ఏ రాశులవారు ఏ ఆలయాన్ని దర్శించడం వల్ల వారికి కలసివస్తుంది?
16 August 2023, 11:02 IST
- ఏ రాశులవారు ఏ ఆలయాన్ని దర్శించడం వల్ల వారికి కలసివస్తుంది? జ్యోతిష శాస్త్రం ఈవిషయంలో ఏం చెబుతోంది? ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు మీకోసం.
ఆది పూజలు అందుకునే గణనాథుడు
మానవుడు తమయొక్క జీవితములో ఎదురయ్యే కష్టాలను తొలగించుకోవడానికి, ధర్మబద్ధమైనటువంటి కోరికలను నెరవేర్చుకోవడానికి భగవంతుడిని ఆరాధిస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందడానికి, భగవత్ ఆరాధనకు భక్తి మార్గానికి, మోక్షసాధనకు, మోక్ష మార్గానికి ఇలా అనేక అంశాలకు భగవంతుణ్ణి పూజించడం, ఆరాధించడం వంటివి చేస్తుంటారు. మన సనాతన ధర్మంలో ఏ రూపంలో అయినా భగవంతుణ్ణి ఆరాధించవచ్చు.
లేటెస్ట్ ఫోటోలు
శివకేశవులనేటువంటి భేదములు లేకుండా భగవత్ ఆరాధన, సరస్వతి, లక్ష్మీ పార్వతీ అనే భేదము లేకుండా శక్తి ఆరాధన మానవులు ఆచరించాలి. అయితే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఏ రాశివారు అయినా వారు నచ్చిన విధముగా దేవతారాధన చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆ రాశి అధిపతుల దృష్టా కొన్ని ప్రత్యేక దేవతా పూజలు ఆ రాశి వారు చేసినట్లయితే వారికి త్వరగా అనుకున్న కోరికలు నెరవేరి ఫలితాలు కలిగే అవకాశాలున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఏ రాశుల వారు ఏ దైవాన్ని పూజించాలి
మేషరాశి
మేషరాశికి అధిపతి కుజుడు. ఈరాశి వారు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం, దుర్గాదేవిని పూజించడం వల్ల వీరికి అన్నివిధాలా కలసివస్తుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యుణ్ణి, శనివారం దుర్గా దేవిని పూజించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరించారు.
వృషభ రాశి
వృషభరాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవము శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని పూజించడం, కృష్ణాష్టకం వంటివి చదువుకోవడం, మహాభారతం, భగవద్దీత వంటివి చదవడం వల్ల వృషభ రాశి వారు అన్ని విధాల కలసివస్తుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మిథునం
మిథున రాశికి అధిపతి బుధుడు. ఈరాశివారు ఆరాధించవలసిన దైవము శ్రీ మహావిష్ణువు. ఈరాశివారు బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయిని చిలకమర్తి తెలిపారు.
కర్కాటకం
కర్మాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈరాశి వారు ఆరాధించవలసిన దైవము శివుడు. శివారాధన, శివునికి అభిషేకం వంటివి చేసుకోవడం వలన వారి కోరికలు నెరవేరుతాయని చిలకమర్తి తెలిపారు.
సింహరాశి
సింహరాశికి అధిపతి రవి. ఈరాశి వారు సూర్యారాధన చేయడం మంచింది. ఆదివారం సూఆర్యాష్టకం ఆదిత్య హృదయం వంటివి చదువుకోవడం వలన వారి కోరికలు నెరవేరుతాయని చిలకమర్తి వివరించారు.
కన్యారాశి
కన్యారాశికి అధిపతి బుధుడు. ఈరాశివారు ఆరాధించవలసిన దైవము శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈరాశివారు వెంకటేశ్వర స్వామి, రామచంద్రమూర్తి, లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
తులారాశి
తులారాశికి అధిపతి శుక్రుడు. ఈరాశి వారు ఆరాధించవలసిన దైవము లక్ష్మీదేవి. తులారాశి వారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం ఆరాధించడం వల్ల వారికి ధనపరమైనటువంటి కష్టాలు తొలగుతాయని చిలకమర్తి తెలిపారు.
వృళ్చికరాశి
వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈరాశి వారు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం, దుర్గాదేవిని పూజించడం వల్ల వీరికి అన్ని విధాల కలసివస్తుందని చిలకమర్తి తెలిపారు. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని ప్రత్యేకంగా పూజించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని చిలకమర్తి వివరించారు.
ధనూరాశి
ధనూరాశికి అధిపతి గురుడు. ఈరాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఈరాశివారు గురువారం రోజు దత్తాత్రేయుని పూజించి శనగలను ప్రసాదంగా చేసి పంచిపెట్టడం వలన వారి కోరికలు నెరవేరుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మకర రాశి
మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవం వేంకటేశ్వరస్వామి. నవగ్రహాలలో శనిని పూజించడం శనివారం రోజు దక్షిణామూర్తిని, వేంకటేశ్వరుని ఆరాదించడం వలన సకల శుభాలు కలుగుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కుంభరాశి
కుంభరాశికి అధిపతి శని. ఈ రాశి వారు ఆరాధించవలసిన దైవం ఆంజనేయస్వామి. కుంభరాశివారు శనివారం రోజు ఆంజనేయ స్వామిని పూజించాలి. అలాగే శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం వలన కోరికలు నెరవేరుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మీనరాశి
మీనరాశికి అధిపతి బృహస్పతి. ఈరాశివారు దక్షిణామూర్తిని పూజించడం, ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఈ రాశి వారు గురువారం గురు దక్షిణామూర్తిని పూజించడం ఆరోజు శనగలను ప్రసాదంగాచేసి పంచిపెట్టడం వలన వారి కోరికలు నెరవేరుతాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.