సంకష్టి చతుర్థి.. గణేశుడిని పూజిస్తే విఘ్నాలు తొలగుతాయి
నేడు జూన్ 7న సంకష్టి చతుర్థి జరుపుకుంటారు. ఈ సంకట హర చతుర్థి ఉపవాసం, పూజా విధానం, శుభ ముహూర్తం వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సంకష్టి చతుర్థి రోజు గణేశుడిని పూజించాలి (ANI)
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో రెండుసార్లు చతుర్థి వస్తుంది. వీటిలో కృష్ణ పక్ష చతుర్థిని సంకష్టి చతుర్థి అని, శుక్ల పక్ష చతుర్థిని వినాయక చవితి అని అంటారు. కృష్ణ పక్షంలోని సంకష్టి చతుర్థిని కృష్ణపింగల్ సంకష్టి చతుర్థి అంటారు. నేడు జూన్ 7న సంకష్టి చతుర్థి జరుపుకుంటారు. ఈ సంకట హర చతుర్థి ఉపవాసం, పూజా విధానం, శుభ ముహూర్తం వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హిందూ క్యాలెండర్ చతుర్థి తేదీ జూన్ 06, మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటల నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 7వ తేదీ రాత్రి 9.50 గంటల వరకు ఉంటుంది. నేడు బుధవారం జూన్ 7వ తేదీన కృష్ణ పింగల్ సంకష్టి చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు.
పూజా విధానం
- ఈరోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసిన తరువాత పూజాస్థలాన్ని శుద్ధి చేసి గంగాజలం చల్లుకోవాలి.
- ఆ తరువాత వినాయకుడికి దీపం వెలిగించాలి. పూలు సమర్పించాలి.
- వినాయకుడికి మోతీచూర్ లడ్డూ లేదా మోదక్‌తో నైవేద్యం సమర్పించాలి. లేదా అరటి పండ్లు, కొబ్బరికాయ నివేదించాలి. బెల్లంతో నైవేద్యం సమర్పించాలి.
- చివరగా వినాయకుడికి హారతి ఇవ్వాలి.
- ఈరోజు సంకట నాశన గణేశ స్తోత్రం నాలుగుసార్లు చదవాలి.
- విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించాలి.
- బ్రహ్మచర్యం పాటించాలి.
సంకష్టి చతుర్థి ఉపవాసం
సంకష్టి చతుర్థి ఉపవాసం ఉండడం వల్ల వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి. విఘ్నాలు తొలగిపోతాయి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోతాయి.
ఇంకా జ్యోతిషంగ్రహ సంచారం, దేవాలయాలు, వాస్తు శాస్త్రం, జ్యోతిష పరిహారాలు, ఆధ్యాత్మిక సమాచారం, పండగలు, పూజా విధానం, వ్రత విధానం, రాశి ఫలాలు వంటి కథనాలు చదవండి.