అక్టోబర్ 15, నేటి రాశి ఫలాలు- పరిచయాలు పెరుగుతాయి, ఉద్యోగులకు ప్రమోషన్ దక్కుతుంది
15 October 2024, 0:01 IST
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 15.10.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 15 నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 15.10.2024
లేటెస్ట్ ఫోటోలు
వారం: మంగళవారం, తిథి : శుక్ల ద్వాదశి,
నక్షత్రం: పూర్వాభాద్ర , మాసం : ఆశ్వయుజము ,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
అనుకున పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు కలసి వస్తాయి.వస్త్ర లాభం వస్తూ లాభం కలుగును .సేవాభావంతో ముందుకు సాగి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరతాయి. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారం. వ్యాపారులకు భాగస్వాములతో సఖ్యత. ఉద్యోగులకు కోరుకున్న ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల అంచనాలు నిజమవుతాయి.
వృషభం
అనుకున్న కార్యాలు కొంత ఆలస్యము కాగలవు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. వస్త్ర లాభం కలుగును. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గే సూచనలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొద్దిపాటి చికాకులు.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం. అనుకున్న ఆదాయం దక్కుతుంది. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగి కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. బంధువులతో కొంత విభేదిస్తారు. పనులు నెమ్మదిస్తాయి. ఆస్తుల వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన, గృహయోగాలు. ఊహించని విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పోస్టులు పెరుగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు దక్కుతాయి.
కర్కాటకం
పరిచయస్తుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తుల విషయంలో సోదరులు, సోదరీలతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవేత్తలు, కళాకారులకు కొంత నిరాశ ఉండొచ్చు.
సింహం
ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. చేపట్టిన కార్యాలు సకాలంలో పూర్తి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తుల వ్యవహారాలు చికాకు పరుస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఉద్యోగార్ధులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారులు పెట్టుబడుల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు సమస్యలు నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.
కన్య
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కుతాయి. వస్త్ర, వస్తు లాభం కలుగును .ఇంతకాలం సహనాన్ని పరీక్షించిన కొన్ని సమస్యల పరిష్కారం. ఆలోచనలకు కార్యరూపం. అనుకోని ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని కార్యాలు చక్కదిద్దడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రా మిక, రాజకీయవేత్తలకు అనుకోని అవకాశాలు.
తుల
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితులు చేదోడుగా నిలుస్తారు. వారి నుంచి ఊహించని సహాయసహకారాలు అందుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో సమస్యలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయా లు. యుక్తి ప్రదర్శించి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయ వేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.
వృశ్చికం
సన్నిహితులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. ఆదాయం కంటే ఖర్చులు పెరిగినా అవసరాలు తీరతాయి. తరచూ ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. కొన్ని కార్యాలు శ్రమకోర్చి పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాన్వేషణ కొంత ఫలిస్తుంది. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు మరిన్ని మీద పడతాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో బంధువుల నుంచి శుభవార్తలు. భూ, వాహనయోగాలు.
ధనుస్సు
ఓర్పు, చాకచక్యంతో ఇబ్బందుల నుంచి బయ టపడతారు. ఆలోచనలకు కార్యరూపం. విద్యా ర్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు అనుకున్న హోదాలు ఆలస్యంగా దక్కుతాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు కొద్దిపాటి చికాకులు. వస్త్ర, వస్తు లాభం కలుగును.
మకరం
బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగు పడతాయి. చేపట్టిన కార్యాలు దిగ్విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కివస్తాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వ్యా పారులకు లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహ ణలో స్వల్ప అవాంతరాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల పర్యటనలు రద్దు.
కుంభం
అనుకున్న వ్యవహారాలు కష్టసాధ్యమైనా సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మీ లక్ష్యసాధనలో సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. శాస్త్రసాంకేతిక విషయాలపై మక్కువ చూపుతారు. దేవాలయాలు సందర్శిస్తా రు. వ్యాపారులు కొన్ని సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామి కవేత్తలు, కళాకారులు సత్తా చాటుకుంటారు.వస్త్ర లాభం కలుగును
మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారి ఖ్యాతి మరింత పెరుగుతుంది. అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యు లను ఆశ్చర్యపరుస్తారు. రాబడి ఆశాజనకం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి స్నేహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులు ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం.
అందించిన వారు: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ