Kitchen vastu tips: ఈ వస్తువులు వంటగదిలో ఉంచితే డబ్బు కొరత ఏర్పడుతుంది
Kitchen vastu tips: వంట గదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల నెగటివ్ శక్తిని మూట గట్టుకుంటుంది. అందుకే పొరపాటున కూడ వీటిని పెట్టుకోవద్దు.
Kitchen vastu tips: ఇంటికి వంట గది గుండెలాంటిది. ఎంత చక్కగా దాన్ని ఉంచుకుంటే చూసేందుకు ఇల్లు కూడా అంతే అందంగా కనిపిస్తుంది. ఇంటి నిర్మాణ సమయంలో అన్నీ వాస్తు ప్రకారమే పెట్టుకుంటారు. అలాగే కిచెన్ లో ఉండే వస్తువులు కూడా వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. లేదంటే వాస్తు దోషాలు ఏర్పడి అది జీవితం మీద ప్రభావం చూపిస్తుంది.
వంటగదిలో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అన్నపూర్ణ దేవి సంతోషిస్తుంది. అగ్ని దేవుడి నివాసం కూడా వంట గదే. చాలా సార్లు మనకి తెలిసో తెలియకో కొన్ని వస్తువులు వంట గదిలో ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. వంటగదిలో ఉండే ప్రతికూల శక్తి మీ ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కొన్ని వస్తువులు కిచెన్ లో పొరపాటున కూడా పెట్టకండి. వంట గదిలో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడం కోసం ఈ వస్తువులు బయట తీసేయండి. లేదంటే ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వంట గదిలో ఏం పెట్టకూడదు?
చాలా మంది మిగిలిపోయిన పిండిని వంట గదిలో పెట్టేస్తారు. కానీ అలా అసలు చేయకూడదు. పిండిని రాత్రంతా ఫ్రిజ్ లో లేదా వంట గదిలో ఉంచడం వల్ల రాహువు, శని చెడు ప్రభావాల కారణంగా నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అది మీ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే పిండి మిగిలిపోకుండా సరిపడినంత మాత్రమే కలుపుకోండి.
కొంతమంది వంట గదిని మరింత అందంగా అలంకరించుకోవడం కోసం అద్దాలను పెట్టుకుంటారు. మరికొంత మంది చూసేందుకు చక్కగా ఉండాలనే ఉద్దేశంతో గాజు వస్తువులు అల్మరాలో అమర్చి పెట్టుకుంటారు. కానీ ఇవి వంట గదిలో పొరపాటున కూడా పెట్టకూడదు. కిచెన్ లో గాజు వస్తువులు ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అద్దం పెట్టడం వల్ల ఇంట్లోని ఆనందం, ప్రశాంతత తొలగిపోతుంది. అది మాత్రమే కాదు అగ్ని దేవుడి ప్రతిబింబం అద్దంలో కనిపిస్తే అగ్ని దేవుడి ఎనర్జీ పెరుగుతుంది. అది కుటుంబానికి శ్రేయస్కరం కాదు.
వంట గది ఎప్పుడు క్లీన్ గా ఉండాలి. మురికి ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. రాత్రి పూట ఎంగిలి పాత్రలు అలాగే వదిలేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. ఒకవేళ మీకు పాత్రలు శుభ్రం చేసుకోలేకపోతే వాటిని బయట పెట్టాలి కానీ కిచెన్ లో అలాగే వదిలేయకూడదు.
కొందరికి కిచెన్ లో ట్యాబ్లెట్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. అయితే వంట గదిలో మందులు ఉంచడం వల్ల ఇంటి సభ్యులా ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే వంటింట్లో మందులు పెట్టకూడదు.
విరిగిపోయిన, పగిలిపోయిన పాత్రలు ఇంటి వంట గదిలో ఉంచకూడదు. విరిగిన వస్తువులు వినియోగించడం వల్ల అదృష్టం కలిసి రాదని అంటారు. చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే కిచెన్ లో కడాయి, చపాతీలు చేసుకునే పాన్ వంటి వస్తువులు బోర్లా పెట్టకూడదు. అవి ఎవరికీ కనిపించకుండా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి.
టాపిక్