తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi 2023 Makara Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మకరరాశి ఫలాలు

Ugadi 2023 Makara Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మకరరాశి ఫలాలు

HT Telugu Desk HT Telugu

21 March 2023, 14:56 IST

  • Ugadi 2023 Makara Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మకరరాశి ఫలాలు ఇక్కడ చూడొచ్చు. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

మకర రాశి ఉగాది 2023 రాశి ఫలాలు
మకర రాశి ఉగాది 2023 రాశి ఫలాలు

మకర రాశి ఉగాది 2023 రాశి ఫలాలు

Ugadi 2023 Makara Rasi Phalalu: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మకర రాశి ఫలాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

లేటెస్ట్ ఫోటోలు

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

ఈ రాశుల వారికి కష్ట కాలం.. డబ్బు నష్టం- ఎంత కష్టపడినా దక్కని ఫలితం!

May 04, 2024, 05:51 AM

మే 4, రేపటి రాశి ఫలాలు.. రేపు మేష రాశి నుంచి మీన రాశి వారికి ఎలా గడుస్తుందంటే

May 03, 2024, 08:34 PM

ఈ రాశుల వారికి అహంకారం ఎక్కువ, వీరిటో మాట్లాడడం కష్టం

May 03, 2024, 04:29 PM

Ego Rasis: ఈ రాశుల వారికి కాస్త ఇగో ఎక్కువే.. ఎవరి మాట వినరండోయ్

May 03, 2024, 03:37 PM

మకరరాశి వారికి ఆదాయం - 11 వ్యయం - 5, రాజపూజ్యం - 2 అవమానం - 6

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మకరరాశి వారికి రాశి ఫలాలు మధ్యస్తంగా ఉన్నట్టు చిలకమర్తి చెప్పారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా మకరరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 4వ స్థానమునందు సంచరిస్తున్నాడు. శని 2వ స్థానమునందు సంచరిస్తున్నాడు. రాహువు మాతృ స్థానమగు 4వ స్థానము యందు సంచరిస్తున్నాడు. కేతువు 10వ స్థానము నందు సంచరిస్తున్నాడు.

ఈ గ్రహ స్థితి కారణంగా మకరరాశి వారికి ఈ సంవత్సరంలో మధ్యస్థ ఫలితములు ఉన్నవి. మకరరాశి వారు ఏలినాటి శని యొక్క అంత్య భాగము నందు ఉండటం, బృహస్పతి చతుర్ధ స్థానము నందు సంచరించుటచేత మకరరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో మధ్యస్త ఫలితాలు ఏర్పడుతున్నాయి.

ఈ సంవత్సరం ఆరోగ్య విషయమందు మకరరాశివారు జాగ్రత్తలు వహించాలి. శారీరక శ్రమ పెరుగును. వాక్ స్థానమునందు శని సంచారంచేత గొడవలు, మరియు రౌద్రముతో కూడినటువంటి మాటలు పెరుగును. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచన. చతుర్ధ స్థానమందు రాహువు ప్రభావం చేత పనులు వ్యవహారములయందు ఆటంకములు ఏర్పడును. ఉద్యోగ ప్రయత్నములు సఫలీకృతమగును. కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు పెరుగును. మరియు చికాకులు ఏర్పడును. మొత్తం మీద మకరరాశివారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి.

మకర రాశి ఉద్యోగులకు ఉగాది 2023 రాశి ఫలాలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మకరరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మధ్యస్త ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడులు ఎదుర్కోవలసినటువంటి స్థితి ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండవలసినటువంటి సమయం. ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు.

మకరరాశి వ్యాపారస్తులకు మధ్యస్ధ సమయం. వ్యాపారంనందు అప్పులు చేయవలసిన పరిస్థితి. రావలసినటువంటి ధనం సమయానికి చేతికి రానటువంటి స్థితి ఏర్పడును. మకరరాశి విద్యార్థులకు అనుకూలంగా ఉన్నది. కష్టపడి చదువుకోవాల్సిన సమయం.

మకరరాశి స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు వేధించును. ఆర్ధిక సమస్యలు మరియు ఒత్తిళ్ళు పెరుగును. మకరరాశి సినీరంగం వారికి మధ్యస్త ఫలితాలున్నాయి. మకరరాశి రైతాంగానికి అంత అనుకూలంగా లేదు. మొత్తం మీద మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావంచేత ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సంవత్సరం.

శుభ ఫలితాల కోసం

మకరరాశి వారు ఈ సంవత్సరం మరిన్ని శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం, శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రము పఠించడం, గురువారం దత్తాత్రేయుని పూజించడం చేయాలి. అలాగే శనివారం దుర్గాదేవిని పూజించడం మంచిది.

మాసవారి ఫలితములు

ఏప్రిల్ : ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకం. మెరుగైన పనితీరుకు అనుగుణంగా మీకు ప్రశంసలు మరియు ప్రమోషన్లు పొందుతారు. సంపద వృద్ధి అగును.

మే : ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో సంతోషం. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. గృహ సౌఖ్యానికి ప్రాధాన్యత. వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

జూన్: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులు ఉద్యోగ విషయంలో పై అధికారుల నుండి సమస్యలు ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి, వాదనలకు దూరంగా ఉండాలి.

జూలై : ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలపై వైద్యుని సలహా పాటించాలి. కుటుంబ సభ్యులతో సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి.

ఆగస్టు : ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి. విద్యార్థులకు విదేశీ విద్య. నూతన అవకాశాలు.

సెప్టెంబర్: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. సమస్యలలో చిక్కుకుంటారు. ప్రయాణములో అవరోధములు. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ విషయాలలో అసంతృప్తి.

అక్టోబర్ : ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులను నియంత్రించుకోవాలి. మానసిక ప్రశాంతత లేకపోవడం. శత్రువుల నుండి సమస్యలు.

నవంబర్: ఈ మాసం మీకు మధ్యస్తమునుండి అనుకూలంగా ఉంది. గత మాసంలో కంటే ఆరోగ్య సమస్యలనుండి ఉపశమనం. దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. అధికార వృద్ధి కలుగును.

డిసెంబర్: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. సమస్త దోషాలు తొలగి ఐశ్వర్యాలు వరిస్తాయి. ఎక్కువ శ్రమ లేకుండా వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు.

జనవరి: ఈ మాసం మీకు మధ్యస్తముగా ఉన్నది. నిద్రలేమి, మానసిక ప్రశాంతత లేకపోవుట. ఖర్చులు అధికమగును. మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆర్ధిక సమస్యల నుండి బయటపడతారు.

ఫిబ్రవరి:- ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వివాహ అవకాశాలు, వినోదం మరియు వ్యాపారంలో వృద్ధి. మంచి ఫలితాలను పొందుతారు. సంపద కలుగును. ఆనందంగా గడుపుతారు.

మార్చి: ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. నూతన వస్తు, వస్త్రాభరణాల ప్రాప్తి. విద్యావిషయాల్లో ఉత్తీర్ణత పొందుతారు. ఇతరులకు ఆనందాన్ని సంతృప్తిని కల్గిస్తుంది.

- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ