కుజుడి సంచారం: ఈ రాశుల వారికి మూడు నెలల పాటు అదృష్టం!
- కుజుడు (అంగారకుడు) అక్టోబర్ నెలలో రాశి మారనున్నాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరగనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- కుజుడు (అంగారకుడు) అక్టోబర్ నెలలో రాశి మారనున్నాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరగనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
జ్యోతిషం ప్రకారం, కుజుడి (అంగారకుడు) సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రాశులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్న కుజుడు అక్టోబర్‌లో వేరే రాశిలోకి ప్రవేశించనున్నాడు.
(2 / 5)
అక్టోబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోకి కుజుడు అడుగుపెట్టనున్నాడు. 2025 జనవరి 21వ తేదీ వరకు కర్కాటకంలో సంచరించనున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారికి ఎక్కువగా కలిసి రానుంది. సుమారు మూడు నెలల పాటు అదృష్టం మెండుగా ఉండే అవకాశం ఉంది.
(3 / 5)
వృశ్చికం: కర్కాటంలో కుజుడి సంచారం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని పెంచుతుంది. పెండింగ్‍లో ఉన్న చాలా పనులు ఈ కాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ధనం విషయంలో ప్రయోజనాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
(4 / 5)
మేషం: ఈ కాలంలో మేషరాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కొత్తగా వచ్చే ఆలోచనలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. పెట్టుబడులపై మంచి రాబడి ఉండొచ్చు. జీవిత భాగస్వామితో బంధం మరింత పెరుగుతుంది.
(5 / 5)
మీనం: కర్కాటకంలో కుజుడు సంచరించే కాలం మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వీరికి ఈకాలంలో ధనయోగం ఉంటుంది. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో బంధం మరింత మెరుగుపడుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి నిర్దిష్టమైన ఆధారాలు ఉండవు. సందేహాలను తీర్చుకునేందుకు, వ్యక్తిగత ప్రభావాలను తెలుసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించొచ్చు.)
ఇతర గ్యాలరీలు