Mercury combust: అస్తంగత్వ దశలోకి బుధుడు- ఈ ఆరు రాశుల వారికి ఖర్చులు అధికం, వ్యాపారంలో నష్టాలు
Mercury combust: గ్రహాల రాకుమారుడు బుధుడు మరో రెండు రోజుల్లో అస్తంగత్వ దశలోకి వెళ్లబోతున్నాడు. దీని వల్ల ఆరు రాశుల వారికి ఆర్థిక కష్టాలు, కెరీర్ లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారులకు ఈ సమయం కష్టంగా ఉంటుంది.
Mercury combust: నవగ్రహాలలో బుధుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం. సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. అతి చిన్న గ్రహం. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు జ్ఞానం, కమ్యూనికేషన్, తార్కిక ఆలోచనలు వంటి వాటికి కారకుడిగా పరిగణిస్తారు. మరో రెండు రోజుల్లో బుధుడు అస్తంగత్వ దశలోకి వెళ్లనున్నాడు.
బుధుడు రవాణా, సాంకేతికత, వాణిజ్యం వంటి వాటిని కూడా ప్రభావితం చేస్తుంది. బుధుడు ప్రస్తుతం సింహ రాశిలో సంచరిస్తున్నాడు. 14 సెప్టెంబర్, 2024న 12:50 గంటలకు దహనం అవుతుంది. సెప్టెంబర్ 23న బుధుడు కన్యా రాశిలో సంచరిస్తాడు.
జ్యోతిషశాస్త్రం ప్రకారంబుధుడి అస్తంగత్వం ఆలోచన, విశ్లేషణ, కమ్యూనికేషన్ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. మంత్రాలు చదవడం వల్ల బుధ గ్రహాన్ని బలోపేతం చేయడం ప్రతికూల పరిణామాలను తగ్గించడంలో సహాయపడుతుంది. సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఏదైనా గ్రహం అస్తంగత్వ దశలోకి వెళ్తుంది. బుధుడి కదలిక వల్ల ఏయే రాశులకు ప్రతికూలంగా ఉంటుందో చూద్దాం.
మేష రాశి
మేష రాశి 3,6వ గృహాలలో బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. 5వ ఇంట్లో దహనం అవుతాడు. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో ఎలా ముందుకు సాగాలి అనే దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. వ్యాపారంలో ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. డబ్బు చేజారిపోతుంది. ఆదా చేసేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
వృషభ రాశి
2, 5వ గృహాలకు బుధుడు అధిపతి. ఇప్పుడు వృషభ రాశి వారికి 4వ ఇంట్లో దహనం చేస్తాడు. కుటుంబంలో సమస్యలు, ఆర్థిక కష్టాలు ఉంటాయి. వృత్తి, కెరీర్ పురోగతిలో అడ్డంకులు ఏర్పడతాయి. శత్రువుల చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది. కుటుంబం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.
కర్కాటక రాశి
బుధుడు కర్కాటక రాశి వారికి 3, 12వ గృహాలను పాలిస్తాడు. 2వ ఇంట్లో అస్తంగత్వ దశలోకి వెళతాడు. దీని వల్ల వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తిపరంగా మీ పని పట్ల అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారంలో నష్టాలు తగ్గించుకోవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఊహించని పరిణామాలకు దారి తీస్తాయి. బదులుగా మరింత నష్టాలను మిగులుస్తాయి.
కన్యా రాశి
కన్యా రాశి 1, 10వ గృహాలకు అధిపతి బుధుడు. పన్నెండవ ఇంట్లో దహన స్థితిలోకి వెళతాడు. అనుకోని ప్రయాణాల వల్ల డబ్బు నష్టపోతారు. కెరీర్ లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ సమయంలో ఉద్యోగం మారకపోవడం మంచిది. వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు రావడం అస్థిరంగా ఉంటుంది. ఆదాయాన్ని పొందటంలో అంతరాలు ఎదుర్కొంటారు. సంపదను పెంచుకునే అవకాశాలు తగ్గుతాయి. అదే విధంగా ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
తులా రాశి
తులా రాశి తొమ్మిది, పన్నెండు గృహాలకు అధిపతి బుధుడు. పదకొండవ ఇంట్లో దహనం అవుతాడు. జీవితంలో అసమతుల్యత ఏర్పడుతుంది. రోజువారీ వ్యవహారాలలో అదృష్టం మీకు కలిసి రాకపోవచ్చు. కెరీర్ లో మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు రావడం కష్టతరం అవుతుంది.
మకర రాశి
మకర రాశి ఎనిమిదవ ఇంట్లో బుధుడు అస్తంగత్వ దశలోకి వెళతాడు. కెరీర్ కు సంబంధించి పనిలో అసంతృప్తి ఏర్పడుతుంది. ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడతారు. వ్యాపార విస్తరణలో ఎదురుదెబ్బలు తగులుతాయి. ఆర్థిక పెరుగుదల కష్టంగా ఉంటుంది.
బుధుడి ప్రతికూల ప్రభావాలు తగ్గించే మార్గాలు
బుధవారం గణేషుడికి పూజలు చేయాలి. తెలుపు లేదా పసుపు రంగు లడ్డూలు సమర్పించాలి. పేదలకు పచ్చి పప్పును దానం చేయాలి. యువతులకు గాజులు, ఇతర అలంకరణ వస్తువులు దానం చేయాలి. పిల్లలకు సాయం చేయాలి. పశువులకు మేత తినిపించాలి.