తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratri Day 5: నవరాత్రుల్లో ఐదో రోజు స్కందమాతని ఆరాధిస్తే ఐశ్వర్యానికి ఢోకా ఉండదు

Navaratri Day 5: నవరాత్రుల్లో ఐదో రోజు స్కందమాతని ఆరాధిస్తే ఐశ్వర్యానికి ఢోకా ఉండదు

Galeti Rajendra HT Telugu

06 October 2024, 17:51 IST

google News
  • Skanda Mata: నవరాత్రుల్లో భాగంగా ఇప్పటికే వరుసగా నాలుగు రోజుల్లో శైలపుత్రి దేవి, బ్రహ్మచారిణి దేవి, చంద్రఘంటా దేవి, కుష్మాండ దేవి అమ్మవారిని భక్తులు పూజించారు. ఇక ఐదో రోజైన సోమవారం స్కందమాత దేవిని పూజిస్తే సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

స్కందమాత
స్కందమాత

స్కందమాత

నవరాత్రుల్లో ఐదో రోజైన సోమవారం (అక్టోబరు 7) స్కందమాత అమ్మవారిని పూజిస్తారు. భక్తులకు సుఖశాంతులను ప్రసాదించేది స్కందమాత అని భక్తుల నమ్మకం. దుర్గాదేవి దేవసూర్ యుద్ధంలో సేనాధిపతి అయిన స్కంద భగవానుని తల్లి కాబట్టి.. ఈమెను స్కందమాతగా పిలుస్తారు.

లేటెస్ట్ ఫోటోలు

ఆనందం, విజయం, డబ్బుకు కేరాఫ్​ అడ్రెస్​ ఈ 5 రాశులు- అనుకున్నది సాధిస్తారు!

Jan 19, 2025, 05:45 AM

ఈ రాశుల వారికి ఎదురుకానున్న క్లిష్ట పరిస్థితులు.. మరింత జాగ్రత్తగా ఉండాలి!

Jan 18, 2025, 08:56 PM

ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు- ఆకస్మిక ధన లాభంతో పాటు కెరీర్​లో సక్సెస్​..

Jan 18, 2025, 06:06 AM

18 January Horoscope: శనివారం ఆశించిన ఫలితాలు లభిస్తాయా? జనవరి 18 మీ రాశి ఫలం ఎలా ఉండబోతోంది?

Jan 17, 2025, 11:13 PM

Jupiter Retrograde: గురు గ్రహం తిరోగమంతో ఈ 3 రాశుల వారికి అదృష్టం.. ఆర్థిక లాభాలతో పాటు ఎన్నో

Jan 17, 2025, 11:19 AM

విజయానికి కేరాఫ్​ అడ్రెస్​గా ఈ 3 రాశులు- ఆకస్మిక ధన లాభం, అన్ని కష్టాలు దూరం..

Jan 17, 2025, 06:05 AM

స్కందమాత అమ్మవారిని పద్మాసన దేవి, విద్యావాహిని దుర్గా దేవి అని కూడా పిలుస్తారు. స్కందమాత వాహనం సింహం. స్కందమాత సౌర కుటుంబంలో ప్రధాన దైవం. కాబట్టి.. అమ్మవారిని పూజించడం ద్వారా గొప్ప మహిమలు లభిస్తాయని భక్తుల నమ్మకం.

బిడ్డ పేరుతో తల్లి ప్రసిద్ధి

స్కందమాత తల్లికి నాలుగు చేతులు ఉంటాయి. స్కందమాత విగ్రహంలో స్కందుడు బిడ్డ రూపంలో తల్లి ఒడిలో కూర్చుని ఉంటాడు. స్కందమాత స్వరూపం ఒక విశిష్టమైన తేజస్సుతో పవిత్రమైన రంగులో ఉంటుంది.

స్కందమాత హిమాలయాల కుమార్తె. పర్వత రాజ హిమాలయాల కుమార్తె కావడంతో ఆమెను పార్వతి అని పిలుస్తారు. అంతేకాక మహదేవ్ భార్య కావడం వలన ఆమెకు మహేశ్వరి అని పేరు వచ్చింది. స్కందమాతకి కొడుకు అంటే చాలా ఇష్టం. అందుకే తల్లిని కొడుకు పేరుతో పిలవడం ఉత్తమం. స్కందమాతను పూజించి కథను చదివిన లేదా విన్న భక్తులకు సంతానం, సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు.

స్కందమాత పురాణం

అప్పట్లో తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడి అంతం కేవలం శివుడి కుమారుని చేతిలో మాత్రమే ఉండేది. దాంతో అప్పుడు పార్వతీ దేవి తన కుమారుడైన స్కంద (కార్తికేయ)కు యుద్ధంలో శిక్షణ ఇవ్వడానికి స్కందమాత రూపం ధరించింది. కార్తికేయుడు స్కందమాత వద్ద యుద్ధ శిక్షణ పొందిన.. తారకాసురుడిని సంహరించాడని స్కందమాత పురాణం చెప్తోంది.

అక్టోబరు 3న ప్రారంభమైన నవరాత్రులు అక్టోబరు 11 వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత అక్టోబరు 12న దసరాని జరుపుకోనున్నారు.

తదుపరి వ్యాసం