తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ పూలు పూజకి పనికి రావు.. ఎందుకో తెలుసా?

ఈ పూలు పూజకి పనికి రావు.. ఎందుకో తెలుసా?

HT Telugu Desk HT Telugu

04 December 2023, 11:27 IST

google News
    • దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజ చేస్తారు. కానీ ఆ పూజ పూలు లేకుండా పూర్తి కాదు. అందుకే పూజకి పూలు అంత ముఖ్యం. కానీ అన్నీ రకాల పూలు మాత్రం పూజకి పనికిరావు.
పూజకు పనికి రాని పూలేంటో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
పూజకు పనికి రాని పూలేంటో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం) (Pixabay)

పూజకు పనికి రాని పూలేంటో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసే టప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు. పూలు లేకుండా దేవుడికి పూజ పూర్తవదు. కానీ కొన్ని రకాల పూలు మాత్రం అసలు పూజకి పనికి రావు. వాటిని ఇతర కార్యక్రమాలకి వాడిన కూడా పూజ చేసేందుకు ఉపయోగించరు. దేవుడి ఆశీర్వాదం పొందాలని అనుకుంటే తప్పనిసరిగా పూలతో పూజ చేయాల్సిందే.

లేటెస్ట్ ఫోటోలు

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Dec 21, 2024, 07:46 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

ఒక్కో దేవత/ దేవుడికి ఒక్కో రకం పూలు ఇష్టం. ఉదయం, సాయంత్రం పూజ చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసే చెట్టు నుంచి పూలు అప్పటికప్పుడు కోసి తీసుకెళ్ళి దేవుడికి సమర్పిస్తారు. దేవతలకి పుష్పాలు సమర్పించడం అంటే ప్రేమ, భక్తిని వ్యక్తపరచడం. పూజా స్థలం దగ్గర వాటిని పెట్టడం వల్ల ఆ ప్రదేశం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ప్రశాంతత, సానుకూల భావాన్ని ఇస్తుంది.

పూజ అనే పదంలోనే పువ్వులు ఉన్నాయి. ప్రార్థన అంటే పుష్పాల సమర్పించుకోవడం. కానీ దేవుని అనుగ్రహం కోసం చేసే పూజలో కొన్ని రకాల పువ్వులు ఉపయోగించరు. అవి ఏంటో తెలుసా?

మొగలి పువ్వు

ఘాటైన వాసన కలిగిన మొగలి పువ్వు పూజకి పనికిరాని వాటిలో మొదటిది. అవి పూజకి ఉపయోగించకపోవడం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. ఒకనాడు విష్ణుమూర్తి, బ్రహ్మ మేం గొప్ప అంటే మేము గొప్ప అని వాదులాడుకున్నారు. వారి సమస్య పరిష్కరించేందుకు శివుడు ఒక పరీక్ష పెట్టాడు.

తన శివలింగానికి ఆద్యంతాలు ఏవో కనిపెట్టమని పరీక్ష పెట్టాడు. ఎంత వెతికినా కానీ ఇద్దరూ కనిపెట్టలేకపోయారు. తనే గెలవాలనే ఉద్దేశంలో బ్రహ్మ గోమాత, మొగలి చెట్టుతో అబద్ధం చెప్పిస్తాడు.

నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో ఇద్దరికీ శాపం పెడతాడు. మొగలి పువ్వు పూజకి పనికిరాదని శపిస్తాడు. ఇక గోవు మొహం చూస్తే శాపం అని చెప్తాడు. అందుకే అందరూ గోమాతకి వెనుక తోక వైపు పూజ చేస్తారు.

బంతి పువ్వు

బంతిపూలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే తప్పనిసరిగా బంతిపూలతో సుందరంగా అలకరిస్తారు. కానీ పూజ చేసేందుకు మాత్రం ఉపయోగించరు. కారణం అది ఎక్కువగా క్రిమి కీటకాలని ఆకర్షిస్తుంది.

ఇవి కూడా వాడరు

ఎంతో మధురమైన వాసన కలిగిన సన్నజాని, సంపంగి పూలు, మల్లెలు కూడా పూజకి వినియోగించరు.

పూజకి పూలు కోసేటప్పుడు ఈ నియమాలు ముఖ్యం

  1. పూజకి పూలు కోసేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. నేల రాలిన పూలు దేవుడికి సమర్పించకూడదు.
  2. హిందూ పురాణాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు. ఆ సమయంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే పవిత్రమైన పనులు, పూజ కోసం పువ్వులు కోయడం చేయరు.
  3. మత గ్రంథాల ప్రకారం పూజకి తాజా పువ్వును ఉపయోగించాలి. ఒకసారి ఉపయోగించిన పూలు మరొక సారి వినియోగించకూడదు.
  4. పూజ చేసేందుకు ఉపయోగించే పూలు నీటితో కడగకూడదు. అలాగే ఎడమ చేత్తో పూలు కోయకూడదు. 
  5. నెలసరి, పురిటి సమయంలో పూలు తాకరాదు. 
  6. బిల్వ పత్రాలు మాత్రం పూజకి ఉపయోగించిన తర్వాత శుభ్రంగా నీటిలో కడిగి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. కలువ పువ్వులు ఎప్పుడైనా దేవుడికి పూజ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అవి కోసిన తర్వాత ఐదు రోజుల వరకు తాజాగా ఉంటాయి.

తదుపరి వ్యాసం