తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 21, నేటి రాశి ఫలాలు.. స్త్రీలకు మానసిక, కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టును

ఏప్రిల్ 21, నేటి రాశి ఫలాలు.. స్త్రీలకు మానసిక, కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టును

HT Telugu Desk HT Telugu

21 April 2024, 0:01 IST

google News
  • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 21.04.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 21వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 21వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

ఏప్రిల్ 21వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 21.04.2024

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

ఇతరులు ఈర్ష పడేలా ఈ 3 రాశుల భవిష్యత్తు- ఇల్లు కొంటారు, డబ్బుకు లోటు ఉండదు!

Dec 21, 2024, 05:40 AM

బుధాదిత్య రాజయోగం: ఈ మూడు రాశుల వారికి మారనున్న అదృష్టం.. లాభాలు, సంతోషం దక్కనున్నాయి!

Dec 20, 2024, 02:27 PM

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం- భారీ ధన లాభం, జీవితంలో సక్సెస్​!

Dec 20, 2024, 06:01 AM

కొత్త సంవత్సరానికి ముందు బుధుడి నక్షత్ర సంచారంతో ఈ రాశులకు అదృష్టం

Dec 19, 2024, 01:51 PM

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2025లో లక్కే లక్కు.. ప్రేమలో గెలుపు, ఆర్థిక లాభాలు ఇలా ఎన్నో ఊహించని మార్పులు

Dec 19, 2024, 09:49 AM

వారం: ఆదివారం, తిథి : త్రయోదశి,

నక్షత్రం : ఉత్తరఫల్గుణి, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంతో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వాహనయోగమున్నది. ఉద్యోగాలలో అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారపరంగా వృద్ధి ఉండును. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థికపరంగా ఇబ్బంది కలిగించును. కొత్త రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. దైవదర్శనాలు చేస్తారు. ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు మరిన్ని చికాకులు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. స్త్రీలు కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించును. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థికపరంగా ఇబ్బంది కలిగించును. కొత్త రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. దైవదర్శనాలు చేస్తారు. ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు మరిన్ని చికాకులు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలో చికాకులు. కొన్ని పనులు ముందుకు సాగవు. అనారోగ్య సమస్యలు వేధించును. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. స్త్రీలకు కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబములో సమస్యలు తీరతాయి. సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆకస్మిక ప్రయాణాలుండును. ఇంటాబయటా ఒత్తిడులు. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడును. వ్యవహారాలలో చికాకులు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలం. స్త్రీలకు మానసిక ఆందోళన, అలసట, కుటుంబ సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో నూతన ఉత్సాహం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. వాహనయోగముంది. ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులకు ఆశాజనకం. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థిక ఇబ్బందులుండును. ఆకస్మిక ప్రయాణాలుండును. పనులు నిదానంగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో విభేదాలేర్పడును. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులుండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్నిపఠించడం, నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపార, ఉద్యోగాలో ఒత్తిడులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. వస్తు లాభాలుంటాయి. కొత్త వ్యక్తుల పరిచయం. దూరపు బంధువుల కలయిక. కుటుంబములో వివాదాలు సర్దుకుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలకు మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా ఖర్చులుంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలుంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమపడవలసిన సమయం. వ్యవహారాలు మందగిస్తాయి. దైవ చింతన. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాని సూచన. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగకాశాలు నిరాశపరుస్తాయి. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలను కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం