Vastu Tips । ఈ 5 వాస్తు చిట్కాలను పాటిస్తే.. మీ ఇల్లు బంగారమే!
15 December 2022, 22:52 IST
- Vastu Tips For Wealth and Prosperity: ఎంత సాంపాదించిన డబ్బు నిలవటం లేదా? అయితే ఈ 5 వాస్తు చిట్కాలను పాటించండి. మీ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక లోటు ఉండదు.
Vastu Tips For Money and Prosperity
చాలా మంది చాలా కష్టపడతారు. అహర్నిశలు శ్రమించి డబ్బు సంపాదిస్తారు. అయితే ఎంత పోగు చేసినప్పటికీ ఉన్న డబ్బులన్నీ ఏదో రూపంలో ఖర్చు అయిపోతాయి. అవసరానికి చేతిలో చిలిగవ్వ కూడా మిగలదు. ఇంకొంత మంది చాలా రోజులుగా డబ్బు పొదుపుగా వాడుతూ, మిగిలిన డబ్బును ఆదా చేస్తారు. ఏదైనా అవసరానికి ఉపయోగించుకుందామంటే ఊహించని రూపంలో ఆసుపత్రి ఖర్చులు, నష్టాలు ఎదురవుతాయి. ఎంతోకాలంగా ఆదా చేసిన డబ్బంతా ఒక ఉదుటన ఖర్చు జరిగిపోతుంది. ఇలా వారి చేతిలో డబ్బు నిలవకపోవడానికి కారణం వాస్తు దోషాలు కూడా అయి ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు.
లేటెస్ట్ ఫోటోలు
ఇల్లు వాస్తు ప్రకారంగా లేకపోయినా, ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నప్పుడు జీవితంలో సమస్యలు చుట్టుముడతాయి. ఆర్థిక బాధలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఖర్చులను అదుపు చేయడం కష్టంగా మారుతుంది. అయితే వాస్తు శాస్త్రంలో ఆర్థిక పురోగతి కోసం కొన్ని నివారణ చర్యలు ఇవ్వడమైనది.
Vastu Tips For Wealth and Prosperity
జ్యోతిష్యులు, వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో డబ్బు బర్కత్ ఉండటానికి వాస్తు చిట్కాలను తెలుసుకోండి.
1. లఘు కొబ్బరి
లఘు కొబ్బరిని శ్రీఫలం అంటారు. శ్రీఫలం ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఇంట్లో లఘు కొబ్బరి లేదా శ్రీఫలాలను తీసుకొచ్చి ఇంట్లో పూజ మందిరంలో ఉంచుకోవాలి.
2. లోహపు తాబేలు
చాలా మంది ఇళ్లలో వెండి, ఇత్తడి లేదా కాంస్య తాబేలును చూసే ఉంటారు. తాబేలు విష్ణువు అవతారంగా పరిగణించబడుతుంది. ఇంట్లో తాబేలును ఉంచడం ద్వారా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. తాబేలును ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉంచాలని గుర్తుంచుకోండి.
3. పిరమిడ్
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పిరమిడ్ ఉంచడం ఆర్థిక శ్రేయస్సును తీసుకొస్తుంది. మంచి దీవెనలను అందిస్తుంది. క్రిస్టల్ పిరమిడ్ ఇంట్లో ఉంచుకుంటే, ఆదాయం పెరగడంతో పాటు కెరీర్‌లో కూడా పురోగతి ఉంటుందని చెబుతారు. ఇంట్లో సభ్యులు ఎక్కువ సమయం గడిపే ప్రదేశంలో పిరమిడ్‌ను ఉంచండి.
4. గోమతీ చక్రం
పురాతన గ్రంధాల ప్రకారం గోమతీ చక్రం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. గోమతీ చక్రాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. 11 గోమతి చక్రాలను పసుపు వస్త్రంలో చుట్టి, వాటిని ఒక ఖజానాలో ఉంచడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
5. కమలగట్ట హారము
ఆర్థిక సంక్షోభాన్ని తొలగించడానికి కమలగట్ట హారము శుభప్రదంగా పరిగణించబడుతుంది. కమలగట్ట దండను ఉంచడం ద్వారా డబ్బు సంపాదించడానికి మార్గం తెరుచుకుంటుంది అని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది.
టాపిక్