ఈ 6 వాస్తు సూత్రాలతో మీ పొదుపు పైపైకే-your savings will skyrocket with these 6 vastu sutras ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Your Savings Will Skyrocket With These 6 Vastu Sutras

ఈ 6 వాస్తు సూత్రాలతో మీ పొదుపు పైపైకే

HT Telugu Desk HT Telugu
Jun 06, 2023 04:54 PM IST

ఈ 6 వాస్తు సూత్రాలతో మీ సంపద, పొదుపు ఇక పైపైకే వెళుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

సంపద పెరగాలంటే 6 వాస్తు టిప్స్ తెలుసుకోవాల్సిందే
సంపద పెరగాలంటే 6 వాస్తు టిప్స్ తెలుసుకోవాల్సిందే (Unsplash)

కొందరికి సంపాదన బాగానే ఉన్నా నిల్వ అసలు ఉండదు. ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అలాంటి వారు ఈ 6 వాస్తు సూత్రాలను తప్పక తెలుసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

1.ఇంట్లో లీకేజీలు నివారించండి

ఇది వినడానికి చాలా సిల్లీగా అనిపించినా వాస్తు ప్రకారం ఇది నిజం. ఇంట్లో ఏ రకమైన లీకేజీ ఉన్నా అది ఆర్థిక నష్టాలకు సూచన. బాత్రూములు, కిచెన్, లేదా ఇంకెక్కడైనా లీకేజీ ఉంటే వెంటనే మరమ్మతు చేయించండి. ఇవి మీ కుటుంబానికి ఆర్థిక నష్టమే కాకుండా, ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి.

2. అపరిశుభ్రతకు నో చెప్పండి

మీ ఇంటిని ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండండి. లేదంటే ప్రతికూల శక్తి ఇంటిని కప్పేస్తుంది. ఆర్థికంగా నష్టం చేకూరుస్తుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కప్ బోర్డులు, కిటికీలు, దర్వాజలు సహా అన్ని గదులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండండి.

3. వెంటిలేషన్ లేదా?

వెంటిలేషన్ లేకపోవడం కూడా మీ ఆర్థిక ఇక్కట్లను పెంచుతుంది. గాలి వెలుతురు ఉండే ఇంటిలోకి ఆక్సిజన్, వెలుతురు మాత్రమే కాదు.. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంచి సంపద పోగయ్యేలా చేస్తుంది.

4. డబ్బు ఎక్కడ పెడుతున్నారు?

మీరు ఇంట్లో డబ్బు, నగలు ఎక్కడ పెడుతున్నారు? దీనికీ వాస్తు సూత్రం ఉంది తెలుసా? ఇంట్లో నైరుతి దిశలోనే మీ నగలు, డబ్బు దాచుకోవాలి. నైరుతిలో బీరువాలు ఉంచి వాటి లాకర్లు ఉత్తర లేదా ఈశాన్య దిశలో చూసేలా ఉండాలి. డబ్బుకు సంబంధించిన ప్రతి అంశాన్ని నైరుతి దిశలో ఉంచడం లాభిస్తుంది.

5. మెయిన్ డోర్‌ విషయం జాగ్రత్త

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ప్రవేశ ద్వారం చాలా ఆకర్షణీయంగా, పాజిటివ్‌గా ఉండేలా చూసుకోవాలి. లక్ష్మీదేవికి స్వాగతం పలికేలా ఉండాలి. మామిడి తోరణాలతో కళకళలాడేలా చూసుకోవాలి. ఇంటి ముందు ముగ్గులతో అలంకరణ చేసుకోవాలి.

6. కుబేర యంత్ర స్థాపన

ఇంట్లో అదృష్ట దిశ ఈశాన్యం. దీనిని కుబేరుడు పాలిస్తాడట. ఈ దిశలో దుమ్మూదూళి, బరువులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కు శుభ్రంగా ఉన్నప్పుడే అదృష్టం తలుపు తడుతుంది. ఈ దిశలో పూజ మందిరం, దైవ ప్రార్థన ఉండాలి. ఇక్కడ గానీ, ఉత్తర దిక్కులో గానీ కుబేర యంత్రాన్ని ప్రతిష్టించుకోవాలి.

WhatsApp channel

టాపిక్