తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rishi Panchami: రేపే రుషి పంచమి- వ్రత కథ ఏంటి? ఈ వ్ర‌తం ఎలా ఆచ‌రించాలి?

Rishi panchami: రేపే రుషి పంచమి- వ్రత కథ ఏంటి? ఈ వ్ర‌తం ఎలా ఆచ‌రించాలి?

HT Telugu Desk HT Telugu

07 September 2024, 17:41 IST

google News
    • Rishi panchami: సెప్టెంబర్ 8 తేదీన రుషి పంచమి వచ్చింది. ఈ వ్రతం ఎలా ఆచరించాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ వ్రత కథ ఏంటి అనే దాని గురించి అధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 
రుషి పంచమి
రుషి పంచమి

రుషి పంచమి

Rishi panchami: సెప్టెంబర్ 8 తేదీన రుషి పంచమి వచ్చింది. హైంద‌వ సంస్కృతిలో రుషి పంచ‌మికి ఎంతో విశిష్ట‌త ఉంద‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్ర‌హ్మ‌శ్రీ చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు. రుషి పంచమి పర్వదినాన ప్రాతఃకాలంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీతీరానికి వెళ్లి అక్కడి మట్టిని తీసుకుని శరీరానికి రాసుకుని, గోమయం, గోమూత్రంతో శరీరాన్ని శుభ్రపరచుకోవాల‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

పార్లమెంట్​ ఉన్నది కొట్టుకోవడానికే! కిందపడేసి కొట్టి, చంప చెళ్లుమనిపించి..

Dec 21, 2024, 01:04 PM

అనంతరం నదీస్నాన మొనరించి ఆ నదీజలాన్ని తీర్థంగా తీసుకోవాలి. స్నానానంతరం సూర్యునికి నమస్కరించి నదీజలాన్ని దోసిళ్ళతో తీసుకొని అర్ఘ్యమివ్వాలి. అనంతరం ఇంటికి చేరుకున్న తర్వాత వ్రతానికి సంబంధించిన పూజాగృహాన్ని, ఇంటిని గోమయంతో శుభ్రం చేసి మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గడపలకు పసుపురాసి, కుంకుమ పెట్టి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పూజా అనంతరం “మమ రుతుసంపర్క జనిత దోష పరిహారార్థం అరుంధతీ సహిత కశ్యపాం రుషి ప్రీత్యర్థం రుషిపూజన కరిష్యే" అని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతిని, నవగ్రహాలను పూజించాలి.

సప్త రుషులను అర్చించి, పంచామృతం, బియ్యం, గంధం, కుంకుమ, పూలు, ఆకువక్కలుతో ప్రసాదం సమర్పించి, హారతిని ఇవ్వాల‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. వేదవిదులకు వాయనమిచ్చి పూజించాలి. పంచమి తిథి మధ్యాహ్నం ఉన్న రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం. వరుసగా ఏడు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉద్యాపన చేయాలి.

రుషి పంచమి కథ

పూర్వకాలంలో విదర్భ దేశంలో ఉత్తంకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కుమార్తెకు జన్మాంతర పాపం చేత సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. మంటపానికి మామిడాకులు కట్టి వివాహమైన కొంత కాలానికే భర్త చనిపోగా తండ్రి వద్దనే ఉండేది. తండ్రి వేదపారంగతుడవడం వల్ల ఎందరో శిష్యులు ఉండేవారు. ఒకనాడు ఉత్తంకుడు తన కుమార్తె శరీరం నుండి పురుగులు రాలి పడటాన్ని చూశాడు. దివ్యదృష్టితో పరిశీలించగా ఆమె గత జన్మలో రుతుక్రమంలో ఉన్న సమయంలో వంట ఇంటిలోకి ప్రవేశించి పాత్రలను తాకడం వల్లనూ, రజస్వలా నియమాలను పాటించకపోవడమూ చేసేది.

ఒకప్పుడు ఆమె మంటపంలో కొత్త వస్త్రాన్ని పరచి, దానిపై బియ్యం పోసి రాగితో కాని, వెండితో కాని చేసిన కలశాన్ని పెట్టుకొని అందులో నీటిని, పంచ పల్లవాలను ఉంచాలి. చేతిలో తమలపాకులు ఉంచుకొని ఆ కలశంపై కుడిచేతిని వెనుకకు తప్పి ఉంచి “కలసశ్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితా..." అనే శ్లోకాన్ని చదువుతూ తమలపాకులతో కలశంలోని నీటిని అటూ ఇటూ తిప్పుతూ జలాన్ని పూజాద్రవ్యాలపై చల్లి, తరువాత శిరస్సుపై చల్లుకోవాలి.

చెలికత్తెలు రుషిపంచమి వ్రతాన్ని చేస్తుంటే చూసి ఎగతాళి చేసింది. కానీ ఆ వ్రతాన్ని చూసినందువల్ల ఈ జన్మలో ఉత్తమమైన కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి తన కుమార్తె చేసిన దోష పరిహారార్థం రుషిపంచమి వ్రతాన్ని ఆచరింపజేసి, పాప విముక్తిని కలిగింప జేసి, ఆమె సంపూర్ణ ఆరోగ్యం పొందే విధంగా చేశాడు. ఈ వ్రతాన్ని కేవలం స్త్రీలే కాకుండా పురుషులు, నాలుగు వర్ణాల వారూ చేయవచ్చు.

మానవ జీవన మార్గానికి దశను, దిశను నిర్దేశించిన మహర్షులను స్మరించడం మన బాధ్యత. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇలా మనం ఒక తత్వమార్గంలో పయనించడానికి మూలపురుషులు ఆ మహాజ్ఞానులే. అందుకే వారిని స్మరించి, దివ్యమార్గం వైపు పయనించి తరిద్దామ‌ని ఆధ్యాత్మిక వేత్త బ్ర‌హ్మ‌శ్రీ చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం