తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేడు బుధ గ్రహ సంచారం.. ఈ 5 రాశులకు కెరీర్ బాగుంటుంది

నేడు బుధ గ్రహ సంచారం.. ఈ 5 రాశులకు కెరీర్ బాగుంటుంది

HT Telugu Desk HT Telugu

07 June 2023, 6:19 IST

    • నేడు బుధ గ్రహ సంచారం చోటు చేసుకోనుంది. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పరిణామం పలు రాశులపై సానుకూల ప్రభావం తేనుంది.
వృషభంలోకి బుధ గ్రహ సంచార ఫలితంగా 5 రాశులకు ప్రయోజనం
వృషభంలోకి బుధ గ్రహ సంచార ఫలితంగా 5 రాశులకు ప్రయోజనం

వృషభంలోకి బుధ గ్రహ సంచార ఫలితంగా 5 రాశులకు ప్రయోజనం

బుధుడు వ్యాపారం, తెలివితేటలు, వాక్కు, తర్కం, ఆలోచనలకు కారకుడు. సూర్యుడికి అతిదగ్గరగా ఉండే గ్రహాల్లో బుధుడు ఒకరు. సుమారు 25 రోజులకోసారి రాశి సంచారం చేస్తాడు. అంటే సంవత్సరంలో 12 రాశులను చుట్టి వస్తాడు. ఈరోజు జూన్ 7న రాత్రి 7.40 గంటలకు వృషభ రాశిలోకి సంచరిస్తాడు. శుక్రుడు అధిపతిగా ఉన్న వృషభ రాశిలోకి సంచరించడం వల్ల 4 రాశులపై సానుకూల ప్రభావం పడనుంది. ఆయా రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Malavya Rajyog 2024: మాలవ్య రాజయోగం: ఈ రాశుల వారికి అదృష్టం! ఆర్థిక లాభాలతో పాటు మరిన్ని ప్రయోజనాలు

May 06, 2024, 04:49 PM

ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు! ఆర్థికంగా ఇబ్బందులు- జీవితంలో ఒడుదొడుకులు..

May 06, 2024, 09:45 AM

Saturn Retrograde : శని తిరోగమనం.. వీరికి జీతాల్లో పెంపు, అన్నీ శుభవార్తలే

May 06, 2024, 08:32 AM

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

May 05, 2024, 04:07 PM

Bad Luck Rasi : ఈ రాశులవారికి కష్టకాలం, ధన నష్టం జరిగే అవకాశం.. జాగ్రత్త

May 05, 2024, 08:38 AM

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

బుధ సంచార ప్రభావం వృషభ రాశిపై ఇలా

బుధుడు వృషభ రాశిలోకి ఈరోజు రాత్రి సంచరించనున్నాడు. ఈ రాశిలో బుధుడు రెండవ, ఐదవ ఇంటిని పాలిస్తాడు. ఇప్పుడు ఒకటో ఇంట్లో సంచరించనున్నాడు. ఈ సంచారం వల్ల వృషభ రాశి జాతకులు వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు. కొత్తగా ఉద్యోగావకాశాలు పొందుతారు. కెరీర్ బాగుంటుంది. విదేశీ విద్యాఉద్యోగావకాశాలు లభించవచ్చు. ఆర్థికంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. డబ్బులు పొదుపు చేసుకుంటారు.

సింహ రాశిపై బుధ సంచార ప్రభావం

బుధుడు సింహ రాశిలో రెండో ఇల్లు, పదకొండో ఇంటికి అధిపతి. 10వ ఇంట్లోకి సంచరించనున్నాడు. ఈ గ్రహ సంచారం వల్ల కమ్యూనికేషన్, ఐటీ రంగంలో పనిచేసే వారికి శుభప్రదం. మీ పని మీరు చేసుకుంటూ పోతారు. ఫలితాలు సాధిస్తారు. ప్రాజెక్టులన్నీ సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారులు వ్యూహాలు మార్చుకుని లాభాలు సాధిస్తారు.

కన్యా రాశిపై బుధ గ్రహ సంచార ప్రభావం

కన్యా రాశి జాతకులకు బుధుడు ఒకటవ ఇంటికి అధిపతి. ప్రస్తుతం 10వ ఇంటికి ప్రవేశిస్తాడు. తాజా గ్రహ సంచారం పరిణామం వల్ల కన్యా రాశి జాతకులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. పని చేసే చోట ఎలాంటి ఇక్కట్లు లేకుండా సమయానుసారం మీ లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారులు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులకు అవకాశాలు లభిస్తాయి. కన్యా రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది.

మకర రాశిపై బుధ గ్రహ సంచార ఫలితం

మకర రాశి వారికి కెరీర్ పరంగా మంచి రోజులు వచ్చినట్టే. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, వేతన పెంపు ఉంటుంది. వ్యాపారులు కొత్త వ్యాపారల్లో పెట్టుబడులు పెడుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూల కాలం.

బుధుడి ఆశీస్సుల కోసం ఇలా చేయాలి

బుధ గ్రహ ఆశీస్సులు లభించడానికి వినాయకుడిని పూజించాలి. బుధ గ్రహానికి హోమం చేయాలి. రోజూ ఆవులకు ఆహారం ఇవ్వాలి. పక్షులకు నానబెట్టిన పచ్చి శనగలను ఆహారంగా ఇవ్వాలి.