Navratri 2024 Dates: నవరాత్రుల మొదటి రోజు ఎప్పుడు? ముహూర్తం, పూజా విధానం వివరాలివిగో
Updated Sep 26, 2024 06:25 AM IST
Dussehra 2024: నవరాత్రులలో చాలా మంది భక్తులు కలశం లేదా ఘట స్థాపన చేయడం ద్వారా 9 రోజులు ఉపవాసం ఉంటారు. నవరాత్రుల మొదటి రోజు ఎప్పుడు? కలశ లేదా ఘట స్థాపనకు మంచి సమయంఎప్పుడో ఇక్కడ తెలుసుకుందాం.
నవరాత్రులు 2024
Shardiya Navratri 2024 Dates: హిందూ మతంలో నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు. అనేక మంది భక్తులు కలశం లేదా ఘట స్థాపన చేయడం ద్వారా 9 రోజుల పాటు ఉపవాసం ఉంటారు.
లేటెస్ట్ ఫోటోలు
అక్టోబర్ 14 రాశి ఫలాలు.. ఏ రాశి వారికి అనుకూలం, ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి!
3 యోగాలు- ఈ 5 రాశులకు మారనున్న తలరాత- ఘనంగా లాభాలు, ప్రమోషన్స్, ఉద్యోగ బదిలీ- విదేశీ ప్రయాణం, సంతోషమయ జీవితం!
అక్టోబర్ 11 రాశి ఫలాలు.. అన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు.. కొత్త అవకాశాలు, ఆత్మవిశ్వాసంతో ముందడుగు
అక్టోబర్ 10 రాశి ఫలాలు.. ఈ ఒక్క రాశి వారికే కాస్త అదృష్టం.. మిగిలిన రాశుల వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అక్టోబర్ 9 రాశి ఫలాలు.. ఈ ఏడు రాశులకు అదృష్ట కలిసి వచ్చే రోజు.. ప్రతి పనిలో విజయం, వ్యాపారాల్లో లాభాలు
అక్టోబర్ 8 రాశి ఫలాలు.. ఈ ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు.. ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో చూడండి
నవరాత్రుల చివరి రోజున కన్యా పూజ చేయడం ద్వారా ఉపవాసం ముగుస్తుంది. నవరాత్రుల తేదీలు, మొదటి రోజు పూజా సమయం ఎప్పుడు? కలశ స్థాపన లేదా ఘట స్థాపనకు శుభ సమయం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
నవరాత్రుల మొదటి రోజు ఎప్పుడు
హిందూ పంచాంగం ప్రకారం పితృ పక్షం అయిపోయిన తర్వాత రోజు (అక్టోబర్ 3 నుంచి) నుంచి నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3న ప్రారంభమవుతాయి. నవరాత్రులు ఈ ఏడాది 03 అక్టోబర్ నుంచి ప్రారంభమై 11 అక్టోబర్‌న ముగుస్తాయి. మరుసటి రోజు అంటే అక్టోబరు 12న దసరా పండగ.
కలశ స్థాపన లేదా ఘట స్థాపనకి మంచి సమయం
ఆచార్య గోవింద్ శరణ్ పురోహిత్ ప్రకారం, అక్టోబర్ 3న శారదీయ నవరాత్రి ప్రతిపాద నాడు కలశం ప్రతిష్ఠాపనకు సమయం ఉదయం 06.07 నుంచి 09.30 వరకు మంచిది. ఆ తరువాత అభిజిత్ ముహూర్తం రోజు 11.37 నుంచి 12.23 గంటల వరకు చాలా పవిత్రంగా ఉంటుంది.
నవరాత్రులలో మొదటి రోజున శైలపుత్రి దేవిగా అమ్మవారిని పూజిస్తారు. ఆ రోజు శైలపుత్రి మాత ఘట స్థాపన లేదా కలశ స్థాపన చేసిన తరువాత ధ్యానం చేస్తారు. ఘటస్థాపన నవరాత్రి ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది ఒకరకంగా చెప్పాలంటే శక్తి దేవిని ఆవాహన చేసే ఆచారం.
దుర్గామాత పూజ విధి
1- ఆలయాన్ని శుభ్రపరచండి
2- దుర్గామాతకు జలాభిషేకం చేయండి
3- పంచామృతంతో సహా గంగా నీటితో దుర్గామాతకు అభిషేకం
చేయండి
4- అమ్మవారికి ఎర్రచందనం, కుంకుమ, అలంకరణ వస్తువులతో పాటు పువ్వులను సమర్పించండి
5- ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి
6- దుర్గామాతకు పూర్తి భక్తితో హారతి ఇవ్వండి
7- చివరగా తల్లిని క్షమించమని ప్రార్థించండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
