తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్టోబర్ 7, నేటి రాశి ఫలాలు- ఈరోజు మీరు మొహమాటానికి పోతే నష్టాలు తప్పవు

అక్టోబర్ 7, నేటి రాశి ఫలాలు- ఈరోజు మీరు మొహమాటానికి పోతే నష్టాలు తప్పవు

HT Telugu Desk HT Telugu

07 October 2024, 0:01 IST

google News
  • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 07.10.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబర్ 7 నేటి రాశి ఫలాలు
అక్టోబర్ 7 నేటి రాశి ఫలాలు (pixabay )

అక్టోబర్ 7 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 07.10.2024

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

వారం: సోమ‌వారం, తిథి : చ‌వితి,

నక్షత్రం: అనూరాధ, మాసం : ఆశ్వయుజం ,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

అదృష్ట యోగం కొనసాగుతోంది. ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఉద్యోగులకు కలిసొచ్చే కాలం ఇది. నలుగురికీ ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. అవసరాలకు డబ్బు అందుతుంది. భూ, గృహ, వాహన యోగాలు ఉన్నాయి. కుటుంబానికి మేలు జరుగుతుంది. లక్ష్మీదేవిని ధ్యానించాలి.

వృషభం

రాహువు ప్రభావంతో లాభాలు అందుకుంటారు. పనులు వాయిదా వేయకండి. లక్ష్యాలను పూర్తి చేయండి. చెడు ఆలోచనలు వద్దు. ఇబ్బందులు సృష్టించే వ్యక్తుల విషయంలో జాగ్రత్త. మిత్రులు సలహాలు తీసుకోండి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు మనోబలంతో విజయాలు సాధిస్తారు. బుద్ధిబలం అవసరం. వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. మీ ఆశయాలకు తగినట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వాస్తవిక దృష్టితో ఆలోచించండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. ఓ శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి.

కర్కాటకం

మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దృఢ సంకల్పం అవసరం ఉంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. అధికారులు ప్రశంసలు లభిస్తాయి. స్థిరత్వం సాధిస్తారు. వ్యాపారంలో మరింత శ్రద్ధ చూపాలి. కొన్ని సందర్భాల్లో సంభాషణా చాతుర్యం అవసరం. అపార్థాలకు తావివ్వకండి. ఏకాదశ గురువు కార్యసిద్ధితో పాటు అదృష్టాన్నీ ఇస్తాడు. శివారాధన శుభప్రదం.

సింహం

మనోబలంతో పనులు ఆరంభిస్తారు. నిర్ణయాలను బలంగా అమలు చేస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. పొదుపు సూత్రాలను పాటించండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అధికారులు ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. పరిస్థితులను అంచనా వేస్తూ అడుగు ముందుకేయాలి. దక్షిణామూర్తిని ఉపాసించాలి.

కన్య

ముఖ్య విషయాల్లో విజయం మీదే. దృఢమైన నిర్ణయాలు తీసుకోండి. అంతే బలంగా వాటిని అమలు చేయండి. పరిస్థితుల్ని అంచనా వేస్తూ వ్యాపారాన్ని విస్తరించాలి. గతంలోని ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. ఇష్టదైవాన్ని స్మరించండి.

తుల

స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ఏకాగ్రతతో ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. తోటి సిబ్బందితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవాలి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వొద్దు. మిత్రుల అండ లభిస్తుంది. వ్యాపార నిర్ణయాలపై ఇతరుల మీద ఆధారపడటం మంచిది. కాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

వృశ్చికం

ఉద్యోగ ఫలితాలు బావుంటాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు అంతా మంచే జరుగుతుంది. ఉన్నతాధికారుల కటాక్షం లభిస్తుంది. పొరపాట్లకు తావివ్వకండి. నలుగురికీ సాయం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవ‌స‌రం. తోటివారి ప్రోత్సాహం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపు తారు. కుజగ్రహ శ్లోకం చదువుకోవాలి.

ధనుస్సు

నేటి రాశి ఫలాల ప్రకారం ధనుస్సు రాశి వారికి ధనయోగం సూచితం. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏకాదశంలో శుక్రుడు ఉండటం వల్ల సంపదలు పెరుగుతాయి. ఉద్యోగ ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. క్రమశిక్షణతో అవరోధాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

మకరం

సంకల్పంతో పనులు ఆరంభిస్తారు. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. ప్రశాంతంగా వ్యవహరించండి. ఓర్పు అవసరం. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు. ప్రయత్నాలు వికటిస్తే నష్టాలకు ఆస్కారం ఎక్కువ. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకండి. మౌనమే ఉత్తమం. సూర్య భగవానుడిని ధ్యానించాలి.

కుంభం

మనోబలంతో ముందుకెళ్తారు. భాగ్యస్థానంలో లక్ష్మీగ్రహమైన శుక్రుడు ఉండటం వల్ల ఆర్థిక ప్రగతి సాధ్యం అవుతుంది. మొహమాటానికిపోతే నష్టాలు తప్పవు. జయాపజయాలకు అతీతంగా మీవంతు ప్రయత్నం చేయండి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. తోటివారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. నవగ్రహాలను ధ్యానించాలి.

మీనం

ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అంతిమంగా విజయం మీదే. తాత్కాలిక అవరోధాలకు అధైర్యం వద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. శుక్రగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదే సమయంలో వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలకు తగిన సమయం కాదు. పరమేశ్వరుడిని ఆరాధించండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం