Saturn transit: రానున్న 10 నెలలు ఈ రాశుల జాతకులకు కష్టాలు ఇవ్వబోతున్న శని
23 March 2024, 8:14 IST
- Saturn transit: శని ఈ ఏడాది మొత్తం కుంభ రాశిలోనే సంచరిస్తాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన రోజులు ఉంటే మరికొన్ని రాశుల జాతకులకు మాత్రం కష్టాలు ఇవ్వబోతున్నాడు.
శని వల్ల కష్టాలు పడబోతున్న రాశులు ఇవే
Saturn transit: నవగ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలి గ్రహాలలో శని ఒకటి. అందుకే ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. 30 ఏళ్ల తర్వాత శని తన స్వగృహమైన కుంభరాశిలో సంచరిస్తున్నాడు.
శని కర్మల అనుసాసరం ఫలితాలను ఇస్తాడు. మంచి చేయడం వల్ల రెట్టింపు ఆనందాన్ని ఇస్తే, చెడ్డ పనులు చేస్తే కష్టాలు సమస్యలు ఇస్తాడు. అందుకే అందరూ శని న్యాయదేవుడు అంటారు. ప్రస్తుతం ఈ ఏడాది మొత్తం కుంభ రాశిలోనే శని తన కదలికలు మార్చుకుంటూ సంచరిస్తాడు. రానున్న పది నెలలు శని వక్ర కన్ను ఈ రాశుల మీద ఉండనుంది. ఫలితంగా ఆయా రాశులు వాళ్ళు కష్టాలు, సమస్యలు, దుఃఖాలతో జీవితాన్ని అనుభవిస్తారు. శని తీవ్రమైన దృష్టి పది నెలల పాటు ఈ రాశులపై నిరంతరం ఉంటుంది.
కర్కాటక రాశి
శని వక్ర కన్ను కారణంగా కర్కాటక రాశి జాతకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. జీవితంలో అనేక రకాల సమస్యలు ఇబ్బందులు మీ మనసుని ఆందోళనకు గురిచేస్తాయి. రానున్న పది నెలలు ప్రతి పని జాగ్రత్తగా, ఆచితూచి చేయాలి.
వృశ్చిక రాశి
శని భగవానుడు వృశ్చిక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇవ్వనున్నాడు. కుటుంబ జీవితం తగాదాలతో, సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఈ రాశి వారిపై అర్థాష్టమ శని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార పరిశ్రమలలో కొంత సౌకర్య పరిస్థితి ఏర్పడుతుంది.
మకర రాశి
మకర రాశికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు. అయినప్పటికీ ఈ రాశి వారి మీద ఏలినాటి శని చివరి దశ ప్రభావం ఉంటుంది. అది మాత్రమే కాకుండా శనీశ్వరుడి తీక్షణమైన చూపులు ఈ రాశి వారిపై ఉంటాయి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలు రావచ్చు. పెండింగ్లో ఉన్న ఉద్యోగాలకు మరికొన్ని సమస్యలు వచ్చి చేరతాయి. కష్టపడితేనే మంచి ఫలితాలు లభిస్తాయి.
కుంభ రాశి
ప్రస్తుతం శని సంచారం కుంభ రాశిలోనే జరుగుతుంది. ఈ ఏడాది మొత్తం ఈ రాశిలోనే సంచరించడం వల్ల వీరికి అనేక ఇబ్బందులు కలుగుతాయి. వివాదాలు చుట్టుముడతాయి. ఎవరితోనైనా మాట్లాడటంలో సమస్యలు ఉంటే వారికి దూరంగా ఉండటమే మంచిది. ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సహ ఉద్యోగులు మీకు ప్రతికూల పరిస్థితులను కలిగిస్తారు. ఉద్యోగం చేసే కార్యాలయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం.
కుంభం, మకరం, మీన రాశిపై ఈ ఏడాది ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అదే సమయంలో వృశ్చికం, కర్కాటక రాశుల వారిపై అర్థాష్టమ శని ఉంటుంది. అందువల్ల రాబోయే 10 నెలల పాటు ఈ ఐదు రాశులను శని ఇబ్బంది పెడుతుంది. జీవితంలో సమస్యలు రావచ్చు. వృత్తి, ఆర్థిక, ప్రేమ జీవితం ఒడిదుడుకులకు దారి తీస్తుంది. కొన్ని పరిహారాల సహాయంతో శని దేవుడు ప్రభావాలను తగ్గించుకోవచ్చు.
శని సడే సతి, దయ్యా ప్రభావాలు తగ్గించుకోవడం కోసం శనివారం నువ్వులు దానం చేయాలి. హనుమంతుడిని, శివుడిని ఆరాధించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. శనీశ్వరుడికి చెందిన మంత్రాలు 108 సార్లు జపించాలి. అలాగే నల్ల పప్పు, ఆవనూనె, నల్లని వస్త్రాలు దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది.