Baby Girl Unique Names : మీ పాప నవరాత్రి సమయంలో జన్మించిందా? దుర్గామాత పేర్లు, అర్థాలు
Baby Girl Names and Meanings : దేశవ్యాప్తంగా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో కొంతమంది తమ ఆడబిడ్డకు దుర్గామాత పేరు పెట్టాలని కూడా అనుకుంటారు. వారి కోసం అమ్మవారి కొన్ని పేర్లు, వాటి అర్థాలు ఉన్నాయి.
దుర్గా దేవిని ప్రపంచానికి తల్లి అని పిలుస్తారు. మీ కుమార్తె నవరాత్రి సందర్భంగా జన్మించినట్లయితే, ఆమె కోసం అనేక పేర్లు ఉన్నాయి. దుర్గామాత పేరుపై వచ్చేలా పెట్టుకోవచ్చు. ఈ రోజు అమ్మవారి కొన్ని అందమైన పేర్లను తెలుసుకుందాం. ఈ అమ్మాయిల పేర్ల జాబితా నుండి మీ కుమార్తె కోసం నచ్చిన పేరును ఎంచుకోవచ్చు.
అర్షియా : మీరు మీ అందమైన బిడ్డకు అర్షియా అని పేరు పెట్టవచ్చు. ఈ పేరు చాలా ఆధునికమైనది, దీని అర్థం దేవతల భూమి.
ఏకాంక్ష : ఈ పేరు 'A' అక్షరంతో మొదలవుతుంది. దుర్గా మాత పేర్లలో ఏకాంక్ష అనే పేరు విభజించబడనిది అని అర్థం.
దిత్య : ఈ పేరు అర్థం ప్రార్థన, చాలా మనోహరమైనది. పిలిచేందుకు కొత్తగా ఉంటుంది.
ఇషాని : దుర్గామాత యొక్క ఈ పేరుకు పాలకులు అని అర్థం.
ప్రకృతి : భగవద్గీత ప్రకారం, ప్రకృతి దుర్గా దేవికి మరొక రూపం. ప్రకృతితోనే మొత్తం విశ్వం సృష్టించబడిందని నమ్ముతారు. పిలిచేందుకు కూడా బాగుంటుంది.
సాత్విక : మీ కూతురి పేరు 'S' అక్షరంతో ప్రారంభం కావాలనుకుంటే.. ఆమెకు సాత్విక అని పేరు పెట్టవచ్చు. సాత్విక అనే పేరుకు స్వచ్ఛమైనది, సహజమైనది అని అర్థం. దీనికి ఉత్సాహం, శక్తివంతం అని కూడా అర్థం వస్తుంది.
స్తుతి : ఇది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పేరు. పూజ అని అర్థం. ఇది దుర్గా దేవిని సూచించడానికి కూడా ఉపయోగిస్తారు.
శూలిని : దుర్గామాత 108 పేర్లలో శూలిని కూడా ఒకటి. అంటే ఆప్యాయత అని.
శాండలి : పార్వతీ దేవి యొక్క అనేక పేర్లలో శాండలి కూడా ఒకటి.
ఉర్వి : భూమి తల్లి అనగా పృథ్వీని ఉర్వి అని పిలుస్తారు. తల్లి లక్ష్మిని ఉర్వి అనే పేరుతో కూడా పిలుస్తారు.
విశాలాక్షి : విశాలాక్షి అంటే పెద్ద, అందమైన కళ్ళు ఉన్న స్త్రీ అని అర్థం. ఇది అమ్మవారి పేరు.
వామిక : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల కూతురు పేరు కూడా వామిక. ఈ స్టార్ కపుల్ తమ కూతురికి దుర్గా మాత పేరు వచ్చేలా ఆ పేరును ఎంచుకున్నారు.
వాగ్ధాటి : వాగ్ధాటి అనే పేరు కూడా కొత్తగా ఉంటుంది. ప్రపంచాన్ని నియంత్రించే శక్తి వాగ్ధాటికి ఉంది.