తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Marriage Muhurtham: పెళ్లి సందడి మొదలైంది- మూడు నెలలు పెళ్ళిళ్ళకు ఇక మంచి ముహూర్తాలే

Marriage muhurtham: పెళ్లి సందడి మొదలైంది- మూడు నెలలు పెళ్ళిళ్ళకు ఇక మంచి ముహూర్తాలే

Gunti Soundarya HT Telugu

09 October 2024, 10:10 IST

google News
    • పెళ్లి సందడి మొదలైంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో పెళ్ళిళ్ళకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ మూడు నెలల్లో ఏయే తేదీలు వివాహానికి శుభ ముహూర్తాలు ఉన్నాయో చూసుకోండి. మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. 
పెళ్లి సందడి మొదలైంది
పెళ్లి సందడి మొదలైంది (freepik)

పెళ్లి సందడి మొదలైంది

గత కొన్ని రోజులుగా వివాహాది శుభ కార్యాలకు సరైన ముహూర్తాలు లేక పెళ్లి మండపాలు వెలవెలబోయాయి. ఇప్పుడు కళ్యాణ ఘడియలు ఆసన్నం అయ్యాయి. మూఢం, ఖర్మలు, చాతుర్మాసం, పితృ పక్షం అంటూ గత కొన్ని రోజులుగా వివాహాలకు శుభ ముహూర్తాలు కరువవయ్యాయి.

లేటెస్ట్ ఫోటోలు

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Dec 21, 2024, 01:36 PM

Cake Healthy or Unhealthy : హలో గురూ.. లొట్టలేసుకుంటూ కేక్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Dec 21, 2024, 01:23 PM

పార్లమెంట్​ ఉన్నది కొట్టుకోవడానికే! కిందపడేసి కొట్టి, చంప చెళ్లుమనిపించి..

Dec 21, 2024, 01:04 PM

ఇక ఈ ఏడాది ముగిసేందుకు మూడు నెలలు మాత్రమే ఉంది. అయితే ఈ మూడు నెలలో పెళ్లి ముహూర్తాలు పుష్కలంగా ఉన్నాయి. పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న జంటలకు మంచి ముహూర్తాలు వచ్చేశాయి. ఏ ప్రాంతంలో చూసిన పెళ్లి కళ వచ్చేసింది. పెళ్ళికి మంచి ముహూర్తాలు రావడంతో అటు బంగారం షాపులు, ఇటు కళ్యాణ మండపాలు, మరోవైపు షాపింగ్ సందడితో నగరాలు కళకళాడిపోతున్నాయి.

అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో పెళ్ళిళ్ళు చేసుకునేందుకు మొత్తంగా పాతిక రోజులు మంచివి ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. దసరా పండుగ నుంచి ముహూర్తాలు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 12, 13, 16, 20, 27 తేదీలో పెళ్ళిళ్ళు చేసుకునేందుకు మంచి ముహూర్తం ఉంది. 

అలాగే నవంబర్ లో 3, 7, 8, 9, 10, 13, 14, 16, 17 తేదీలు.. డిసెంబర్ లో 5, 6, 7, 8, 11, 12, 14, 15, 26 వరకు మూడు మాసాలలో అధికంగా ముహూర్తాలు ఉన్నాయి. దసరా పండుగతో పాటు పెళ్ళిళ్ళ సీజన్ గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు అనువైన రోజులు రావడంతో షాపింగ్ సందడి మొదలైంది. సుమారు ఈ మూడు నెలలో ఐదు వేలకు పైగా పెళ్ళిళ్ళు జరగబోతున్నాయని పెళ్లి మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే మండపాలు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినట్టు నిర్వహకులు వెల్లడించారు.

భారతీయ వివాహ వ్యవస్థను ప్రపంచ దేశాలు సైతం కీర్తిస్తాయి. కుటుంబ వ్యవస్థలో వివాహం అనేది చాలా కీలకమైనది. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం రెండు కుటుంబాల ఆమోదంతో పెద్దల ఆశీర్వచనాలతో వధూవరులు పెళ్లి బంధంతో ఒక్కటి అవుతారు.

అప్పటి వరకు వేర్వేరుగా జీవితాలు సాగించిన వధువు, వరుడు పెళ్లి తర్వాత ఒకే జీవితంగా మసులుకుంటారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవిస్తూ మనస్పర్థలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తూ కడవరకు కలిసే ఉండాలని పెద్దలు చెబుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. ఒక వయసుకు వచ్చిన తర్వాత సరైన జోడీని చూసి పెద్దలు వివాహం నిశ్చయిస్తారు. వివాహ బంధంతో ఒక్కటై కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం