తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి కలిసి వస్తుంది.. ఒప్పందాలు, ఎగ్రిమెంట్లు పూర్తవ్వడంతో పాటు మరెన్నో లాభాలు

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి కలిసి వస్తుంది.. ఒప్పందాలు, ఎగ్రిమెంట్లు పూర్తవ్వడంతో పాటు మరెన్నో లాభాలు

HT Telugu Desk HT Telugu

20 December 2024, 4:00 IST

google News
    • Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 20.12.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి కలిసి వస్తుంది
Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి కలిసి వస్తుంది (freepik )

Today Rasi Phalalu: ఈరోజు ఈ రాశుల వారికి కలిసి వస్తుంది

రాశిఫలాలు (దిన ఫలాలు) : 20.12.2024

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

2025 జనవరిలో మాళవ్య రాజయోగంతో వీరికి ధన యోగం, ఊహించని ప్రయోజనాలు!

Dec 19, 2024, 06:09 AM

Ketu Gochar: కేతువు సంచారంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు

Dec 18, 2024, 10:34 AM

2025లో సూర్యుడి మెుదటి సంచారం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్, పెండింగ్ పనులు పూర్తి!

Dec 18, 2024, 08:09 AM

2025 నుంచి ఈ మూడు రాశులకు జీవితంలో అద్భుతాలు, పెట్టుబడుల నుంచి లాభాలు!

Dec 17, 2024, 04:42 PM

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : శుక్రవారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : మాఘ

మేష రాశి:

అధికారులతో సంయమనంతో వ్యవహరించండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. ఉద్యోగులు ఆశించకుండా బాధ్యతలు నిర్వహించుకోవాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా-బయటా గతంలోని సమస్యలను సమర్థించుకొంటారు. ప్రయాణాలు, పెట్టుబడులు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు శుభవార్తలుంటాయి. గురు, శుక్ర, శని, ఆది వారములు అనువైనవి.

వృషభ రాశి:

పలుకుబడిని ఉపయోగించుకొని ముఖ్యమైన పనుల్ని పూర్తిచేసుకుంటారు. సోదర వర్గం నుండి విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధిని పొందుతారు. స్థిరాస్తులు చేతికొస్తాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఊహించుకొన్న అవకాశాలేర్పడతాయి. ఊహించని ప్రయాణాలేర్పడతాయి.

మిథున రాశి:

కుటుంబ వ్యవహారాల్లో సంయమనములతో సాగాలి. అవసరాలను సమర్థించుకొనునట్లు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణతలు కొనసాగుతాయి. కొన్ని విషయాల్లో అధికారులతో ఉద్యోగులు రాజీపడి వ్యవహరించుకోవలసిరావచ్చును. వ్యాపారాలలో రావలసిన అనుమతులకై ఎదురుచూడవలసివుంటుంది. వీరికి గురు, శుక్ర వారములలో అన్ని విషయాలలో జాగ్రత్తలు అవసరం.

కర్కాటక రాశి:

కొన్ని పనుల్లో ఒత్తిడి, కొన్నింట ఉత్సాహవంతంగా ఉంటాయి. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయాలు పెరగకుండా జాగ్రత్తలు అవసరం. కుటుంబ వ్యక్తులకై ఎక్కువ సమయం గడపవలసి రావచ్చును. వసూలు అవుతాయని ఊహించుకొన్న బెనిఫిట్స్ వంటివి నిరాశలకు గురిచేస్తాయి. సంతానం నుండి శుభవార్తలు వినుట, వారికై చిన్నతరహా బహుమతులు ఏర్పరచడం వంటివి ఉంటాయి.

సింహ రాశి:

వృత్తి, ఉద్యో గాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యక్తిగత విషయాలలో ఇతరుల ప్రమేయాలచే భావోద్వేగాలకు గురయ్యే సూచనలున్నాయి. ఆరోగ్య, ఆర్థిక విషయాలు పరవాలేనివిగా సాగుతాయి. మీ ప్రతి నిర్ణయానికీ పునఃపరిశీలనలు తప్పని సరి చేయండి.

కన్య రాశి:

అభివృద్ధికై అదనపు రుణాలను స్వీకరిస్తారు. ఖర్చులు సామాన్యం. బంధుమిత్ర వర్గానికి సహకరిస్తారు. నిర్దిష్టమైన ప్రయత్నాల్ని సాగి స్తారు. వ్యాపారాలు ఊహించుకొన్నట్లుగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూస్తారు. అనవసర విషయాలకు స్పందించకుండా బాధ్యతాయుతంగా సాగితే గుర్తింపులు పొందుతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభవార్తలుంటాయి.

తుల రాశి:

సామాజిక పరిస్థితులలో చిన్నతరహా ఒత్తిడులను ఎదుర్కొంటారు. తలపెట్టుకొన్న సంప్రదింపులు పూర్తిచేసుకుంటారు. వ్యాపారాల్లో ఒత్తిడులను సమర్థించుకొంటారు. ఉద్యోగులకు బాధ్యతల మార్పు వంటివి ఉంటాయి. స్థిరాస్తుల్ని క్రమబద్దీకరించుకొంటారు. రాబడి- పోకడలపై దృష్టిపెట్టగలుగుతారు.

వృశ్చిక రాశి:

పట్టుదలతో ప్రయత్నించి పనులు సాధిస్తారు. ఆర్థికంగా వృద్ధినిచ్చు అంశాలను చేపట్టుకుంటారు. ఒప్పందాలు, ఎగ్రిమెంట్లు పూర్తిచేసుకుంటారు. ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు అవసరం. నిరుద్యోగులు తొందరపాటుతో కూడిన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణ పనులు కొనసాగుతాయి.

ధనుస్సు రాశి:

నిర్దిష్టమైన ప్రణాళికలతో సాగాల్సివుంటుంది. గత పరిచయాలచే చిన్నతరహా ఇరకాట పరిస్థితులను చూడవలసిరావచ్చును. కుటుంబ వ్యక్తుల నుండి సహకారాలు ఏర్పరచుకుంటారు. చేపట్టుకున్న పనులను మధ్యలో ఆపకుండా సాగాలి. ఆదాయానికి తగిన ఖర్చులనే చేపట్టుకోండి. యంత్ర వాహనాలతో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. వాయిదాల చెల్లింపులకు జాగ్రత్తలు తీసుకోండి.

మకర రాశి:

ఇతరులను నొప్పించకుండా వ్యవహరించుకోవలసివుంటుంది. కుటుంబంలో ఊహించని నిశ్శబ్దతలు చోటుచేసుకొంటాయి. ఖర్చులలో మెలకువలు తప్పనిసరి చేయండి. ప్రతికూలతలు, ఆటంకాలు ఉంటున్నా చేపట్టుకొన్న పనులకు పట్టుదలలు చూపుకొంటే అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో సాధారణతలు కొనసాగుతాయి.

కుంభ రాశి:

ఈ వారంలో పనులకు పట్టుదలలు జోడించండి. మీవి కాని విషయాలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా సాగాలి. అవసరాలను సమర్థించుకొనునట్లు ఆదాయాలుంటాయి. బంధువర్గంతో సరదాలు పంచుకొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం చికాకుపరచగలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రొటేషన్లకే ప్రాధాన్యతనిచ్చుకొని సాగాలి. విద్యార్థులు టార్గెట్ విధానాల్ని పాటించుకోవాలి. శని, ఆది, సోమ వారములు అనువైనవి.

మీన రాశి:

కుటుంబంలో సహకార లోపత్వములు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనికి తగినంత సమయ కేటాయింపులు అవసరం. ఖర్చులను, ఆదాయమును సరిచూసుకుంటూ సాగాలి. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటూ వ్యవహరించుకోవాలి. విద్యార్థులు, అధ్యాపకులతో సంయమనములు పాటించుకోవాలి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం