Om Gam Ganapataye Namaha: ‘ఓం గమ్ గణపతయే నమః’ అని జపిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి.. కోరుకున్న ఉద్యోగం కూడా వస్తుంది
19 December 2024, 14:00 IST
- Om Gam Ganapataye Namaha: 'ఓం గం గణపతయే నమః' అనేదే చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. గణేశుని ఆశీస్సులు లభిస్తాయి. ఎప్పుడైనా ఏదైనా కొత్త పనికి శ్రీకారం చుట్టినప్పుడు, ఉద్యోగం రావాలనుకున్నా లేదంటే ప్రేమలో విజయాన్ని పొందాలన్నా ఈ మంత్రాన్ని జపిస్తే మంచిదే.
Om Gam Ganapataye Namaha: ఓం గమ్ గణపతయే నమః అని జపిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి
లంబోదరుడు, గణనాథుడు, గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు.. ఇలా వినాయకుడికి ఎన్నో పేర్లు. వినాయకుడిని మనం ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోయి, మంచి జరుగుతుందని.. పనులు అన్నీ కూడా అడ్డంకులు లేకుండా పూర్తయిపోతాయని చాలా మంది నమ్ముతారు. పైగా ఏ పని చేసినా కూడా మొట్టమొదట కచ్చితంగా గణపతిని ఆరాధించాలి. ఆ తర్వాతే ఇతర దైవాలను ఆరాధించాలి. పెద్దలు కూడా ఈ విషయాన్ని చాలా సార్లు చెప్తూ ఉంటారు. గణేషుడు ఎప్పుడూ కూడా తొలి పూజలు అందుకుంటారు. ఏ పని మొదలుపెట్టినా కచ్చితంగా గణపతికి పూజ చేసి, ఆ తర్వాత ఆ పనిని మొదలు పెడితే చేపట్టిన కార్యం పూర్తవుతుందని నమ్మకం.
లేటెస్ట్ ఫోటోలు
గణేశుడిని ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. అనుకున్న పనులు కచ్చితంగా నెరవేరుతాయి. 'ఓం గం గణపతయే నమః' అనేదే చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. గణేశుని ఆశీస్సులు లభిస్తాయి. ఎప్పుడైనా ఏదైనా కొత్త పనికి శ్రీకారం చుట్టినప్పుడు, ఉద్యోగం రావాలనుకున్నా లేదంటే ప్రేమలో విజయాన్ని పొందాలన్నా, రోజును మొదలు పెట్టాలన్నా ఈ మంత్రాన్ని జపిస్తే మంచిదే. ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి ప్రతికూల శక్తి కలగకుండా, భయాలేమీ లేకుండా ఉండేందుకు ఈ మంత్రం సహాయపడుతుంది.
ఓం గం గణపతయే నమః అంటే అర్థం ఏంటి?
'ఓం' అనేది సంస్కృత పదము. ఓం అని జపించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. అపారమైన శక్తి, అద్భుత శక్తులను ఇది కలిగి ఉంటుందని నమ్ముతారు. ఓం అనేది అక్షరం. ఇది అవినాశ స్వరూపం. సమస్త జగత్తు అంతా ఓంకారం అయ్యి ఉంది.
గమ్- గణేశుని యొక్క బీజ శబ్దం.
గణపతి- గణపతి అంటే మనకి తెలిసిన గణేశుడే. విఘ్నాలని తొలగించేవాడు.
నమః- నమః అంటే గౌరవించడం.
ఈ గణేష్ మంత్రాన్ని ఎందుకు జపించాలి?
చాలా శక్తివంతమైన మంత్రం. దీనిని జపించడం వలన శక్తి వస్తుంది. విఘ్నాలని తొలగించడానికి సమస్యలు లేకుండా ఉండడానికి ఈ మంత్రం మనకి సహాయం చేస్తుంది. ఈ మంత్రాన్ని జపించడం వలన ఫోకస్ పెట్టగలము. అనుకున్న వాటిని సాధించవచ్చు. మంచి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి.
ఓం గం గణపతయే నమః అని జపిస్తే ఎలాంటి ఫలితాలని పొందవచ్చు?
కొత్త పనులకి శ్రీకారం చుట్టడానికి, మనసుని మెదడుని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఫోకస్ ని పెంచుకొని అడ్డంకులు కలగకుండా చూస్తుంది.
ధనాన్ని, అదృష్టాన్ని, విజయాన్ని కూడా అందించేందుకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది.
ఈ మంత్రాన్ని జపించడం వలన సామర్థ్యం పెరుగుతుంది. భయం తొలగిపోతుంది.
మనసులో కానీ బయట కానీ ఎలాంటి అడ్డంకులు ఉన్నా తొలగించడానికి ఈ మంత్రం సహాయపడుతుంది.
ఈ మంత్రాన్ని జపించడం వలన బంధం బలం పడుతుంది. సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
చెడు వైబ్రేషన్స్ నుంచి ప్రతికూల ఎనర్జీ నుంచి ఈ మంత్రం మనల్ని రక్షిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.