TG Govt Teachers : ఉపాధ్యాయులకు తీపి కబురు.. దసరా లోపు కీలక ప్రకటన-minister sridhar babu revealed that a decision will be taken before dussehra on 317 go ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Govt Teachers : ఉపాధ్యాయులకు తీపి కబురు.. దసరా లోపు కీలక ప్రకటన

TG Govt Teachers : ఉపాధ్యాయులకు తీపి కబురు.. దసరా లోపు కీలక ప్రకటన

Oct 06, 2024, 10:47 AM IST Basani Shiva Kumar
Oct 06, 2024, 10:47 AM , IST

  • TG Govt Teachers : జీవో 317 పై ప్రభుత్వ ఉద్యోగులు.. ముఖ్యంగా ఉపాధ్యాయులు చాలా రోజులుగా పోరాడుతున్నారు. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. దసరా లోపు ఉపాధ్యాయులకు తీపి కబురు చెబుతామని స్పష్టం చేశారు.

ఉద్యోగుల సర్దుబాటు, బదిలీల్లో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని.. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలనే డిమాండ్ తెలంగాణలో చాలా రోజులుగా ఉంది. అదే సమయంలో 317 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కీలక ప్రకటన చేశారు.

(1 / 5)

ఉద్యోగుల సర్దుబాటు, బదిలీల్లో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని.. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలనే డిమాండ్ తెలంగాణలో చాలా రోజులుగా ఉంది. అదే సమయంలో 317 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కీలక ప్రకటన చేశారు.(HT)

గత ప్రభుత్వం తెచ్చిన జీవో 317తో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు దసరా పండగ లోపు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. 

(2 / 5)

గత ప్రభుత్వం తెచ్చిన జీవో 317తో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు దసరా పండగ లోపు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. (@Drpmahendereddy)

317 జీవో అంశంపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపసంఘం.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. 

(3 / 5)

317 జీవో అంశంపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపసంఘం.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. (@Drpmahendereddy)

శనివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్లలో తెలంగాణ ప్రజా పాలనలో ఉపాధ్యాయుల పాత్ర అంశంపై విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో శ్రీధర్ బాబు 317 జీవో అంశంపై మాట్లాడారు.

(4 / 5)

శనివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్లలో తెలంగాణ ప్రజా పాలనలో ఉపాధ్యాయుల పాత్ర అంశంపై విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో శ్రీధర్ బాబు 317 జీవో అంశంపై మాట్లాడారు.(@Drpmahendereddy)

ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు, డీఏ పెంపు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రిని కోరారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

(5 / 5)

ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు, డీఏ పెంపు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రిని కోరారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.(@Drpmahendereddy)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు