Chanting mantras: ఈ మంత్రాలు జపించడం వల్ల మీ జీవితమే మారిపోతుంది
Chanting mantras: శారీరక, మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ కొన్ని మంత్రాలు జపించడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దైవానికి మీరు దగ్గరవుతారు.
Chanting mantras: ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటాం. దాని నుంచి బయట పడటం కోసం యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉంటారు. ఇవి మాత్రమే కాదు కొన్ని మంత్రాలు జపించడం వల్ల కూడా మనసుకి హాయిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండగలుతారు. ఒత్తిడిని ఎదుర్కోగలిగే సామర్థ్యం పెరుగుతుంది.

హిందూ సనాతన ధర్మంలో మంత్రాలు, జపాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మంత్రాలు, జపం ఎంత శక్తివంతమైనవో దేవుడిని నిత్యం కొలిచే భక్తులకు తెలుసు. శక్తివంతమైన ఈ మంత్రాలు ప్రతిరోజూ జపించడం వల్ల దేవుళ్ళతో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ జీవితాలని మార్చడంలో సహాయపడే ఆరు శక్తివంతమైన మంత్రాల జాబితా ఇది.
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల అతి పెద్ద సమస్యల నుంచి బయట పడొచ్చు. విధ్వంసం, పరివర్తన రెండింటినీ సూచించే పరమాత్మ శివునికి అంకితం చేసిన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎలాంటి ప్రతికూల శక్తులు మీ దరి చేరవు. శివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నిత్యం ఈ మంత్రం జపిస్తే శివుని అనుగ్రహం పొందుతారు. ఆధ్యాత్మికంగా బలపడతారు. దైవానికి దగ్గరగా ఉంటారు.
ఓం గన్ గణపతయే నమః
విఘ్నాలు తొలగించే వినాయకుడికి ఓం గన్ గణపతయే నమః అంటూ స్మరించుకుంటారు. ఒక వ్యక్తి తన జీవితంలోని అన్ని అడ్డంకులని తొలగించుకోవాలని అనుకుంటే ఈ మంత్రం జపించాలి. ఈ గణేష్ మంత్రం అవాంఛిత అడ్డంకులణి తొలగించడం మాత్రమే కాదు తెలివి, జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వినాయకుడి ఆశీర్వాదాలు పొండటంలో సహాయపడతాయి.
గాయత్రీ మంత్రం
అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో గాయత్రీ మంత్రం ఒకటి. “ఓం భూర్ భువః స్వాహా, తత్-సవితుర్ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్” అంటూ గాయత్రీ మంత్రం జపించడం వల్ల మనసుకి ప్రశాంతత దొరుకుంటుంది. ఉనికిలో ఉన్న అత్యంత ప్రశాంతమైన మంత్రాలలో గాయత్రీ మంత్రం ఒకటిగా చెప్తారు. ఓం అనే ఆదిమ ధ్వనితో ప్రారంభమయ్యే ఈ గాయత్రీ మంత్రం మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది. ఈ మంత్రం పఠించినా లేదా ధ్యానించినప్పుడు పలికినా మనసు హాయిగా ఉంటుంది. గాయత్రీ మంత్రం సార్వత్రిక శక్తి చాలా శక్తివంతమైనది. అంతర్గత శాంతి, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. రుద్రాక్ష పట్టుకుని ఈ మంత్రం 108 సార్లు జపించాలి.
ఓం హ్రీం శ్రీం లక్ష్మీ భ్యో నమః
సంపద, సమృద్ధి, శ్రేయస్సు ప్రదాత లక్ష్మీ దేవికి అంకితం చేయబడిన మంత్రం ఇది. ఈ మంత్రం పఠించడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. దీని ద్వారా ప్రజలు భౌతిక, ఆధ్యాత్మిక సంపద కోసం పఠిస్తారు. ఈ మంత్రం జపించడం వల్ల భక్తులు తమ శక్తి, ఆలోచనలలో మార్పును అనుభవిస్తారు.
ఓం మహాసరస్వతే నమః
సరస్వతీ దేవి బుద్ధి, జ్ఞానాన్ని అందించే తల్లి. గ్రంథాల నుంచి కళల వరకు సరస్వతీ దేవి కటాక్షం ఉంటే అందులో రాణించేలా చేస్తుంది. ఓం మహాసరస్వతే నమః అనేది ఆమెకి నివాళి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విద్యార్థుల తెలివితేటలు పెరుగుతాయి. ఏకాగ్రతని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఓం హుం హనుమతే నమః
భగవంతుదు హనుమంతునికి అంకితం చేయబడిన మంత్రం ఇది. చెడుని తొలగించి బలాన్ని ఇచ్చేవాడు హనుమంతుడు. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందటం కోసం ఈ మంత్రం సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ధైర్యం, బలం వస్తాయి. చెడు, దుష్టశక్తులతో పోరాడేందుకు మీకు ధైర్యాన్ని ఇస్తుంది.