Elinati shani: కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గేది ఎప్పుడు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Elinati shani: ప్రస్తుతం కుంభ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కొనసాగుతోంది. రెండో దశ నడుస్తోంది. దీని నుంచి ఉపశమనం కలిగేది ఎప్పుడు? శని అశుభ ప్రభావాలు తగ్గించుకునే మార్గాలు ఏంటో తెలుసుకుందాం.
Elinati shani: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సడే సతి ప్రభావం మంచి, చెడుగా రెండింటిగా పరిగణిస్తారు. శని ప్రభావం వ్యక్తి చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. శనీశ్వరుడి ప్రభావంతో వచ్చే వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు.
శని గ్రహం సడే సతి మూడు దశలు ఉంటాయి. దీన్ని ఏలినాటి శని అంటారు. ఒక్కో దశ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. అలా ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం శనీశ్వరుడి స్వంత రాశి అయిన కుంభ రాశి మీద రెండో దశ సడే సతి జరుగుతోంది.
కుంభ రాశి లక్షణాలు
కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత, అంతర్ దృష్టి, కళల లక్షణాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు సమాజంలోని వ్యక్తులను ఎక్కువగా ప్రభావితం చేస్తారు. వీళ్ళు జీవితంలో ప్రత్యేక విజయాలను నమోదు హేశతారు. వీరికి అతిపెద్ద బలహీనత సోమరితనం. ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు.
తెలివిగా, ధృడమైన వారిగా వ్యవహరిస్తారు. అయితే శని ప్రభావం వల్ల ఒక్కోసారి కఠినత్వం ప్రదర్శిస్తారు. కుంభ రాశి వాళ్ళు తమ ఇష్టానుసారం మాత్రమే నడుచుకుంటారు. వీరిలో ఉన్న ప్రతికూల అంశం ఏమిటంటే త్వరగా కోపగించుకుంటారు. తమ మనసులో భావాలని ఎదుటివారితో త్వరగా పంచుకోలేరు.
ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో ఉంది. దీని కారణంగా మకర, కుంభ, మీన రాశులలో శని సడే సతి కొనసాగుతోంది. కుంభ రాశి వ్యక్తులు 24 జనవరి 2020 నుండి శనిగ్రహం ఏలినాటి శని ప్రారంభమైనది. 3 జూన్ 2027న విముక్తి పొందుతారు. కానీ కుంభ రాశి వారు 2028 ఫిబ్రవరి 23న శని ప్రత్యక్షంగా మారినప్పుడు మాత్రమే శని మహాదశ నుండి పూర్తి ఉపశమనం పొందుతారు.
ఏలినాటి శని రెండవ దశ ప్రభావం
ఇది శని సడే సతి వల్ల కలిగే అత్యంత కష్టమైన సమయం. శని ఒక వ్యక్తికి అతని కర్మలను బట్టి ఫలితాలను అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో మంచి పనులు చేసేవారికి శుభ ఫలితాలు, చెడు పనులు చేసేవారికి అశుభ ఫలితాలు లభిస్తాయి. ఈ దశలో మీరు మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. దీంతో పాటు ఈ కాలంలో మీరు ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది.
ఈ రాశులపై అర్థాష్టమ శని ప్రభావం
శని వల్ల కలిగే అర్థాష్టమ శని ప్రభావం ఒక రాశి మీద రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు శని దయ్యా ప్రభావంలో ఉన్నారు.
ఏలినాటి అననుకూల ప్రభావం తగ్గించే చర్యలు
శని దేవాలయంలో నువ్వుల నూనె దానం చేయాలి. శనివారం ఉపవాసం చేయాలి. నల్ల మినపప్పు దానం చేయాలి. అలాగే శని ఆశీస్సులు పొందేందుకు నల్లని వస్త్రాలను దానం చేయడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. శనివారం సుందరకాండ, బజరంగబాన్ పఠించడం పారాయణం చేయడం శ్రేయస్కరం. ఆవులు, నల్ల కుక్కలు, కాకులకు రొట్టె తినిపించాలి. ఇలా చేయడం వల్ల శని దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.