Surya Namaskar For Fat Reduce : ఎన్నిసార్లు సూర్య నమస్కారం చేస్తే బరువు తగ్గొచ్చు?
Surya Namaskar For Fat Reduce : ఈ కాలంలో బరువు తగ్గడం అనేది చాలా పెద్ద సమస్య. ఎంత ట్రై చేసినా.. అస్సలు తగ్గరు. కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఈజీగా బరువు తగ్గేయెుచ్చు. సూర్య నమస్కారం కూడా ఇందుకు ఉపయోగపడుతుంది.
బరువు నియంత్రణలో లేకుంటే.. అనేక వ్యాధులు వస్తాయి. బరువును నియంత్రించడంలో సూర్య నమస్కారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సూర్య నమస్కారం చేసే వారికే కాదు, సూర్య నమస్కారం చేయని వారికి కూడా సూర్య నమస్కారం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. కానీ కొంతమంది బద్ధకంతో చేయరు అంతే.
సూర్య నమస్కారం ఇష్టానుసారం చేయకూడదు. దానికి ఒక నియమం ఉంది. దానిని తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మీరు దాని ప్రయోజనాలను పొందగలరు. సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉన్నాయి. బరువు తగ్గడానికి సూర్య నమస్కారం ఎంత చేయాలో చూద్దాం. ఒక వ్యక్తి సాధారణంగా ఎన్ని సూర్య నమస్కారాలు చేయవచ్చో చూద్దాం.
సూర్య నమస్కారం కనిపించేంత సులభం కాదు. ప్రారంభంలో సూర్య నమస్కారం 2 రౌండ్లు చేయడం పెద్ద విషయం. మీరు సాధన చేయడం ద్వారా సూర్య నమస్కారం రౌండ్లను క్రమంగా పెంచుకోవచ్చు.
మీరు సూర్య నమస్కార్ చేసే ముందు మీ శరీరాన్ని కాస్త వేడెక్కించాలి. ఆపై సూర్య నమస్కారాన్ని ప్రారంభించండి. అంటే చిన్నపాటి వార్మప్ చేయండి. రోజూ 12 రౌండ్లు లేదా వీలైతే 21 రౌండ్లు సూర్య నమస్కారం చేయడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు. శరీరం కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది.
అయితే మీ శరీరం చెప్పినట్టుగా నడుచుకోవాలి. అంటే మీ శరీరాన్ని ఎక్కువగా శిక్షించకండి. మీరు త్వరగా బరువు తగ్గాలని అనుకుంటున్నారు కదా.. అని ఎక్కువ వ్యాయామం చేయవద్దు. సూర్య నమస్కారం కూడా క్రమం తప్పకుండా చేయాలి. మీ శరీరం ఎప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందో.. అప్పుడు శవాసనాలో విశ్రాంతి తీసుకోండి.
చాలా మంది యోగా నిపుణులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేస్తారు. కానీ దీన్ని చేయడానికి చాలా నైపుణ్యం కావాలి. దీన్ని చేయడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి. మీ పరిస్థితిని మీరు తెలుసుకోవాలి. సూర్య నమస్కారాలు చేస్తే.. మీ కొవ్వు కరిగిపోతుంది. శరీరంలోని నరాలను బలోపేతం చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సూర్య నమస్కారంతో మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.