తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మీన రాశిలో రాహువు సంచారం.. 3 రాశులకు అపార గౌరవం, సంపద

మీన రాశిలో రాహువు సంచారం.. 3 రాశులకు అపార గౌరవం, సంపద

HT Telugu Desk HT Telugu

06 June 2023, 11:44 IST

    • మీన రాశిలో రాహువు సంచారం వల్ల 3 రాశులకు అపార గౌరవం, సంపద లభిస్తాయని వైదిక జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది.
మీన రాశిలో రాహువు సంచారం వల్ల 3 రాశులకు మంచి రోజులు
మీన రాశిలో రాహువు సంచారం వల్ల 3 రాశులకు మంచి రోజులు

మీన రాశిలో రాహువు సంచారం వల్ల 3 రాశులకు మంచి రోజులు

రాహు సంచారం అనేక రాశులకు శుభాన్ని కలిగిస్తుంది. రాహు రాశి మార్పు వల్ల ముఖ్యంగా మూడు రాశులకు గణనీయమైన సానుకూల ఫలితాలు లభించనున్నాయి.

లేటెస్ట్ ఫోటోలు

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం

May 03, 2024, 04:29 PM

Ego Rasis: ఈ రాశుల వారికి కాస్త ఇగో ఎక్కువే.. ఎవరి మాట వినరండోయ్

May 03, 2024, 03:37 PM

Mercury : బుధుడి కారణంగా ఈ రాశులవారికి మంచి జరగనుంది

May 03, 2024, 03:30 PM

రాహువు అక్టోబరు 30, 2023న మధ్యాహ్నం 2.13 గంటలకు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. 12 రాశుల్లో మూడు రాశులకు ఈ గ్రహ సంచారం ప్రయోజనం కలిగించనుంది. మీనంలో రాహు సంచారం వల్ల ప్రకాశించే ఆ మూడు రాశుల జాతకుల గురించి ఇక్కడ తెలుసుకోండి.

మేష రాశిపై రాహు గ్రహ సంచార ప్రభావం

రాహు గ్రహ సంచారం మేషరాశికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో ఈ రాశి జాతకుల సంపద పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మేష రాశి జాతకులు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. మీరు వ్యాపారం చేస్తే ఈ సమయం ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. వృత్తిలో పురోభివృద్ధికి అవకాశం ఉంది. సామాజిక గౌరవం పెరగుతుంది.

కర్కాటక రాశిపై రాహు సంచార ఫలం

రాహు గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి అసాధారణ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు మీ కలల ప్రాజెక్టు పొందే అవకాశం ఉంది. ఇంతేకాకుండా మీకు మీ పని ప్రదేశంలో కొత్త పనులు లభిస్తాయి. ఈ సమయం మీ జీవితంలోని అనేక అంశాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా మంచి కాలం. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓర్పుతో పనిచేయాలి. హడావుడిగా పనిచేస్తే అదృష్టం కలిసిరాదు. రాహువు సంచారం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

మీన రాశిపై రాహు సంచార ప్రభావం

అక్టోబరులో రాహు సంచారం మీన రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశిలో రాహువు ప్రవేశించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు అనేక మార్గాల నుంచి డబ్బును పొందుతారు. డబ్బు ఆదా చేస్తారు. జీవితం సంతోషంగా సాగుతుంది. కెరీర్ పరంగా ఉన్నత స్థానాల్లోకి వెళతారు. వేతనాలు పెరుగుతాయి.