్రకారం, అమ్మవారి విగ్రహానికి బంగారు ఆభరణాలు మరియు కరెన్సీ నోట్లతో అలంకరించారు.

దేవి నవరాత్రి ఉత్సవాలతో అలంకరణ కోసం వివిధ రకాల నోట్లను సేకరించారు. పరమేశ్వరి దేవిని అలంకరించేందుకు రూ. 1 నుండి 500 వరకు ఉపయోగించారు." లక్ష్మీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని భారీ సంఖ్యలో ప్రజలు ఆలయాన్ని సందర్శించి పరమేశ్వరి అమ్మవారికి పూజలు చేశారు.

లక్ష్మీదేవి విగ్రహాన్ని 6 కిలోల బంగారం, 2 కోట్ల రూపాయల నగదు, 6 కిలోల వెండితో అలంకరించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.