Saturn transit: శని సంచారం.. ఈ నాలుగు రాశుల వారికి గడ్డు కాలం నడుస్తుంది
Saturn transit: శని ఈ ఏడాది మొత్తం కుంభ రాశిలోనే సంచరిస్తాడు. మరో రెండు రోజుల్లో శని అస్తంగత్వ దశ నుంచి ఉదయించబోతున్నాడు . ఫలితంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులు రాబోతున్నాయి.
Saturn transit: జ్యోతిష్య శాస్త్రంలో శని క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి కర్మ ఫలాలు ప్రకారం ఫలితాలు అందిస్తాడని నమ్ముతారు. అయితే శని ఎల్లప్పుడూ దురదృష్టమే తీసుకురాడు. ఆయన అనుగ్రహం పొందిన వారు తరచుగా అదృష్టాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం శని తన సొంతరాశి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రయాణం చేసేందుకు సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. 2025 వరకు కుంభ రాశిలోనే శని కదలికలు మార్చుకుంటూ ఉంటాడు. అస్తంగత్వ దశలో ఉన్న శని గ్రహం మరో రెండు రోజుల్లో ఉదయించబోతుంది. మార్చి 18న శని ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు పెరుగుతాయి. శని గ్రహ సంచారం వల్ల రాబోయే రోజుల్లో రాశుల వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటారో చూద్దాం.
వృశ్చిక రాశి
శని సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. ఫలితంగా ఈ రాశి జాతకులు తల్లిదండ్రులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబాల్లో కలహాలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి దారి తీయవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ మీ సమస్యలును అధిగమించడం కష్టంగా మారుతుంది. ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం.
కర్కాటక రాశి
శని సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా గణనీయమైన నష్టాలు చవిచూస్తారు.
మీన రాశి
మీన రాశి వారి మీద శని సంచారం గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యయాల పెరుగుదలను చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ కాలంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్థిక వ్యవహారాలను తెలివిగా వ్యవహరించడం చాలా కీలకం. జీవితంలో అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా కెరీర్ ఎదుగుదల నెమ్మదిస్తుంది. విజయం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. ఒంటరితనంగా ఫీల్ అవుతారు. శని మకర రాశి సొంత రాశి అయినప్పటికీ చెడు ప్రభావాలు కూడా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెడతాయి.
శని అనుగ్రహం పొందేందుకు పరిహారాలు
కుంభ రాశిలో శని ఉదయించడం వల్ల ఏర్పడిన ప్రభావాల నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి. ఫలితంగా మీకు శని ప్రభావం తగ్గుతుంది. శివుడిని, హనుమంతుడిని ఆరాధించాలి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది.
పేదలకు నలుపు లేదా బూడిద రంగు దుస్తులు దానం చేయండి. శనివారం నాడు శని దేవాలయాన్ని సందర్శించి ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. పేదవారికి బూట్లు దానం చేయండి. శని బీజ్ మంత్రాన్ని పఠించాలి. నల్ల పప్పు, వస్త్రాలు దానం చేయాలి. శనివారం రావి, శమీ చెట్టును కూడా పూజించాలి. ఈ చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించడం వల్ల శని అనుగ్రహం పొందుతారు.