తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Weekly Telugu Horoscope, Astrological Predictions For September 18 To September 24, 2022

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారిపై ఏలినాటి ప్రభావం!

HT Telugu Desk HT Telugu

18 September 2022, 5:00 IST

    • Weekly Telugu Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు, సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 24, 2022 వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వార ఫలాలు ఇక్కడ ఉన్నాయి.
Weekly Horoscope Telugu
Weekly Horoscope Telugu

Weekly Horoscope Telugu

Weekly Telugu Horoscope: తెలుగు రాశి ఫలితములు (వార ఫలితము)

లేటెస్ట్ ఫోటోలు

అదృష్టం అంతా ఈ రాశి వారిదే! డబ్బు, ప్రమోషన్​.. అని సమస్యలు దూరం

Apr 30, 2024, 06:14 AM

ఈ రాశుల వారికి ధన యోగం.. ఆర్థిక కష్టాలు దూరం- కుటుంబంలో సంతోషం..

Apr 29, 2024, 09:45 AM

డబ్బంతా ఈ రాశుల వారిదే! ఉద్యోగంలో ప్రమోషన్​, వ్యాపారంలో లాభాలు..

Apr 28, 2024, 10:47 AM

ఏప్రిల్ 28, రేపటి రాశి ఫలాలు.. ఐటీ రంగంలో పని చేసే వాళ్ళు రేపు జాగ్రత్తగా ఉండాలి

Apr 27, 2024, 08:38 PM

Lord Venus : శుక్రుడి సంచారంతో ఈ రాశులవారికి ఇబ్బందులు

Apr 27, 2024, 03:03 PM

Lord Surya : సూర్యభగవానుడి సంచారంతో సమస్యల్లో పడే రాశులు వీరే

Apr 27, 2024, 11:23 AM

18.9.2022 నుండి 24.9.2022 వరకు

సంవత్సరం: శుభకృత్ నామ,

అయనం: దక్షిణాయనం, మాసం: భాద్రపదం

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. జన్మ రాహువు, వాక్ స్థానము నందు కుజగ్రహ సంచారం చేత గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబములో చికాకులు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అధికముగా ఉండును. అయినప్పటికి ప్రతీ పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నించెదరు. వ్యయ స్థానములో గురు సంచారము వలన ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు మధ్యస్త ఫలితములు, వ్యాపారస్తులకు అధికముగా ఖర్చు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితములు ఈ వారం గోచరిస్తున్నవి. మేషరాశివారు మరింత శుభ ఫలితం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

వృషభ రాశి

వృషభరాశి వారికి ఈ వారం మధ్యస్త ఫలితాలు ఉన్నవి. వృషభ రాశి వారికి జన్మరాశి యందు కుజుని ప్రభావం చేత ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారములయందు చికాకులు ఏర్పడును. సుఖ భోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును. మానసిక అలసట ఏర్పడును. బంధుమిత్రులతో బేధాభిప్రాయాలు పెరుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

మిథున రాశి

మిథున రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. ధనలాభము, సౌఖ్యము కలుగును. శుక్రుడు, బుధుడు అనుకూల స్థితి వలన కుటుంబ సౌఖ్యము, ధన లాభము కలుగును. వ్యయస్థానములో కుజుని ప్రభావంచేత ఆవేశపూరిత నిర్ణయాలు, వృధా ఖర్చులు పెరుగును. మానసిక ఉల్లాసము కొరకు ధనమును ఖర్చు చేసెదరు. మృష్టాన్న భోజనము, సౌఖ్యము కలుగును. ప్రయాణములు అనుకూలించును. ఈ వారం మరింత శుభఫలితాల కోసం మిధునరాశి వారు బుధవారం రోజు మహా విష్ణువును పూజించి, విష్ణు సహస్రనామాన్ని పఠించలెను.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వచ్చును. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్థిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి.

సింహ రాశి

ఈ వారం మీకు మధ్యస్తముగా ఉన్నది. ద్వితీయ స్థానములో రవి, బుధుల సంచారము వలన ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు నూతనంగా వ్యవహారాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అష్టమ గురుని ప్రభావము వలన కుటుంబ వ్యవహారాల యందు మరియు ఆరోగ్య విషయముల యందు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగములతో చికాకులు అధికముగా ఉండును. వ్యాపారస్తుల అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగించును. విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం. సింహరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్త ఫలితము ఉన్నది. జన్మరాశి రవి సంచరించుట వల్ల ఒత్తిళ్ళు అధికముగా ఉండును. శారీరక శ్రమ ఏర్పడును. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతి పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులారాశి వారికి ఈ వారం మధ్యస్తముగా ఉన్నది. జన్మరాశి యందు కేతువు అష్టమ స్థానము నందు కుజుడు, శత్రు స్థానము నందు గురుని సంచారము వలన తులారాశి వారికి ఉద్యోగమునందు ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిడి, శత్రుత్వ భయము కలుగును. కుటుంబము నందు మానసిక ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఏర్పడును. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగును. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్య ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. అప్పుల ఒత్తిడి ఉండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గా దేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.

వృశ్చిక రాశి

వృశ్చికరాశికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. శని అనుకూల ప్రభావముచేత మరియు పంచమ స్థానము గురువు, ఆరవ స్థానము రాహువు ప్రభావము చేత అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేసెదరు. సమాజము నందు కీర్తి కుటుంబము నందు గౌరవము పెరుగును. లాభము రవి ప్రభావము చేత ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయము. ధన లాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సోదరులు, పిల్లల వలన చికాకులు కలుగును. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధన లాభము కలుగును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. వృశ్చిక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.

ధనుస్సు రాశి

ధనూ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితములు ఉన్నవి. లాభ స్థానము నందు కేతువు, దశమ స్థానము నందు రవి, బుధులు భాగ్యం నందు శుక్రుని సంచారము వలన అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేసెదరు. కుటుంబము నందు సౌఖ్యము, కీర్తి కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. ద్వితీయ స్థానమునందు శని సంచారము వలన ఏలినాటి ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు, పనుల యందు ఆలస్యము ఏర్పడును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించటం చేయాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. జన్మరాశి యందు శని వక్రియై సంచరించుట వలన అలాగే తృతీయము నందు గురుని ప్రభావం చేత మానసిక ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉండును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. పంచమమునందు గురుడు, భాగ్యమునందు రవి బుధుల అనుకూలత వలన మీయొక్క కృషితో పట్టుదలతో ముందుకు వెళ్ళి కార్యములు పూర్తి చేసేదరు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయలి. శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. వ్యయ స్థానము నందు శని ప్రభావము, అష్టమ స్థానము నందు రవి సంచారము చేత ఆరోగ్య విషయముల యందు మరియు కుటుంబ వ్యవహారముల యందు జాగ్రత్తలు వహించాలి. ధనవ్యయము ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెట్టును. అప్పు చేసి ముందుకు వెళ్ళవలసినటువంటి గ్రహస్థితి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించును. ఉద్యోగస్తులకు కష్టకాలము. వ్యాపారస్తులకు అనుకూలంగా లేనటువంటి సమయము. ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించవలసిన సమయము. శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉన్నవి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం వంటివి చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. జన్మరాశి యందు గురుని ప్రభావం చేత మీన రాశివారికి ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

టాపిక్