Vivaha muhurtham: పెళ్లిళ్లకు ముహూర్తాలు వచ్చేశాయ్.. త్వరపడండి మళ్ళీ నాలుగు నెలలు ముహూర్తాలు లేవు
Vivaha muhurtham: శుక్రుడు, గురు గ్రహాలు ఉదయించడంతో మళ్ళీ శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ముహూర్తాలు వచ్చాయి. కేవలం నెల రోజుల్లో 10 రోజులు మాత్రం ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత నాలుగు నెలల పాటు ముహూర్తాలు లేవు.
Vivaha muhurtham: వివాహం వంటి శుభ కార్యాలు జరిగేందుకు దేవగురువు బృహస్పతి, శుక్ర గ్రహాలు శుభ స్థానంలో ఉండాలని జ్యోతిష్యులు చెప్తారు. ఈ రెండు శుభకరంగా ఉన్నప్పుడే ముహూర్తాలు ఉంటాయి. దాదాలు రెండు నెలల తర్వాత గురు, శుక్ర గ్రహాలు అస్తంగత్వ దశ నుంచి ఉదయించాయి.
గురు, శుక్రుడు అస్తమించడం వల్ల శుభ కార్యాలకు చాలా కాలం విరామం ఏర్పడింది. ఇప్పుడు శుక్రుడు ఉదయించాడు. ఏప్రిల్‌లో గురుడు ఉదయించాడు. గురు, శుక్రుడు ఉదయించడంతో వివాహం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. రెండు నెలలుగా శుభకార్యాలు నిలిచిపోయాయి.
శుభాలను ఇచ్చే శుక్రుడు ఏప్రిల్ 26న అస్తమించాడు. శుక్రుడు అస్తమించిన కొన్ని రోజుల వ్యవధిలోనే గురు గ్రహం కూడా అస్తంగత్వ దశలోకి వెళ్ళాయి. దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాలు ఒకే సారి అస్తంగత్వ దశలోకి వెళ్ళినట్టు పండితులు చెప్తారు.
మే 6న బృహస్పతి కూడా వృషభ రాశిలో అస్తమించాడు. గురు, శుక్రులు అస్తమించడం వల్ల వివాహం మొదలైన శుభ కార్యక్రమాలు జరగలేదు. మత గ్రంథాల ప్రకారం బృహస్పతి, శుక్రుడు అస్తంగత్వ దశలోకి వెళ్ళాయి. దీని వల్ల వివాహం, గృహ ప్రవేశాలు, శంఖు స్థాపన, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం వంటి పనులు చేయకుండా నిలిపివేస్తారు. దీంతో ప్రజలు రెండు నెలల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. సుమారు 23 ఏళ్ల తర్వాత మే, జూన్ నెలలో పెళ్లిళ్లకు ముహూర్తాలు లేకుండా ఉన్నాయి.
జులై నెలలో ముహూర్తాలు
జూన్ 2న బృహస్పతి ఉదయించాడు. ఇప్పుడు జూన్ 28న శుక్రుడు కూడా ఉదయించాడు. ప్రస్తుతం ఐదు రోజుల పాటు పంచకం నడుస్తోంది. దీని తర్వాత జూలై 2 నుంచి వివాహం తదితర శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు ముహూర్తాలు వచ్చాయి.
కాశీ విశ్వ పంచాంగం ప్రకారం జూలై 2 నుండి జూలై 15 వరకు 10 వివాహ శుభ ముహూర్తాలు ఉంటాయి. జూలై 17న దేవశయని ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభం కానుంది. విష్ణుమూర్తి యోగా నిద్రలోకి వెళ్ళే సమయాన్ని చాతుర్మాసం అంటారు. అప్పుడు నాలుగు నెలల పాటు వివాహం మొదలైన శుభకార్యాల శుభ ముహూర్తానికి విరామం ఉంటుంది.
ఎందుకంటే శ్రీమహా విష్ణువు చాతుర్మాసానికి నిద్రించే భంగిమలోకి వెళ్తాడు. అందుచేత నాలుగు నెలలపాటు శుభకార్యాలు ఉండవు. నవంబరు 12న దేవుత్థాని ఏకాదశి నుండి వివాహ శుభ సమయాలు మళ్లీ ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి డిసెంబర్ 14 వరకు కొనసాగుతాయి. జూలై నెలలో శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు 2, 3, 4, 9, 10, 11, 12, 13, 14, 15 తేదీలలో వివాహ శుభ సమయం ఉన్నట్టు పండితులు వెల్లడించారు.