Dhanteras: ధంతేరాస్ ఎప్పుడు వచ్చింది? ఈరోజున కొత్త వస్తువులు కొనాలనే సంప్రదాయం ఎలా వచ్చింది?
Dhanteras: దీపావళి ముందు వచ్చే ధంతేరాస్ రోజు ఎక్కువగా బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. అసలు ఈ సంప్రదాయం వెనుక ఉన్న కారణం ఏంటి? ఆరోజు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలి? ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.
దీపావళికి రెండు రోజుల ముందు ధంతేరాస్ పండుగ జరుపుకుంటారు. దేవతలు, రాక్షసుల మధ్య సముద్ర మథనం జరిగినప్పుడు ధన్వంతరి భగవంతుడు అమృత పాత్రతో దర్శనమిచ్చాడని నమ్ముతారు. అందుకే ఈ రోజును దేశ వ్యాప్తంగా ధంతేరాస్ గా జరుపుకుంటారు.
ధంతేరాస్ సంపద, శ్రేయస్సు వేడుకకు ప్రతీక. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవితో పాటు, ధన్వంతరి, కుబేరుడిని పూజిస్తారు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, అదృష్టానికి దేవత. అదే సమయంలో ధన్వంతరి ఆయుర్వేద దేవుడు, ఆరోగ్యం, వైద్యంతో సంబంధం కలిగి ఉంటాడు. ప్రేమ, శ్రేయస్సు చిహ్నంగా ధంతేరాస్ లో బహుమతులు మార్పిడి చేసుకోవడం ఆచారం. ఈ రోజున ఆభరణాలు, బంగారు లేదా వెండి నాణేలు, రాగి, ఇత్తడి పాత్రలు, కొత్త వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది.
పూజతో పాటు ధంతేరాస్ లో మంగళకరమైన వస్తువులను కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. అదే రోజు వ్యాపార సంస్థల పుస్తకాలు, ఖాతాలు కూడా మారుతాయి. ధంతేరాస్ రోజున సరిసంఖ్యలలో (2, 4, 6, 8) చీపుర్లు కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున గోధుమ పిండి హల్వా, ధనియాలు, బెల్లం పొడి, బూందీ లడ్డును లక్ష్మీదేవి, ధన్వంతరికి పూజలో సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆశీస్సులు లభిస్తాయి. దృక్ పంచాంగ్ ప్రకారం ఈ రోజు అక్టోబర్ 29, 2024న ధంతేరాస్ జరుపుకోనున్నారు.
ధంతేరాస్ ఎప్పుడు?
ధంతేరాస్ రోజు ప్రదోష కాలంలో లక్ష్మీపూజను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈరోజు స్థిరమైన లగ్నం(వృషభ లగ్నం)లో లక్ష్మీదేవితో పాటు సంపదల దేవుడిగా భావించే కుబేరుడిని పూజించడం వల్ల అమ్మవారు ఇంట్లో నివశిస్తుందని నమ్ముతారు. ఈరోజున యమధర్మరాజుకు దీపాలను ఇచ్చే సంప్రదాయం ఉంది. త్రయోదశి తిథి అక్టోబర్ 29, 2024 ఉదయం 10.31 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 30 మధ్యాహ్నం 01.15 గంటలకు ముగుస్తుంది. ధంతేరాస్ పూజకు మంచి సమయం సాయంత్రం 6.30 నుంచి 8.12 వరకు ఉంటుంది.
ధంతేరాస్ లో పాత్రలు ఎందుకు కొంటారు?
మత విశ్వాసాల ప్రకారం ఆశ్వయుజ మాసంలో త్రయోదశి తిథి నాడు ధన్వంతరి సముద్ర మథనం నుండి కనిపించినప్పుడు అతని చేతిలో అమృతం నిండిన కుండ ఉంది. ధన్వంతరి భగవానుడు కలశంతో దర్శనమిచ్చాడు. అందుకే ధంతేరాస్ రోజున పాత్రలు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ఇది అదృష్టం, శ్రేయస్సు, ఆరోగ్యం తెస్తుందని నమ్ముతారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్