తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kitchen Vastu Tips: కిచెన్ లో ఈ దిశలో నిలబడి వంట చేస్తే ఆస్తి నష్టం సంభవిస్తుంది జాగ్రత్త

Kitchen vastu tips: కిచెన్ లో ఈ దిశలో నిలబడి వంట చేస్తే ఆస్తి నష్టం సంభవిస్తుంది జాగ్రత్త

Gunti Soundarya HT Telugu

18 April 2024, 8:19 IST

    • Kitchen vastu tips: వంట గదిలో నిలబడి వంట చేసేటప్పుడు వాస్తు ప్రకారం నిలబడటం వల్ల ఇల్లు సంతోషంతో నిండిపోతుంది. లేదంటే ఆస్తి నష్టం, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
కిచెన్ లో ఏ దిశలో నిలబడి వంట చేయాలి?
కిచెన్ లో ఏ దిశలో నిలబడి వంట చేయాలి? (pixabay)

కిచెన్ లో ఏ దిశలో నిలబడి వంట చేయాలి?

Kitchen vastu tips: సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. గృహ, కార్యాలయాల నిర్మాణాలకు వాస్తు నియమాలు సరిగా చూస్తారు. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని వస్తువులు సర్దుకోవడం కూడా ముఖ్యం. అప్పుడే జీవితంలో ఆనందం, సంతోషం ఉంటాయి. సరైన వాస్తు శాస్త్ర సూత్రాలను పాటించడం వల్ల సానుకూల శక్తిగా ప్రసరిస్తుంది. ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది. 

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

వాస్తు ప్రభావం జీవితంలోని ప్రతిరంగంపై పడుతుంది. వాస్తు సరిగ్గా ఉంటేనే జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. వ్యాధుల రహితంగా ఉంటారు. ఇంట్లో ముఖ్యమైనది వంటగది. అందుకే వంటగది వాస్తుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ తయారు చేసిన ఆహారం శరీరానికి సానుకూల శక్తిని అందిస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

కిచెన్ వాస్తు నియమాలు 

వాస్తు ప్రకారం వంటగదిని ఇంటికి ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కిచెన్ తలుపు ఇంటి ప్రధాన ద్వారం నుంచి చూడగానే కనిపించకుండా ఉండే విధంగా చూసుకోవాలి. వంట సమయంలో వ్యక్తి తూర్పు దిశలో ఉండాలి. ఇది సూర్యుని దిశగా పరిగణిస్తారు. ఇంట్లో సుఖ శాంతులు నెలకొనాలన్నా, రోగాలు రాకుండా ఉండాలన్న తూర్పు దిశ ముఖంగా నిలబడి ఆహారం వండుకోవడం ఉత్తమం. 

స్నానం చేయకుండా వంట చేయకూడదు, తినకూడదు. ఇది అనారోగ్య పరిస్థితులను మరింత దిగజారుస్తుంది. ఊబకాయంతో బాధపడాల్సి వస్తుంది.  అదే సమయంలో వంటగదికి పడమర దిక్కున ఆహారాన్ని వండటం వల్ల ఇంటి  సభ్యులు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. ఆగ్నేయ ముఖంగా ఆహారాన్ని వండితే అది మీ ఇంటి ప్రశాంతతకి భంగం కలిగిస్తుంది.

ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి?

వాస్తు ప్రకారం వంటగదిలో అల్మారాలు దక్షిణ లేదా పడమర దిశలో ఉండాలి.  సుగంధ ద్రవ్యాలు, ఆహార పదార్థాలను వాయువ్య దిశలో ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం వంట గదిలో పెట్టుకునే మైక్రోవేవ్ ఓవెన్, మిక్సీ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీటిని తప్పు దిశలో ఎప్పుడు ఉంచుకోకూడదు. అలా చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.  అందుకే విద్యుత్ ఉపకరణాలను ఆగ్నేయ మూలలో ఉంచాలి. 

ఇంట్లో పెట్టుకునే పాత్రల స్టాండ్ దక్షిణ దిశలో లేదా పడమర దిశలో పెట్టుకోవాలి.  ఏదైనా చిన్న వస్తువు వంటగదికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచుకోవడం మంచిది. 

ఈ దిశలో నిలబడి వంట చేయవద్దు 

వాస్తు ప్రకారం వంటగది ముందు ఎప్పుడూ టాయిలెట్ నిర్మించకూడదు. ఇలా చేయడం అశుభంగా భావిస్తారు. వంటగది ఎప్పుడు పరిశుభంగా ఉండాలి. లేదంటే అది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

 దక్షిణం, ఉత్తరం, పడమర దిక్కులు చూస్తూ ఆహారాన్ని వండటం మానుకోవాలి.  ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వంటగది ప్రాంతం గ్యాస్ పెట్టుకునే ప్రదేశం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పంచభూతాలు సమతుల్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక గోధుమలు, పప్పులు, బియ్యం మొదలైన ధాన్యాలు నిల్వచేసుకునేందుకు ఉత్తమ దిశ పశ్చిమం లేదా దక్షిణం. 

 

టాపిక్

తదుపరి వ్యాసం