Mars transit: బలహీన రాశిలో కుజుడి సంచారం- ఈ నాలుగు రాశులకు కెరీర్ లో ఆటంకాలు, ఖర్చులు అధికం
Mars transit: అంగారకుడు మిథున రాశిని వీడి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల నాలుగు రాశుల వారి జీవితం నెలన్నర రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కోబోతుంది. కెరీర్ లో ఆటంకాలు ఎదురవుతాయి., ఖర్చులు అధికంగా ఉంటాయి.
అన్ని గ్రహాలకు అధిపతిగా భావించే అంగారకుడు త్వరలో రాశిని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 20న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంగారకుడికి ఇది బలహీన రాశి.
సంబంధిత ఫోటోలు
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
Feb 14, 2025, 08:05 AMGuru Transit: మిథున రాశిలో గురువు సంచారం.. ఈ 3 రాశులకు అదృష్టం, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 14, 2025, 06:15 AMఇక ఈ రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు! జీవితంలో అపార సంతోషం..
Feb 13, 2025, 08:09 AMRahu Transit: రాహువు కుంభ రాశి సంచారం.. ఈ రాశులకు ఆకస్మిక ధన లాభం, సంతోషంతో పాటు ఎన్నో
కుజుడు ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ఇది మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. కర్కాటకంలో కుజ సంచారం కొన్ని రాశుల వారికి అధికంగా మేలు చేస్తుంది. కానీ మరికొన్ని రాశులకు మాత్రం ఇబ్బందులు, సమస్యలు కలిగించబోతుంది. దీపావళికి ముందే కుజుడు తన రాశిని మార్చి ఎవరికి కష్టాలు ఇవ్వబోతున్నాడో చూద్దాం.
మేష రాశి
కుజుడి సంచారం వల్ల మేష రాశి వారికి కాస్త అసౌకర్యంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. సౌకర్యాలు తగ్గుతాయి. కెరీర్ పరంగా తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. వృత్తిపరంగా పని భారం ఉంటుంది. అధికారులు అండగా ఉండకపోవచ్చు. అందువల్ల మీరు ఉద్యోగ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో చిక్కులు ఉంటాయి. ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద దృష్టి సారించాలి.
సింహ రాశి
సింహ రాశి పన్నెండవ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. ఇది వృత్తి జీవితంలో సమస్యలు కలిగిస్తుంది. పని ప్రాంతంలో ఒత్తిడి ఉంటుంది. కొన్ని గొప్ప అవకాశాలు చేజారే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వ్యక్తులు చిక్కుల్లో పడతారు. భాగస్వామి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగిపోతాయి. వాటిని అదుపులోకి తీసుకురావడం కష్టం అవుతుంది. వ్యక్తిగత జీవితం చికాకులతో నిండిపోతుంది. జీవిత భాగస్వామితో సమస్యలు ఎదురవుతాయి. కుజుడి వల్ల అనుకోని సమస్యలు మీదపదే అవకాశం ఉంది. అందువల్ల ఈ నలభై ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి
అంగారకుడి సంచారం ధనుస్సు రాశి ఎనిమిదవ ఇంట్లో జరగబోతుంది. ఈ కాలం మీకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. పూర్వీకుల అస్తి నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కెరీర్ లో చాలా సమస్యలు ఉంటాయి. కుజుడి సంచారం వల్ల మీపై పని భారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారాలని చూస్తున్నట్టయితే ఇది సరైన సమయం కాదు. వ్యాపారులు లాభాలు పొందటం కోసం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మీన రాశి
మీన రాశి ఐదో ఇంట్లో కుజుడి సంచారం జరుగుతోంది. వ్యాపారస్థులకు ఇది కష్ట కాలం. భాగస్వామి కారణంగా చిక్కులు ఎదురవుతాయి. వ్యక్తిగత జీవితం మనస్పర్థలతో నిండిపోతుంది. జీవిత భాగస్వామి నుంచి సరైన మద్ధతు లభించదు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కళ్ళు, చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.