తెలుగు న్యూస్ / ఫోటో /
Modi Temple visit: మోదీ ఆలయ సందర్శన: ఉత్తరాఖండ్ లోని ఆది కైలాస, పార్వతి కుండ్ లో ధ్యానం
Modi Temple visit: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రస్తుతం ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం పార్వతీ కుండ్ ను సంప్రదాయ దుస్తులు ధరించి దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆదికైలాస పర్వతానికి ఎదురుగా కూర్చుని.. గంటన్నర పాటు ధ్యానం చేశారు.
(1 / 7)
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పితోర్ ఘర్‌లోని శివపార్వతి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దుస్తులలో పూజలు చేశారు.
(2 / 7)
ఉత్తరాఖండ్‌లోని కైలాసపర్వతం వద్ద శివపార్వతుల ఆలయం ముందున్న శివలింగానికి పూజలు చేశారు. మోదీ వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.
(3 / 7)
ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం పిథోర్‌గఢ్‌లోని పార్వతీ కుండ్ నకు వెళ్లి అక్కడి నుంచి ఆది కైలాస శ్రేణిలో కొలువై ఉన్న శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.
(4 / 7)
శివపార్వతుల ఆలయంలో పూజలు చేసిన అనంతరం అదే సంప్రదాయ దుస్తులతో సమీపంలోని ఆది కైలాస పర్వతానికి బయలుదేరారు. అక్కడ కొంతసేపు కూర్చుని ధ్యానం చేశారు.
(5 / 7)
ఉత్తర ఖండంలోని ఆదికైలాస పర్వతానికి ముందు కూర్చుని ప్రధాని మోదీ కాసేపు ధ్యానం చేశారు. ధ్యానం అనంతరం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉందన్నారు.
(6 / 7)
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పితోర్‌ఘర్‌లోని సరస్సు, ఆ వెనుకగా కనిపించే హిమాలయం ముందు మోదీ మౌనంగా కూర్చుని ధ్యానం చేశారు. గతంలో కూడా మోదీ ఇలాగే పలుమార్లు హిమాలయాలను సందర్శించారు.
ఇతర గ్యాలరీలు