Elinati shani: మకర రాశికి ఏలినాటి శని చివరి దశ.. రానున్న ఏడు నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకోండి-last phase of shani sade sati on capricorn know what results shanidev will give next 7 months ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Elinati Shani: మకర రాశికి ఏలినాటి శని చివరి దశ.. రానున్న ఏడు నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకోండి

Elinati shani: మకర రాశికి ఏలినాటి శని చివరి దశ.. రానున్న ఏడు నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Aug 08, 2024 11:15 AM IST

Elinati shani: మకర రాశి వారికి శని గ్రహం యొక్క మూడవ, చివరి దశ కొనసాగుతోంది. మకర రాశి వారికి సడే సతి సమయంలో శని ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకోండి. ఈ రాశి వారి జీవితం రానున్న ఏడు నెలలు ఎలా ఉంటుందో చూద్దాం.

మకర రాశి వారికి ఏలినాటి శని చివరి దశ
మకర రాశి వారికి ఏలినాటి శని చివరి దశ

Elinati shani: హిందూ మతంలో శని దేవుడిని న్యాయ దేవుడు, కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే దేవుడు అని పిలుస్తారు. మకర, కుంభ రాశులకు శని అధిపతి. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శని సంచారం వల్ల ఏర్పడే ఏలినాటి శని, అర్థాష్టమ శని సమయంలో ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది.

ప్రస్తుతం మకర, కుంభ, మీన రాశుల వారికి శని ఏలినాటి శని దశలు కొనసాగుతున్నాయి. దీన్ని సడే సతి అని కూడా పిలుస్తారు. శని గ్రహం సడే సతి మూడు దశలు ఉన్నాయి. ప్రస్తుతం మకర రాశి వారికి శనిదేవుని సడే శతి చివరి దశ కొనసాగుతోంది. 7 నెలల తర్వాత అంటే మార్చి 2025లో మకర రాశి వారు ఏలినాటి శని నుంచి విముక్తి పొందుతారు. సడే సతి చివరి దశలో శనిదేవుడు మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకోండి.

ఏలినాటి శని నుంచి ఎప్పుడు విముక్తి?

మార్చి 29, 2025న శని గ్రహం కుంభ రాశి నుండి బయటకు వెళ్లి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. శని మీన రాశిలోకి ప్రవేశించిన వెంటనే మకర రాశి వారికి శని సడే సతి ముగిసిపోతుంది. అందువల్ల రానున్న ఏడు నెలలు ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఎదురావుతాయో చూద్దాం.

ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే

ఏలినాటి శని చివరి దశ ప్రభావం శని గ్రహం పీడిత రాశివారి జీవితంలో సుఖాలు, సౌకర్యాలను తగ్గిస్తుంది. ఈ కాలంలో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. సడే సతి చివరి దశలో వ్యక్తి కోర్టు చుట్టూ తిరగాల్సి రావచ్చు. అందుకే అనవసరమైన చర్చలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

శని సడే సతి చివరి దశలో మిమ్మల్ని శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతుంది. జ్యోతిష్యుల ప్రకారం సడే సతి మూడవ దశ చివరకు వ్యక్తికి కొంత ఉపశమనం ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో మకర రాశి వ్యక్తులు కూడా గత ఏడు నెలల్లో ఊహించని విధంగా ధనలాభం పొందవచ్చు. విఫలమవుతున్న మీ పని విజయవంతం అవుతుంది. సౌకర్యాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి దూరమవుతుంది.

శని గ్రహం సడే సతి ప్రభావం

1. శని సడే సతిలో ఉన్నప్పుడు వ్యక్తి తన పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కాలంలో వ్యక్తి ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటాడు.

2. శని సడే సతి చివరి దశలో సంబంధాలలో కూడా విభేదాలు మొదలవుతాయి. చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారతాయి. కుటుంబంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది.

3. శని సడే సతి వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కాలంలో ఆర్థిక నష్టం కూడా సంభవించవచ్చు. లావాదేవీలు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.