తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Vasanta Panchami 2023 Know Saraswati Puja Shubha Muhurtham And Auspicious Things To Bring Home

Vasanta Panchami 2023 । సరస్వతి పూజకు శుభ ముహూర్తం ఇదే.. వసంత పంచమి నాడు ఈ వస్తువులను ఇంటికి తేవడం శుభప్రదం!

HT Telugu Desk HT Telugu

23 January 2023, 19:24 IST

    • Vasanta Panchami 2023: ఈ ఏడాది వసంత పంచమి జనవరి 26న జరుపుకుంటున్నాం. ఈరోజున కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం శుభప్రదం, శుభ ముహూర్తం కూడా తెలుసుకోండి.
Vasanta Panchami 2023:
Vasanta Panchami 2023: (Freepik)

Vasanta Panchami 2023:

Vasanta Panchami 2023: ప్రకృతిలో జరిగే కొన్ని మార్పులకు సూచనగా మనం కొన్ని పండుగలను జరుపుకుంటాం, అందులో ఒక పండుగ వసంత పంచమి. హిందూ మతంలో వసంత పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమిని వసంత పంచమి అంటారు. దీనినే శ్రీపంచమి అని కూడా అంటారు. ఇది రుతు సంబంధమైన పర్వం. వసంత రుతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనడమైనది. వసంత రుతువు రాకను స్వాగతిస్తూ భారతదేశమంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. 2023లో వసంత పంచమిని 26 జనవరి, గురువారం నాడు జరుపుకుంటున్నాము. ఈరోజు నుంచి భారతదేశంలో వసంత రుతువు ప్రారంభమవుతుంది.

లేటెస్ట్ ఫోటోలు

మే 2, రేపటి రాశి ఫలాలు.. రేపు రాజకీయ నాయకులకు కష్టసమయం, శత్రువులను గుర్తించండి

May 01, 2024, 08:31 PM

Shukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే, కోరికలు నెరవేరతాయి

May 01, 2024, 02:35 PM

మే 1, రేపటి రాశి ఫలాలు.. పనిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయి, ఎవరినీ చూసి మోసపోవద్దు

Apr 30, 2024, 09:06 PM

Gajakesari Raja Yoga : గజకేసరి రాజ యోగం.. వీరికి అన్ని విధాలుగా సూపర్

Apr 30, 2024, 02:10 PM

Gajakesari yogam: మే నెలలో అదృష్టాన్ని పొందబోతున్న రాశులు ఇవే.. ఆదాయం రెట్టింపు

Apr 30, 2024, 02:04 PM

అదృష్టం అంతా ఈ రాశి వారిదే! డబ్బు, ప్రమోషన్​.. అని సమస్యలు దూరం

Apr 30, 2024, 06:14 AM

కొన్ని ప్రాంతాలలో వసంత పంచమి పర్వదినాన్ని సరస్వతి పూజగా జరుపుకుంటారు. సరస్వతీ దేవి జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైనవాటిని సరస్వతీదేవి అంశలుగా పండితులు భావిస్తారు. ఈ సందర్భంగా చదువుల తల్లి సరస్వతీదేవి చల్లని చూపుల కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజున అక్షరాభ్యాసాలు చేస్తారు, వివాహాలు చేసుకోవడానికి కూడా ఉత్తమమైన రోజుగా భావిస్తారు.

Vasanta Panchami 2023 Shubha Muhurtham - వసంత పంచమి 2023 శుభ ముహూర్తం

జ్యోతిష్యుల ప్రకారం, వసంత పంచమి శుభ ముహూర్తం 2023, జనవరి 26, గురువారం ఉదయం 07.12 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.04 వరకు ఉంటుంది. ఇది సరస్వతి మాతను పూజించడానికి ఉత్తమమైన సమయం.

వసంత పంచమి రోజున కొన్ని వస్తువులను (auspicious things) కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు మాల

వసంత పంచమి రోజున పసుపు రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పసుపు పూలతో అల్లిన మాల, క్రిస్టల్ బాల్ కొనుగోలు చేస్తారు. దీన్ని ఇంటి ప్రధాన ద్వారంపై అమర్చడం వల్ల పిల్లలకు చదువులో ఎదురయ్యే సమస్యలు దూరమవుతాయని నమ్మకం.

నెమలి ఈక

వసంత పంచమి రోజున నెమలి ఈకలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున నెమలి ఈకను మీ ఇంటికి తూర్పు దిశలో జంటగా ఉంచాలి, పుస్తకాలలోనూ పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వలన సరస్వతి, లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

సంగీత వాయిద్యం

సరస్వతి దేవిని సంగీత దేవతగా కూడా కొలుస్తారు. కాబట్టి ఈరోజున ఏదైనా సంగీత వాయిద్యం కొనుగోలు చేయడం చాలా శుభప్రదం. మీరు వసంత పంచమి రోజున చిన్న వేణువును కూడా కొనుగోలు చేయవచ్చు . ఈ రోజున సరస్వతీ మాత పాదాల వద్ద వేణువును తప్పనిసరిగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

పుస్తకం- కలం

సరస్వతి దేవీని చదువుల తల్లి, జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఈరోజున చదువుకు సంబంధించిన సామాగ్రి కొనుగోలు చేయాలి. పుస్తకం, కలం వంటివి కొనుగోలు చేసి సరస్వతీ దేవి పాదాల చెంత ఉంచితే అనుగ్రహం కలుగుతుంది. పరీక్షలు రాసే విద్యార్థులు బాసర సరస్వతీక్షేత్రంలో అమ్మ పాదాల చెంత ఉంచిన కలంతో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయినట్లు చెబుతారు.

సరస్వతి విగ్రహం

బసంత పంచమి రోజున, మీరు సరస్వతి తల్లి చిత్రపటం, విగ్రహం లేదా ప్రతిమను ఇంటికి తీసుకురావచ్చు. వసంత పంచమి రోజున, ఇంటి ఈశాన్య మూలలో సరస్వతి దేవి చిత్రపటాన్ని ఉంచండి. ఇది పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతుంది.

వివాహానికి సంబంధించిన సామాగ్రి

జ్యోతిష్యం ప్రకారం, వసంత పంచమి నాడు శివుపార్వతుల వివాహం కోసం తిలకోత్సవం జరిగింది. అందుకే ఈ రోజున వివాహ వస్త్రాలు, నగలు లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. వీటిని కొనడం వల్ల అదృష్టం పెరుగుతుంది.

టాపిక్